మీ కోసం సరైన ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనాలి?

by Team Onco
446 views

మీరు ఒక సాధారణ వైద్యుడు లేదా ఆంకాలజిస్ట్ ద్వారా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయబడవచ్చు. రోగనిర్ధారణ పూర్తయిన తర్వాత, మీరు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు ఏమిటో మీరు తెలుసుకోవాలని అనుకోవచ్చు.

క్యాన్సర్ నిర్ధారణ తర్వాత మీరు తీసుకోవాల్సిన మొదటి చర్య సరైన  ఆంకాలజిస్ట్‌ని ఎంచుకోవడం. కేన్సర్ కేర్ గురించి తగినంత అవగాహన లేని కొంతమంది స్నేహితుల సిఫార్సులు లేదా ఊహాగానాలపై  ఆధారపడకుండా, మీకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించి సరైన  వైద్యుడిని కనుగొనడం ఉత్తమం.

ఈ వ్యాసంలో, మీరు సరైన ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనవచ్చో మరియు నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు పరిగణించవలసిన అన్ని అంశాల గురించి తెలుసుకోవచ్చు.

Best oncologist is important for cancer patients to get the right cancer treatment

సరైన ఆంకాలజిస్ట్‌ని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

ఆంకాలజిస్ట్‌లందరూ సమాన అర్హత కలిగి ఉన్నప్పటికీ, మీరు ఎవరిని సంప్రదించాలి అనేది మీ క్యాన్సర్ చికిత్సా ప్రయాణంలో కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకో చూద్దాము:

నైపుణ్యం: వివిధ రకాల క్యాన్సర్‌లలో వివిధ రకాల క్యాన్సర్‌ నిపుణులు ప్రత్యేకత కలిగి ఉంటారు. ఇంకా, వారు కీమోథెరపీ, సర్జరీ మరియు రేడియేషన్ వంటి వివిధ రకాల చికిత్సలలో కూడా ప్రత్యేకత కలిగి ఉన్నారు. మీరు మీ క్యాన్సర్ రకం మరియు దశకు అత్యంత సరిపోయే వైద్యుడిని కనుగొనవలసి ఉంటుంది.

సౌకర్యం: క్యాన్సర్ చికిత్సలు అనేక పద్ధతులలో ఉంటాయి మరియు ఎక్కువ కాలం ఉంటాయి. చాలా మంది రోగులకు మరియు వారి కుటుంబాలకు ఇది ఒక భావోద్వేగ ప్రయాణం అవుతుంది. ఈ సమయంలో వారికి సరైన సలహా మరియు ప్రోత్సాహం నిరంతరం అవసరం. మీరు సమర్థవంతంగా మరియు సౌకర్యంగా మాట్లాడగలిగే సరైన ఆంకాలజిస్ట్‌ని కనుగొనడం మరింత ముఖ్యమైనది.

నమ్మకం: మీ చికిత్స యొక్క ప్రతి దశ గురించి సమాచారం అందించే మరియు స్వేచ్ఛగా ప్రశ్నలు అడగడానికి మిమ్మల్ని అనుమతించే వైద్యుడిని కలిగి ఉండటం మీకు నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. మీరు మీ ఆరోగ్యంపై అతను/ఆమెకు బాధ్యత ఇస్తున్నందున, మీరు వారిని నమ్మడం చాలా ముఖ్యం.

నేను ఉత్తమ ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనగలను?

ఈ ప్రక్రియలో మీరు మొదటగా అర్దం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్యాన్సర్ రోగులందరికీ ‘నంబర్ 1’ లేదా ‘ఉత్తమ ఆంకాలజిస్ట్’ అని పిలవబడే ఆంకాలజిస్ట్ లేడని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఒక్కో రకమైన క్యాన్సర్ కు మరియు ఒక్కో రకమైన చికిత్సకు దానికి దగ్గ నిపుణులు ఉంటారు.

మీరు శస్త్రచికిత్స నుండి కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీకి మారినప్పుడు మీ చికిత్స కోసం ఒకటి కంటే ఎక్కువ మంది ఆంకాలజిస్ట్‌లు అవసరమవుతారు.

మీ చికిత్స కోసం ఉత్తమమైన ఆంకాలజిస్ట్(ల)ను కనుగొనడానికి మీరు అనుసరించగల ప్రణాళికను మేము సిద్దం చేశాము.

స్టెప్ 1: మీ క్యాన్సర్ రకాన్ని కనుగొనండి

క్యాన్సర్‌లు శరీరంలోని ఏ భాగంలో ఏర్పడ్డాయి అనే దాని ఆధారంగా ఎన్నో రకాలుగా విభజించబడ్డాయి. ఉదాహరణకు, రొమ్ము క్యాన్సర్‌లు రొమ్ములో మొదలవుతాయి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు ఊపిరితిత్తులలో మొదలవుతాయి మరియు మొదలైనవి.

కొన్నిసార్లు, ఈ క్యాన్సర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. కానీ మీ బయాప్సీ ఫలితాల రిపోర్టు సాధారణంగా క్యాన్సర్ ఎక్కడ మొదలయ్యిందో నిర్ధారించగలదు.

ఒక్కో ఆంకాలజిస్టులు ఒక్కో క్యాన్సర్ చికిత్సలో ప్రత్యేకత కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీకు ఉన్న క్యాన్సర్ రకంలో నైపుణ్యం కలిగిన ఆంకాలజిస్ట్‌లకు మాత్రమే ఎంచుకోవచ్చు, ఇది పనిని ఇంకాస్త సులువు చేస్తుంది.

స్టెప్ 2: మీకు ఏ రకమైన చికిత్స అవసరమో తెలుసుకోండి 

మీ క్యాన్సర్ దశ మరియు రకాన్ని బట్టి, మీరు శస్త్రచికిత్స, లేదా కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ లేదా మరేదైనా చికిత్స చేయించుకోవాలి.

శస్త్రచికిత్సలో నైపుణ్యం కలిగిన ఆంకాలజిస్ట్‌లను సర్జికల్ ఆంకాలజిస్ట్‌లు (surgical oncologists) అని పిలుస్తారు, కీమోథెరపీ లేదా ఇమ్యునోథెరపీలో నైపుణ్యం కలిగిన వారిని మెడికల్ ఆంకాలజిస్ట్‌లు (medical oncologists) మరియు రేడియేషన్ థెరపీలో నైపుణ్యం కలిగిన వారిని రేడియేషన్ ఆంకాలజిస్ట్‌లు (radiation oncologists) అంటారు.

సాధారణంగా, ఒక క్యాన్సర్ ఆసుపత్రి, అన్ని రకాల నిపుణులను కలిగి ఉంటుంది మరియు వారు మీ కేసును కలిసి పరిశీలిస్తారు. వారు మీ క్యాన్సర్ దశను కనుగొంటారు మరియు దాని ఆధారంగా, వారు మీ కోసం చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు.

స్టెప్ 3: అర్హతలు మరియు అనుభవం కోసం చూడండి

వైద్యులందరూ ఐదారేళ్ల ఎంబీబీఎస్ చదువులు పూర్తి చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత మరో మూడు సంవత్సరాల స్పెషలైజేషన్ పూర్తి చేస్తారు. మెడికల్, సర్జికల్ మరియు హెమటో ఆంకాలజిస్టులు MBBS తర్వాత మూడు సంవత్సరాల స్పెషలైజేషన్ మరియు మరో మూడు సంవత్సరాల సూపర్ స్పెషలైజేషన్ పూర్తి చేస్తారు.

మీ రకం క్యాన్సర్‌కు చికిత్స చేయడంలో ఎక్కువ అనుభవం ఉన్న ఆంకాలజిస్ట్ కోసం వెతకండి. అరుదైన రకాల క్యాన్సర్లకు ఇది చాలా ముఖ్యం.

స్టెప్ 4: ప్రాంతాల గురించి వెతకండి

కన్సల్టెషన్స్ కోసం ఆంకాలజిస్ట్ ఏ హాస్పిటల్స్ మరియు క్లినిక్‌లకు వస్తారో తెలుసుకోండి. అలాగే, వారు అవసరమైనప్పుడు వీడియో కన్సల్టెషన్స్ ను అందిస్తారో లేదో మరియు మీరు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ద్వారా వారిని సంప్రదించవచ్చో లేదో తెలుసుకోండి.

మీ ఆంకాలజిస్ట్‌ మీకు సులువుగా అందుబాటులో ఉంటే అది చాలా వరకు మేలు చేస్తుంది, ఎందుకంటే మీరు గమనించే ఏవైనా కొత్త దుష్ప్రభావాలు లేదా లక్షణాల గురించి వారిని సలహాలు అడిగి మీ ఆందోళనను తగ్గించుకోవచ్చు. మీరు వారాంతాల్లో లేదా సెలవుల్లో ఆంకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వగలరో లేదో తెలుసుకోండి.

మీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఆంకాలజిస్ట్‌ని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం, ఎందుకంటే నిరంతర ప్రయాణం చికిత్స సమయంలో కష్టంగా ఉంటుంది మరియు మిమ్మల్ని మరిన్ని ఇన్‌ఫెక్షన్‌లకు గురి చేస్తుంది.

క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే మీకు అవసరమైన అన్ని వైద్య సేవలను మీరు ఒకే దగ్గర పొందగలుగుతారు. రోగనిర్ధారణ పరీక్షలు, రేడియేషన్ సెషన్‌లు మొదలైన వాటి కోసం మీరు వేర్వేరు ప్రదేశాలను సందర్శించాల్సిన అవసరం ఉండదు.

స్టెప్ 5: మీ బీమా పాలసీ లేదా హెల్త్ కార్డ్‌ని చెక్ చేసుకోండి

మీరు మీ చికిత్స ఖర్చులను కవర్ చేయడానికి బీమా లేదా హెల్త్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, మీరు మీ ఆంకాలజిస్ట్‌ని కలిసే ఆసుపత్రి లేదా క్లినిక్ దానిని అంగీకరిస్తుందా లేదా నిర్ధారించుకోండి.

అన్ని ఆసుపత్రులు అన్ని బీమా కార్డులు మరియు ఆరోగ్య కార్డులను అంగీకరించవు. మీరు చికిత్స ప్రారంభించే ముందు చెక్ చేయడం మరియు తదనుగుణంగా చికిత్స కోసం మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం ఉత్తమం.

స్టెప్ 6: ఆంకాలజిస్ట్‌ని కలవండి

మీరు ఆంకాలజిస్ట్‌ని కలిసినప్పుడు మాత్రమే వారి మాట్లాడే తీరును మీకు సౌకర్యంగా, నమ్మకంగా ఉందా లేదా తెలుసుకోగలరు. మీరు కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా దీన్ని చేయవచ్చు.

కొంతమంది ఆంకాలజిస్ట్‌లు ఇతరుల కంటే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇవ్వవొచ్చు. మీ చికిత్సను మీకు వివరించడానికి సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడే ఆంకాలజిస్ట్ నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు.

క్లినిక్ లేదా ఆసుపత్రిని చూడటం వల్ల ఆసుపత్రి యొక్క సౌకర్యాలు మీ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడంలో కూడా మీకు సహాయం చేస్తుంది.

నేను ఎక్కడ సహాయం పొందగలను?

మీ క్యాన్సర్‌కు ఉత్తమమైన ఆంకాలజిస్ట్‌ల గురించి తెలుసుకోవడం చాలా కష్టం. Onco మీకు ఈ సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. ఈ సమాచారాన్ని పొందడానికి మీరు 7996579965 నెంబర్ వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు.

అదనంగా, మీరు ఎంచుకున్న తేదీలో వారు అందుబాటులో ఉన్నారో లేదో తనిఖీ చేసిన తర్వాత, మీకు నచ్చిన ఆంకాలజిస్ట్‌తో అపాయింట్‌మెంట్‌లను పొందడానికి కూడా మేము మీకు సహాయం చేస్తాము.

మీరు మా వెబ్‌సైట్‌లో వారి అర్హతలు, అనుభవం మరియు స్థానంతో పాటు నిపుణులైన ఆంకాలజిస్టుల వివరాలను కూడా కనుగొనవచ్చు .

నా ఆంకాలజిస్ట్ నాకు సరైన చికిత్స ఇస్తున్నారని నాకు ఎలా తెలుస్తుంది?

ఇది చాలా మంది క్యాన్సర్ రోగులు మరియు సంరక్షకుల మనసులో ఉండే ప్రశ్న. మీరు ఎంచుకున్న ఆంకాలజిస్ట్‌ల చికిత్స బృందాన్ని నమ్మడం చాలా ముఖ్యం. కానీ వారు సూచించిన చికిత్స మీకు సరైనదేనా అని మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలనుకుంటే, మీరు రెండవ అభిప్రాయాన్ని(second opinion) పొందవచ్చు.

ఏదైనా వైద్య చికిత్స కోసం, లోపానికి కాస్తంత అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయాన్ని పొందాలని సిఫార్సు చేయబడింది. మీకు రెండవ అభిప్రాయాన్ని కోరే హక్కు ఉంది మరియు మీ వైద్య బృందానికి దీనితో సమస్య ఉండకూడదు.

అదే రకమైన క్యాన్సర్‌లో నైపుణ్యం ఉన్న మరొక ఆంకాలజిస్ట్‌తో మీ రిపోర్టులను పంచుకోవడం ద్వారా మీరు రెండవ అభిప్రాయాన్ని పొందవచ్చు. Oncoలో, మీ రిపోర్టులను అధ్యయనం చేసి, మీ కోసం ఉత్తమమైన చికిత్సను సూచించే నిపుణుల ప్యానెల్ నుండి ఆన్‌లైన్లో అభిప్రాయాన్ని పొందడానికి మేము మీకు సహాయం చేస్తాము.

మీకు కావాలంటే మీరు ఈ రిపోర్టును మీ ఆంకాలజిస్ట్‌తో పంచుకోవచ్చు.

చికిత్స వ్యవధి, సాధ్యమయ్యే ఫలితాలు, మనుగడ రేటు, చికిత్స తర్వాత జీవన నాణ్యత మొదలైన ఏవైనా ప్రశ్నలకు కూడా మా ప్యానెల్ సమాధానమిస్తుంది.

నేను ఇంకా ఎవరిని సంప్రదించాలి?

మీ క్యాన్సర్ రకం మరియు దశపై ఆధారపడి, మీ బృందంలో మీకు మెడికల్, శస్త్రచికిత్స మరియు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అవసరం కావచ్చు.

చికిత్స సమయంలో మరియు తర్వాత అనుసరించాల్సిన సరైన ఆహారం గురించి పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ద్వారా కూడా మీరు ప్రయోజనం పొందుతారు. పోషకాహార నిపుణుడు ఈ సమయంలో మీరు అనుసరించాల్సిన భోజన ప్రణాళికలు మరియు వంటకాలను అందించగలరు.

చాలా మంది క్యాన్సర్ రోగులు మరియు సంరక్షకులు వారి బృందంలో సైకాలజీ కౌన్సిలర్ ను కలిగి ఉండటం వలన ప్రయోజనం పొందుతారు. చికిత్స తీవ్రంగా మరియు దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ అనేది ఒత్తిడితో కూడిన వ్యాధి. మీ ఒత్తిడి మరియు భావోద్వేగాల నిర్వహణలో మీకు మార్గనిర్దేశం చేసే వ్యక్తిని కలిగి ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చికిత్స సమయంలో మీకు సహాయం చేయడానికి మీకు హోమ్ నర్సు లేదా సంరక్షకుడు అవసరమైతే, మీ స్థానిక ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రం వారిని మీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మరింత అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న మరియు బలహీనపరిచే క్యాన్సర్ ఉన్న రోగులకు ఇటువంటి సేవలు అవసరం కావచ్చు.

అడ్వాన్స్డ్ స్టేజ్లో నొప్పి నిర్వహణలో మీకు సహాయపడే పాలియేటివ్ కేర్ సెంటర్లు (palliative care centres) కూడా ఉన్నాయి.

Onco మీకు చికిత్స ప్రయాణంలో మరియు తర్వాత మీకు తోడుగా ఉండే సంరక్షణ నిర్వాహకులను అందిస్తుంది. వారు మీకు హాస్పిటల్ మరియు డయాగ్నస్టిక్ అపాయింట్‌మెంట్‌లు, డైట్ ప్లాన్‌లు, ఫార్మసీ సౌకర్యాలు, మెడికల్ డిస్కౌంట్‌లు, కౌన్సెలర్ సౌకర్యాలు మరియు మరెన్నో విషయాల్లో సహాయం చేస్తారు.

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్  వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

Related Posts