నోటి క్యాన్సర్ అనేది జాతీయ ఆరోగ్య ప్రాధాన్యత. భారతదేశంలో రిపోర్ట్ చేయబడిన మొత్తం క్యాన్సర్లలో 30% నోటి క్యాన్సర్లే కావడం అందుకు కారణం.
ప్రపంచంలో నోటి క్యాన్సర్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం, ఇక్కడ 77,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి మరియు నోటి క్యాన్సర్ కారణంగా 51,000 మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు 70% కేసులన్నీ ఇతర శరీర భాగాలకు వ్యాపించిన తరువాత కనుగొనబడ్డాయి. దీనినే అడ్వాన్స్డ్ స్టేజ్ (advanced stage) నోటి క్యాన్సర్ అంటారు.
ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ కారణంగా, చికిత్స చేయడం మరింత కష్టతరం అవుతుంది మరియు మనుగడ రేటు తగ్గిపోతుంది. అందువలన నోటి క్యాన్సర్‌ను నివారించడం మరియు ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం.
ఈ కథనంలో, నోటి క్యాన్సర్‌ను నివారించడానికి మరియు దాని ప్రారంభ దశలో గుర్తించడానికి మేము 10 సులభమైన మార్గాలను అందిస్తున్నాము.
నోటి క్యాన్సర్ అంటే ఏమిటి?
నోటి క్యాన్సర్ నోటిలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేసే క్యాన్సర్‌ను సూచిస్తుంది. నోటి క్యాన్సర్ ప్రభావితం చేసే కొన్ని ప్రాంతాలు:
- పెదవి
- నాలుక కింద భాగం
- చెంప లైనింగ్/పొర
- చిగుళ్ళు
- అంగిలి లేదా నాలుక ముందు భాగం
నోటి క్యాన్సర్‌ను ఎలా నివారించాలి?
నోటి క్యాన్సర్‌ను నివారించడానికి మీరు చేయగలిగే 10 ఆచరణాత్మక మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు నుండే వాటిని ఆచరించడం ప్రారంభించండి.
-
పొగాకు వినియోగాన్ని ఆపివేయండి
నోటి క్యాన్సర్‌కు అతి ముఖ్యమైన కారణం పొగాకు నమలడం. అత్యంత సులభంగా నివారించదగిన కారణం కూడా ఇదే. పొగాకు నమలడం వల్ల నోరు, అన్నవాహిక, ముక్కు మరియు ఒరోఫారింజియల్ క్యాన్సర్లు మొదలైన అనేక రకాల క్యాన్సర్‌లు వస్తాయి.
గుట్కా, జర్దా, ఖైనీ, ఆకు రూపంలో ఉండే పొగాకుతో సహా అన్ని రకాల పొగాకు చాలా హానికరం. క్యాన్సర్‌తో పాటు, ఇవి గుండె జబ్బులు , గుండె పోటు వంటి అనేక ఇతర వ్యాధులకు కారణమవుతాయి.
-
తమలపాకులు లేదా పాన్ నమలకండి
భారతదేశంలో నోటి క్యాన్సర్‌కు తమలపాకులు నమలడం ప్రధాన కారణం. తమలపాకులను పచ్చిగా లేదా ప్రాసెస్ చేసిన (పాన్ మసాలా) రూపంలో నమలడం మానుకోండి.
పాన్ అనేది పొగాకుతో లేదా పొగాకు లేకుండా తమలపాకులతో చేసిన తయారీ. ఇది నోటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొనబడింది.
పాన్ నమలడం వల్ల కాలేయం, కడుపు, మూత్రపిండాలు మరియు వృషణాలు కూడా దెబ్బతింటాయి.
-
ధూమపానం మానేయండి
నోటి క్యాన్సర్ రోగులలో 80 నుండి 90% వరకు ధూమపానం సాధారణ జీవనశైలి అలవాటుగా గమనించబడింది.
ధూమపానం మానేయడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కూడా గమనించబడింది. 9 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ధూమపానం మానేసిన వ్యక్తులలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% వరకు తగ్గుతుంది.
మీరు ధూమపానం మానేయలేకపోతే, డి-అడిక్షన్ థెరపిస్ట్‌ని (De-addiction therapist) సంప్రదించండి. ఆచరణాత్మక చిట్కాలు మరియు మందులతో ధూమపానం మానేయడంలో ఈ వైద్యుడు మీకు సహాయం చేయగలడు.
-
HPV ఇన్ఫెక్షన్ల నుండి మీ నోటిని రక్షించుకోండి
జీవనశైలి అలవాట్లతో పాటు, లైంగిక కార్యకలాపాలు కూడా ఓరోఫారింజియల్ క్యాన్సర్‌కు ప్రమాద కారకం. అసురక్షితంగా నోటితో లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV; human papillomavirus) సంక్రమించే అవకాశాలు పెరుగుతాయి, ఇది నోటి క్యాన్సర్‌గా అభివృద్ధి చెందుతుంది.
అనేక నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలు మరియు రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వాటిలో ఏవీ HPV-పాజిటివ్ నోటి మరియు ఒరోఫారింజియల్ క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించలేవు.
ఒరోఫారింజియల్ క్యాన్సర్‌లకు HPV కూడా ప్రధాన కారణం. HPV-16 అనేది HPV యొక్క ఉప రకం, ఇది చాలా నోటి క్యాన్సర్ కేసులకు కారణం మరియు పురుషులు మరియు స్త్రీలను సమానంగా ప్రభావితం చేస్తుంది.
-
మీ దంతాలు మరియు మీ దంతాల మధ్య శుభ్రం చేసుకోండి
రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం ముఖ్యం. దంతాల మధ్య ఎటువంటి ఆహారపదార్థాలు ఉండకుండా ఉండేందుకు ఫ్లాసింగ్ (దంతాల మధ్య శుభ్రంచేసుకునే ప్రక్రియ) తప్పనిసరి.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) నోటిలో ఉండవచ్చు మరియు పరీక్షించకపోతే, అది నోటి క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
అపరిశుభ్రమైన నోరు మీ రోగనిరోధక వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మరియు క్యాన్సర్‌లతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
-
దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించండి
ప్రతి 6 నెలలకు ఒకసారి మీ నోటిని పరీక్షించడానికి దంతవైద్యుడిని (orthodontist) సంప్రదించండి.
నోటి క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలను దంతవైద్యుడు సాధారణ పరీక్షతో గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నోటి లోపల చిన్న గాయం కావచ్చు, నాలుకపై పుండు కావచ్చు లేదా నోటిలో ఏదైనా అసాధారణ పెరుగుదల కావచ్చు.
దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం నోటి క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు గుర్తించడంలో సహాయపడుతుంది. తరువాతి దశలలో చికిత్సతో పోలిస్తే, ఈ సమయంలో, సులభంగా తక్కువ ఖర్చుతో చికిత్స చేయవచ్చు మరియు చికిత్స మరింత విజయవంతమవుతుంది.
పొగాకు, పాన్, ధూమపానం లేదా క్రమం తప్పకుండా మద్యం సేవించే వారికి ఇది చాలా ముఖ్యం.
అలాంటి అలవాట్లు లేకపోయినా, ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించడం మరియు మీ నోరు పరిశుభ్రంగా ఉందని నిర్ధారించడానికి గొప్ప మార్గం.
పదునైన దంతాలు నోటి కణజాలాలకు పదేపదే గాయాలు కలిగించడం ద్వారా నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని కనుగొనబడింది. మీకు పదునైన దంతాలు ఉంటే దంత సర్జన్ సంప్రదింపులు అవసరం.
-
కనీసం ప్రతి నెలా ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోండి
రొమ్ము స్వీయ-పరీక్షల మాదిరిగానే, మీ నోరు స్వీయ-పరీక్షలు అసాధారణతలను ముందస్తుగా గుర్తించడానికి సహాయపడుతుంది. మీ నోటి లోని ప్రతి భాగాన్ని అనగా నాలుక పైన, నాలుక క్రింద, చిగ్గుళ్ళు, దవడలు మరియు అన్ని వైపులా క్షుణ్ణంగా తనిఖీ చేయండి.
మీరు గడ్డలు, లేత ప్రాంతాలు లేదా రంగు (ఎరుపు/తెలుపు/బూడిద) పాచెస్ వంటి ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే (లేదా అనుభూతి చెందితే), వెంటనే దాన్ని తనిఖీ చేయడానికి మీ దంతవైద్యునితో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి.
-
క్యాన్సర్‌ను నిరోధించే ఆహారాలను తినండి
తగినంత తాజా కూరగాయలు మరియు పండ్లను కలిగి ఉన్న ఆహారం అన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నోటి క్యాన్సర్‌ను నిరోధించే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగివున్న బీన్స్, బెర్రీలు, ఆకు కూరలు మరియు పీచుతో కూడిన కూరగాయలు (క్యాబేజీ మరియు బ్రోకలీ వంటివి), అవిసె గింజలు, వెల్లుల్లి, ద్రాక్ష, గ్రీన్ టీ, సోయా మరియు టొమాటోలను ఎక్కువగా తినండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్ వంటి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు మరియు శీతల పానీయాలు వంటి చక్కెర శాతం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఇవి మీ శక్తి స్థాయిలను తాత్కాలికంగా పెంచే ఖాళీ కేలరీలను అందిస్తాయి కానీ శరీరానికి పోషణను అందించవు.
-
సూర్య కిరణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి
మీరు ఆరుబయట అడుగు పెట్టేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యమని మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. ఇది మన చర్మాన్ని UV రేడియేషన్ నుండి మరియు చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. నిత్యం సన్‌స్క్రీన్ వాడే చాలామంది, పెదాలను కూడా సూర్యుని నుంచి కాపాడుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారు.
UV కిరణాలకు ఎక్కువగా గురికావడం పెదవులపై, ముఖ్యంగా కింది పెదవిపై క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు బయటకి అడుగుపెట్టినప్పుడు మీ పెదాలకు UV-A/B-బ్లాకింగ్ సన్ ప్రొటెక్షన్‌ని ఉపయోగించడం వల్ల పెదవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడవచ్చు.
-
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
ఊబకాయం అన్ని రకాల క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి, సమతుల్య ఆహారం మరియు చురుకైన జీవనశైలి ముఖ్యం.
రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. మీరు ఈ వ్యాయామాలలో దేనినైనా చేయవచ్చు; వేగంగా నడవడం, క్రీడలు, ఏరోబిక్ వ్యాయామాలు, ఈత, కండరాల శిక్షణ మొదలైనవి.
చురుకైన జీవనశైలి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వ్యాయామ దినచర్యకు కట్టుబడి ఉండటం మీకు కష్టంగా అనిపిస్తే, క్లబ్‌లో చేరడం లేదా మీతో వ్యాయామం చేయగల స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులను కనుగొనడం గురించి ఆలోచించండి. ఇది మా వర్కవుట్‌లతో మరింత రెగ్యులర్‌గా ఉండటానికి మీకు సహాయపడవచ్చు.
డ్యాన్స్, ఏరోబిక్స్ మరియు యోగా వంటి కార్యకలాపాల కోసం అనేక ఆన్‌లైన్ ఫిట్‌నెస్ క్లబ్‌లు మరియు తరగతులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఉచితం కూడా. మీరు వీటిలో కొన్నింటిని ప్రయత్నించి, మీరు ఏవి ఎక్కువగా ఆనందిస్తున్నారో చూడగలరు.
పైన పేర్కొన్న కారణాలే కాకుండా, రేడియేషన్ లేదా హానికరమైన రసాయనాలకు దీర్ఘకాలికంగా గురికావడం వంటి వృత్తిపరమైన ప్రమాదాలు కూడా వివిధ రకాల క్యాన్సర్‌లకు దారితీయవచ్చు. అటువంటి కార్సినోజెన్‌లకు (క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు) కనీస బహిర్గతం ఉండేలా మీ కార్యాలయంలో మరియు ఇంటిని తనిఖీ చేయండి.
‘చికిత్స కంటే నివారణే మేలు’ అన్న సామెత. పైన ఇవ్వబడిన ఆచరణాత్మక దశలను అనుసరించడం ద్వారా, మీరు అడ్వాన్స్‌డ్ స్టేజ్ నోటి క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే మీ ప్రమాదాన్ని తీవ్రంగా తగ్గించుకుంటారు.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి
మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.