మీ ఆకలిని మెరుగుపరచడానికి పోషకమైన సూప్‌లు

by Team Onco
576 views

సీనియర్ డైటీషియన్ డాక్టర్ కృష్ణ ప్రియ, క్యాన్సర్ చికిత్స యొక్క కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవటానికి, ప్రత్యేకంగా ఆకలిని మెరుగుపరచడానికి పోషకమైన సూప్‌ల గురించి తెలియజేస్తున్నారు.

కొంతమంది క్యాన్సర్ రోగులు ఆకలి అవ్వట్లేదు అని ఫిర్యాదు చేస్తారు. కొన్నిసార్లు, ఇది క్యాన్సర్ చికిత్స యొక్క దుష్ప్రభావం కావచ్చు. ఇతర సమయాల్లో, ఇది అలసట మరియు కార్యాచరణ లేకపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. కారణం ఏమైనప్పటికీ, ఆకలి తగ్గడం వల్ల పోషకాహారం మరియు కేలరీలు తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. 

మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు మీ శరీరం కోలుకోవడానికి అవకాశం ఇవ్వడానికి, మీరు తగినంత మొత్తంలో ఆహారం తీసుకోవడం కొనసాగించాలి. మీరు ఇంతకు ముందు లాగా పెద్ద మొత్తంలో భోజనం చేయలేక పోయినప్పటికీ, ఎక్కువ సార్లు చిన్న మొత్తంలో తినండి. 

  • మీరు మీ ఆకలిని కోల్పోయినప్పుడు ఆహార పరిమితులను మరచిపోండి, అది పూర్తి కొవ్వు ఆహారం అయినప్పటి మీరు కోరుకున్నది తినండి. 
  • మీ ఆకలిని మెరుగుపరచడానికి కొద్దిగా వ్యాయామం చేయండి. ఒక చిన్న నడక సహాయపడగలదు.
  • మీకు పూర్తి భోజనం చేయాలని అనిపించనప్పుడు, పండ్ల రసాలు మరియు సూప్‌లను ప్రయత్నించండి. 
  • మీరు ఆకలి తగ్గడం వంటి దుష్ప్రభావాలతో బాధపడుతున్నప్పుడు, మీ పోషకాహారాన్ని మెరుగుపరచడానికి సూప్‌లు గొప్ప మార్గం. అవి సులభంగా తీసుకోవచ్చు మరియు త్వరగా జీర్ణం అవుతాయి, మరియు ముఖ్యమైన పోషణను కలిగి ఉంటాయి.

మీ ఆకలిని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని సూప్ లు: 

  1. ఉల్లిపాయ సూప్

Onion soup to increase appetite for cancer patients

ఉల్లిపాయ సూప్

ఈ సూప్ రుచికరమైనది, సులభంగా జీర్ణమవుతుంది మరియు మీ ఆకలిని మేల్కొల్పుతుంది, మరింత ఎక్కువ భోజనం చేయడం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. 

ఉల్లిపాయలు మీకు ఎందుకు మంచివో ఇక్కడ చూడండి:

  • ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, మరియు కడుపులో మంటతో పోరాడుతాయి. 
  • మీ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి.
  • రక్తపోటును అదుపులో ఉంచడానికి మీకు సహాయం చేస్తాయి.
  • ఇవి రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి.

కావలసినవి

  • ఉల్లిపాయలు: 2 (తీపి రకాన్ని ఎంచుకోండి), సన్నగా తరిగినవి
  • వెల్లుల్లి: 2 రెబ్బలు
  • ఉప్పుతో కూడిన వెన్న: 1 టేబుల్ స్పూన్
  • బిర్యానీ ఆకు: 1
  • మొక్కజొన్న పిండి: 1 టేబుల్ స్పూన్
  • పాలు: ½ కప్పు
  • వెజిటేబుల్ స్టాక్: ½ కప్పు 
  • (వెజిటేబుల్ స్టాక్ చేయడానికి, క్యారెట్, పుట్టగొడుగులు, మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలను అరగంట పాటు నీటిలో ఉడకబెట్టండి. ఆపై వడకట్టండి)
  • ఉప్పు: రుచికి సరిపడా
  • మిరియాలు: రుచి కోసం

చేయవలసిన విధానం

  • సన్నని మంట మీద, పాన్‌లో వెన్నను కరిగించండి.
  • కరిగించిన వెన్నలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు, మరియు మిరియాలు వేయండి. 
  • ఉల్లిపాయలు మెత్తగా మరియు లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. మాడకుండా ఉండడానికి మంటను మీడియంలో ఉంచండి.
  • మొక్కజొన్న పిండిని ¼ కప్పు పాలలో కరిగించండి.
  • వెజిటేబుల్ స్టాక్, మొక్కజొన్న పిండి-పాలు, మరియు మిగిలిన పాలను ఉల్లిపాయలకు జోడించండి. 
  • సూప్ చిక్కబడే వరకు ఉడకనివ్వండి. 
  • మీ రుచికి అనుగుణంగా ఉప్పు మరియు మిరియాలను వేసుకోండి. 

2. టమోటా సూప్

Improve hunger for cancer patients by taking tomato soup

టమోటా సూప్

ఈ సూప్ తయారు చేయడం సులభం మరియు దీనిని కాల్చిన రొట్టెతో చిరుతిండిగా వడ్డించవచ్చు. 

  • యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ (antioxidant lycopene) యొక్క ప్రధాన మూలం టమోటాలు.
  • ఇవి విటమిన్ ‘సి’ మరియు ‘కె’ యొక్క గొప్ప మూలం. 
  • వాటిలో పొటాషియం ఉంటుంది మరియు కణాలను రక్షిస్తుంది. 

కావలసినవి

  • టమోటాలు: 1 కప్పు, తరిగినవి
  • ఉల్లిపాయలు: ¼ కప్పు, తరిగినవి
  • వెల్లుల్లి: ½ tsp, తరిగినవి
  • కొత్తిమీర తరుగు: 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగినవి
  • వెన్న: 1 టేబుల్ స్పూన్
  • రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాలు

చేయవలసిన విధానం

  • టమోటాలు, ఉల్లిపాయలు, మరియు వెల్లుల్లిని రెండు కప్పుల నీటితో కలిపి ప్రెజర్ కుక్కర్ లో వేసి ఉడకబెట్టండి. 
  • ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి మిక్సీలో వేసి మిక్స్ చేయండి.
  • మిశ్రమాన్ని పాన్లోకి తీసుకోండి, వెన్న, ఉప్పు మరియు మిరియాలు జోడించండి.
  • మధ్యమధ్యలో కలుపుతూ 3-4 నిమిషాలు ఉడికించాలి.
  • తరువాత కొత్తిమీర వేసుకొని తినవచ్చు. 

3. బచ్చలికూర మరియు పుట్టగొడుగుల సూప్

Best nutritional soup to improve appetite in cancer patients

బచ్చలికూర మరియు పుట్టగొడుగుల సూప్

  • బచ్చలికూర విటమిన్లు, ఐరన్, మరియు కాల్షియంతో నిండిన ఒక ఉత్తమమైన ఆహారం. 
  • పుట్టగొడుగులలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే రైబోఫ్లేవిన్‌లు (riboflavins) పుష్కలంగా ఉంటాయి. 
  • ఈ సూప్ మీ ఆకలిని మెరుగుపరుస్తుంది మరియు మీరు ఎక్కువగా తినడానికి సహాయపడుతుంది. 

కావలసినవి

  • వెజిటేబుల్ స్టాక్: 1 ½ కప్పులు
  • (వెజిటబుల్ స్టాక్ చేయడానికి, క్యారెట్, పుట్టగొడుగులు, మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలను అరగంట పాటు నీటిలో ఉడకబెట్టండి. ఆపై వడకట్టండి)
  • బచ్చలికూర: ½ కప్పు, తరిగినవి
  • శుభ్రం చేసిన పుట్టగొడుగులు: ¼ కప్పు, తరిగినవి
  • నూనె: ½ టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి: ½ టేబుల్ స్పూన్, తరిగినవి
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • బాణలిలో నూనె వేడి చేసి, వెల్లుల్లి వేసి వేయించాలి.
  • పాలకూర మరియు పుట్టగొడుగులను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. 
  • మిరియాలు మరియు ఉప్పుతో పాటు వెజిటబుల్ స్టాక్ జోడించండి.
  • సన్నని మంట మీద 3 – 4 నిమిషాలు ఉడికించాలి. 
  • వేడిగా ఉండగా తినండి. 

4. నిమ్మకాయ కొత్తిమీర సూప్

best Nutritional soups, lemon and coriander soup for cancer patients in telugu

నిమ్మకాయ కొత్తిమీర సూప్

ఈ సూప్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. 

  • ఇది చూడడానికి మరియు వాసనకు చాలా బాగుంటుంది. 
  • ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ ‘సి’ రోగనిరోధక వ్యవస్థకు మంచిది.
  • ఇది శరీరం ఐరన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది.
  • నిమ్మరసం జీర్ణక్రియకు మరియు శరీరం యొక్క హైడ్రేషన్‌కు తోడ్పడుతుంది.
  • వికారం, కడుపు నొప్పి, గ్యాస్, మరియు విరేచనాలు వంటి క్యాన్సర్ చికిత్స యొక్క సాధారణ దుష్ప్రభావాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.

ఇంకా, ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు.

కావలసినవి

  • వెజిటబుల్ స్టాక్: 1 కప్పు (క్యారెట్, క్యాబేజీ, మరియు బీన్స్‌ను నీటిలో ఉడకబెట్టడం ద్వారా దీన్ని తయారు చేయవచ్చు) 
  • నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు: 2 టేబుల్ స్పూన్లు, తరిగినవి
  • పచ్చిమిర్చి: 1, తరిగినది, 
  • వెల్లుల్లి: 1 టేబుల్ స్పూన్, తరిగినవి
  • కొత్తిమీర ఆకులు: ¼ కప్పు, తరిగినవి
  • వంట నూనె: 1 టేబుల్ స్పూన్
  • రుచి కోసం కాస్త ఉప్పు 

చేయవలసిన విధానం

  • పాన్‌లో నూనె వేడి చేసి, తరిగిన పచ్చిమిర్చి, మరియు వెల్లుల్లిని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  • ఉల్లిపాయ వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
  • వెజిటబుల్ స్టాక్ వేసి మరిగించాలి.
  • కొత్తిమీర ఆకులు వేసి ఒక నిమిషం ఆగి మంటను ఆపివేయండి.
  • వడ్డించే ముందు నిమ్మరసం మరియు ఉప్పు కలపండి.

మీరు వికారం మరియు వాంతులతో బాధపడుతుంటే, తీసుకునే ఆహారం వాంతికి దారితీస్తుందని, మీరు ఆహారం తీసుకోవడం గురించి ఆందోళన చెందుతారు. ఘాటైన వాసనలు లేకుండా తేలికపాటి భోజనం చేయడం వల్ల మీ వికారం తగ్గుతుంది. 

ఇక్కడ కూరగాయల రసం అనే ఒక సాధారణ వంటకం ఉంది, ఇది మీరు ఆహారాన్ని బాగా తినడానికి కష్టపడుతున్నప్పుడు మీ పోషకాహారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది . 

5. కూరగాయల రసం

Vegetable mix nutritional soup for cancer patients in telugu

కూరగాయల రసం

మీరు ఈ సూప్ ఎందుకు తీసుకోవాలి:

  • ఇది లవంగాల వాసన మరియు రుచిని కలిగి ఉంటుంది, ఇది మీ వికారం తగ్గిస్తుంది.
  • ఇది మీ టేస్ట్ బడ్స్ ను శుభ్రపరుస్తుంది మరియు రుచిని మెరుగుపరుస్తుంది, మీరు ఎక్కువగా తినడానికి సహాయపడుతుంది .
  • దీనిలో క్యారెట్ మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలు ఉన్నందున ఇది డీహైడ్రేషన్ ను (dehydration) తగ్గిస్తుంది. 

కావలసినవి

  • ఉల్లిపాయ: 1, తరిగినది
  • క్యారెట్: 1, తరిగినది
  • పుదీనా ఆకులు: కొన్ని, తరిగినవి
  • ఆలివ్ నూనె: 1 టేబుల్ స్పూన్
  • లవంగాలు: 3 
  • బిర్యానీ ఆకు: 1 
  • నీరు: 3 కప్పులు
  • రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాలు

చేయవలసిన విధానం

  • ఆలివ్ నూనెను పాన్‌లో సన్నని మంట మీద వేడి చేయండి.
  • లవంగాలను వేసి, నూనె లవంగాల వాసనను పట్టేవరకు వేయించండి.
  • తరిగిన క్యారెట్ మరియు ఉల్లిపాయ వేసి, అవి మెత్తబడే వరకు వేయించాలి.
  • కూరగాయలను తరచుగా కలుపుతూ ఉండండి, తద్వారా అవి పాన్ దిగువ భాగానికి అంటుకోకుండా ఉంటాయి.
  • నీరు, బిర్యానీ ఆకు, మరియు తరిగిన పుదీనా ఆకులను వేయండి.
  • సన్నని మంట మీద 30 నిమిషాలు ఉడకబెట్టండి. 
  • వడ్డించే ముందు జాలిని ఉపయోగించి ఉడకబెట్టిన పులుసును వడకట్టండి.
  • రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాలు వేసి కలపండి.

కీమోథెరపీ యొక్క మరొక దుష్ప్రభావం విరేచనాలు. మీరు విరేచనాలతో బాధపడుతుంటే, తక్కువ పీచుపదార్థాలు కలిగిన ఆహారాలు మరియు జ్యూస్‌లు, మరియు సూప్‌ల వంటి వాటిని ఎంచుకోండి. మీరు కోలుకునే వరకు మసాలా, అధిక కొవ్వు, మరియు చక్కెర ఆహారాలు, మరియు పానీయాలను నివారించండి.

కీమోథెరపీ సమయంలో ఏటువంటి ఆహారం తినాలో ఈ కథనంలో తెలుసుకోండి

మీరు నాన్ వెజిటేరియన్ అయితే, విరేచనాలని ఎదుర్కోవటానికి మీకు సహాయపడే సూప్ రెసిపీ ఇక్కడ ఉంది. 

6. లెమన్ చికెన్ రైస్ సూప్

ఆకలిని మెరుగుపరచడానికి పోషకమైన సూప్‌లు

లెమన్ చికెన్ రైస్ సూప్

  • ఇది తక్కువ ఫైబర్, ఎక్కువగా జీర్ణం అయ్యే అవకాశం మరియు తక్కువ కొవ్వు కలిగి ఉంది, ఇది ఖచ్చితంగా విరేచనాలతో పోరాడే రకమైన ఆహారం.
  • ఈ సూప్‌లో ఉపయోగించే కూరగాయలు (క్యారెట్ వంటివి) కూడా తక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి.
  • ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
  • ఇది తినడానికి మృదువుగా ఉంటుంది, తద్వారా మీరు బాగా తినవచ్చు.

కావలసినవి

  • క్యారెట్: 1, ఒలిచిన మరియు తరిగినది
  • బియ్యం: ¼ కప్పు
  • చికెన్ బ్రోత్: 2 కప్పులు (చికెన్‌ను ఎక్కువ సమయం నీటిలో ఉడకబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు, తద్వారా దాని రుచి మరియు పోషకాలు నీటిలో ఉంటాయి) 
  • చికెన్ బ్రెస్ట్: ఉడకబెట్టిన ముక్కలు, 3 ముక్కలు
  • గుడ్డులోని తెల్లసొన: 2
  • నిమ్మరసం: 3 టేబుల్ స్పూన్లు
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • ప్రెజర్ కుక్కర్‌లో బియ్యం మరియు క్యారెట్ ఉడికించాలి. నీటిని వాడే బదులు, వంట సమయంలో చికెన్ బ్రోత్ ను ఉపయోగించండి.
  • అన్నం ఉడికిన తర్వాత, అందులో ఉడికించిన మరియు ముక్కలు చేసిన చికెన్ వేయండి. చికెన్ వేడెక్కే వరకు కలుపుతూ ఉండండి. 
  • గుడ్డులోని తెల్లసొన మరియు నిమ్మరసం కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి మెత్తగా ఉడికించాలి.
  • మీ రుచికి తగినంత ఉప్పును కలపండి.

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

సంబంధిత కథనాలు:

క్యాన్సర్‌తో బాధపడుతున్న మధుమేహ రోగులకు ఉత్తమ ఆహారం

సరైన పోషకాహారం – క్యాన్సర్ చికిత్సల ఫలితాలను మెరుగుపరచడంలో ప్రాముఖ్యత

క్యాన్సర్ రోగులకు ఉత్తమ ఆహారం: ప్రత్యేకంగా తెలుగు ప్రజల కోసం

Related Posts

Leave a Comment