యువతులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు – ఏ లక్షణాలను గమనించాలి?

by Team Onco
1263 views

యువతులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:

రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) అనేది 15 నుండి 39 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో అత్యంత సాధారణంగా సంభవించే క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్‌ను నివారించలేము, కానీ రొమ్ము క్యాన్సర్‌ వల్ల కలిగే మరణాలను తగ్గించవచ్చు. రొమ్ము క్యాన్సర్ మరణాలను నివారించడానికి ఉత్తమ మార్గం దానిని ముందుగానే గుర్తించడం మరియు సరైన శాస్త్రీయ ప్రోటోకాల్‌ల (Scientific Protocols) ప్రకారం చికిత్స చేయడం.

రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ఎందుకు ముఖ్యం?

రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించినప్పుడు ఉత్తమంగా చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఈ దశలో, కణితులు (tumours) సాధారణంగా చాలా చిన్నవిగా ఉంటాయి మరియు క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించి ఉండదు.

రొమ్ము క్యాన్సర్ యొక్క తొలి లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:

(గమనిక: ఈ లక్షణాలు ఉంటే మీకు క్యాన్సర్ ఉన్నట్లు అని మీకు మీరే నిర్ధారించుకోకండి. మీరు ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే వైద్యుని సంప్రదించమని మేము సూచిస్తున్నాము).

 • రొమ్ము లేదా అండర్ ఆర్మ్ ప్రాంతం అసాధారణంగా గట్టిపడటం లేదా గడ్డలు వంటివి ఏర్పడటం
 • రొమ్ము రంగులో మార్పులు రావడం
 • చనుమొన(ల) నుండి అసాధారణ ద్రవాలు విడుదలవ్వడం
 • రొమ్ము మొత్తం లేదా రొమ్ములో కొంత భాగం వాపు
 • రొమ్ము(లు) పరిమాణం లేదా ఆకృతిలో మార్పు
 • చనుమొన(లు) దురద లేదా పుండ్లు
 • రొమ్ము(ల) చర్మంపై గుంటలు పడటం
 • చనుమొనలు (Nipples) లోపలికి తిరగడం

యువతులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు – స్వీయ పరీక్షలు చేయడం

చాలా మంది వైద్య నిపుణులు రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి సులభమైన మార్గం స్వీయ-పరీక్ష (Self -Examination) అని నొక్కి చెప్పారు.

రొమ్ము క్యాన్సర్ కోసం స్వీయ పరీక్ష ఎలా నిర్వహించాలి?

#నో యువర్ లెమన్స్ ఉద్యమం (The #KnowYourLemons Movement)
WordWideBreastCancer.org మరియు KnowYourLemons.com వంటి వెబ్‌సైట్‌లు క్యాన్సర్‌కు దారితీసే గడ్డలను గుర్తించడం, మరియు గుర్తించడం కోసం ప్రసిద్ధి చెందిన మార్గదర్శకాలను రూపొందించడంలో కీలక పాత్ర పోశించాయి. KnowYourLemons.comలో మీరు దీన్ని మరింత వివరంగా తనిఖీ చేయవచ్చు.

రొమ్ము గడ్డల గుర్తింపు:
Diagnose breast cancer through the given ymptoms

యువతులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు – ప్రమాదాలను తగ్గించడానికి మార్గాలు?

మేము ముందు చెప్పినట్లుగా, రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) నిరోధించబడదు. అయినప్పటికీ, మీ శరీరానికి మొత్తం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఆరోగ్యకరమైన జీవనశైలి (healthy lifestyle) చాలా ఉపయోగకరం.

ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులు:

 • తగినంత తాజా పండ్లు మరియు కూరగాయలతో సమతుల్య భోజనం తినడం
 • బరువు నియంత్రణ
 • ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగటం (రోజుకు కనీసం 3-4 లీటర్లు)
 • క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం పొందడం (ఈత, సైక్లింగ్, రన్నింగ్, లేదా జంపింగ్ రోప్స్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాయామాలు)
 • సాధారణ శారీరక శ్రమ ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
 • విటమిన్ డి మరియు కాల్షియం యొక్క సరైన వినియోగం
 • మద్యపానాన్ని నిషేధించండి లేదా పరిమితం చేయండి
 • అన్ని రకాల పొగాకును నివారించండి

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

Related Posts

Leave a Comment