క్యాన్సర్ చికిత్సలు (cancer treatments) కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు కొనసాగుతాయి మరియు చాలా క్యాన్సర్ చికిత్సలు దుష్ప్రభావాలు కలిగిస్తాయి. నోటి పుండ్లు, ఆకలి లేకపోవడం, అలసట, వికారం, వాంతులు, రుచి కోల్పోవడం మొదలైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. ఇటువంటి దుష్ప్రభావాల వల్ల మీరు సరిగా ఆహారం తీసుకోలేక పోవచ్చు లేదా తీసుకున్న ఆహారంలోని పోషకాలు మీ శరీరం గ్రహించలేక పోవచ్చు.
క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రూపొందించిన శక్తివంతమైన మందులు మరియు చికిత్సా విధానాలను తట్టుకోవడానికి మీ శరీరానికి సరైన పోషకాహారం (right nutrition) అవసరం. మీరు తీసుకుంటున్న చికిత్సా విధానానికి, మీరు ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలకు, మరియు మీ శరీరానికి తగినట్లుగా ప్రత్యేకంగా రూపొందించబడిన ఆహార ప్రణాళిక ద్వారా కావాల్సిన పోషకాహారం పొందవచ్చు. ఇటువంటి పోషకాహారం మీ క్యాన్సర్ చికిత్స సమయంలో బలంగా ఉండడానికి సహాయపడుతాయి.
మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలను (side effects) నియంత్రించడంలో కూడా మంచి ఆహారం మీకు సహాయం చేస్తుంది. మీ దుష్ప్రభావాలను తగ్గించడం ద్వారా మరియు మీరు తగినంత పోషకాహారాన్ని తీసుకోవడంలో సహాయపడటం ద్వారా, సరైన ఆహారం క్యాన్సర్ చికిత్సను కొనసాగించడానికి మీ శరీరం మరింత శక్తితో బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
మీ ఆహారంలో సరైన మొత్తంలో కేలరీలు మరియు ప్రోటీన్ లేకుండా, మీ క్యాన్సర్ మరియు క్యాన్సర్ చికిత్సల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు మీ జీవన నాణ్యతపై కూడా ప్రభావితం కావచ్చు. అందుకే ఈ సమయంలో సరైన పోషకాహారం మీ చికిత్స విజయానికి కీలకం.
“Onco మీకు క్యాన్సర్ డైట్ మరియు న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ను (Cancer Diet and Nutrition Programme) అందిస్తుంది. మా సీనియర్ డైటీషియన్లు మీ శరీర అవసరాలకు అనుగుణంగా పోషకాహార ప్రణాళికను రూపొందిస్తారు.”
ఈ సేవ మీకు ప్రతి వారం భోజన ప్రణాళికలను అందిస్తుంది. చికిత్స పురోగమిస్తున్నప్పుడు మరియు మీ పోషకాహార అవసరాలు మారుతున్నప్పుడు ఈ భోజన ప్రణాళికలను తగిన విధంగా మార్చవచ్చు.
Onco యొక్క క్యాన్సర్ డైట్ మరియు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మీకు ఎలా సహాయం చేస్తుంది?
Onco యొక్క క్యాన్సర్ డైట్ మరియు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ క్యాన్సర్ చికిత్సలను తట్టుకొని, త్వరగా కోలుకోవడానికి మీ శరీరానికి ఉపయోగపడేలా రూపొందించబడతాయి.
సరైన పోషకాహార ప్రణాళికను రూపొందించడానికి, మా డైటీషియన్ (Dietitian) మీ క్యాన్సర్ రకం, చికిత్స రకం, మీ ప్రస్తుత శారీరక మరియు వైద్య పరిస్థితి మరియు మీకు ఉన్న ఏవైనా ఇతర ప్రాధాన్యతలు లేదా అలెర్జీల ఆధారంగా మీ రోజువారీ పోషక అవసరాలను తనిఖీ చేస్తారు.
మీ రోజువారీ పోషకాహార అవసరాల ఆధారంగా, తయారీ విధానాలతో పాటు మీకు భోజన ప్రణాళిక (Diet Plan) అందించబడుతుంది.
మీరు తదుపరి 14 రోజుల పాటు డైటీషియన్‌తో ఫాలో-అప్ సంప్రదింపులను కూడా పొందవచ్చు.
అదనంగా, మీ చికిత్స ప్రయాణం అంతటా మీకు సహాయం చేయడానికి ఒక కేర్ మేనేజర్ (care manager) కేటాయించబడతారు. కేర్ మేనేజర్ క్యాన్సర్‌కు సంబంధించిన మీ అన్ని వైద్య మరియు పోషకాహార ప్రశ్నలకు సమాధానాలను అందించగలరు. ప్రణాళికాబద్ధంగా మీ చికిత్స ప్రయాణం సజావుగా సాగడానికి వారు మీకు నిరంతరం సహాయంగా ఉంటారు.
క్యాన్సర్ రోగులకు ఉత్తమ ఆహారం: ప్రత్యేకంగా తెలుగు ప్రజల కోసం
మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆహారం మీకు ఎందుకు అవసరం?
రోగి యొక్క ప్రస్తుత వైద్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఆహార ప్రణాళిక రూపొందించబడుతుంది. నమోదిత డైటీషియన్ (Registered Dietitian) రోగి యొక్క ఆహార ప్రాధాన్యతలు, అలెర్జీలు, ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలు, తీసుకుంటున్న చికిత్సకు అవసరమైన క్యాలరీలు మరియు పోషకాహారం గురించి తెలుసుకుంటారు మరియు తదనుగూనంగా సరైన ఆహార ప్రణాళిక రూపొందిస్తారు.
రెగ్యులర్ డైట్ క్యాన్సర్ మరియు దాని చికిత్సలను తట్టుకోవడంలో సహాయపడదు. అందువల్ల, ఉత్తమ చికిత్స ఫలితాలను పొందడానికి ప్రతి రోగికి అనుకూలంగా ఆహార ప్రణాళిక తయారుచేయాలి.
రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలి అనేది బహుళ కారకాల ఆధారంగా నిర్ణయించబడుతుంది మరియు మీ చికిత్స సమయంలో చాలాసార్లు తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది.
మీరు Onco వెబ్‌సైట్‌లో ఉచిత భోజన ప్రణాళికలను పొందగలరు. ఇవి కొంతమంది క్యాన్సర్ రోగులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఉత్తమ చికిత్స ఫలితాల కోసం మీ ప్రత్యేక పరిస్థితి ఆధారంగా ఆహార ప్రణాళికలను అనుకూలీకరించడం ఎల్లప్పుడూ ఉత్తమం.
మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుష్ప్రభావాల ఆధారంగా, ఈ దుష్ప్రభావాలను తగ్గించే ఆహారాలను తీసుకోవడానికి మీ ఆహార ప్రణాళికను అనుకూలీకరించాలి. వాంతులు, వికారం, మలబద్ధకం, విరేచనాలు మరియు ఆకలిని కోల్పోవడం వంటి సాధారణ దుష్ప్రభావాలు మీ ఆహారం ద్వారా బాగా నియంత్రించవచ్చు.
మీకు తగిన పోషకాహారం తీసుకోవడం వలన శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల తర్వాత బరువు తగ్గకుండా ఉండేందుకు మరియు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
కీమోథెరపీ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఇక్కడ చదవండి
క్యాన్సర్ డైటీషియన్ నుండి పోషకాహార సేవలను పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
క్యాన్సర్ చికిత్స సమయంలో ఉత్తమమైన ఆహారాన్ని పొందడానికి, మీకు అనుభవజ్ఞుడైన క్యాన్సర్ డైటీషియన్ సహాయం అవసరం. క్యాన్సర్ రోగులు వారి చికిత్స ప్రయాణంలో ఎదుర్కొనే పోషకాహార సవాళ్లను పరిష్కరించటానికి క్యాన్సర్ డైటీషియన్ ప్రత్యేకంగా శిక్షణ పొందారు.
క్యాన్సర్ డైటీషియన్ మీకు అవసరమైన ఆహారాలు మరియు వాటిని తయారుచేయు విధానాలతో పాటు ప్రతి రోజుకు కావాల్సిన భోజన ప్రణాళికలను వారానికోసారి (weekly diet plans) అందించగలరు. ఇది మీ కేర్ గివర్ కి మీ రోజువారీ భోజనాన్ని సిద్ధం చేయడం సులభం చేస్తుంది.
ఒక క్యాన్సర్ డైటీషియన్ శాఖాహారం లేదా మాంసాహారం వంటి మీ వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా మరియు మీరు అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుని డైట్ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు.
ఈ సేవ గురించి క్యాన్సర్ రోగులు మరియు వారి సంరక్షకులు ఏమి చెపుతున్నారు:
“ఇక క్యాన్సర్ను నయం చేయలేము అని అందరూ ఆశ కోల్పోయిన సమయంలో, Onco సహాయం ద్వారా మాకు కొంత ఆశ కలిగింది. వారి డైట్ ప్లాన్ వలన చికిత్స సమయంలో ధృడంగా ఉండగలిగాను మరియు చాలా సాంత్వన లభించింది. మాకు ఎటువెళ్ళాలో మార్గం తెలియని తరుణంలో వారు మాకు సరైన మార్గాన్ని చూపించారు.”
– రంజిత్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగి యొక్క కేర్ గివర్
“నేను వారి పోషకాహార సేవలను తీసుకున్నాను మరియు ఇప్పుడు వారి సీనియర్ పోషకాహార నిపుణుడి నుండి సరైన ఆహార ప్రణాళికను అనుసరించాను. మేము ఇప్పుడు సరైన చికిత్సా మార్గంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము మరియు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నాము.
– రాధ ఎన్, గర్భాశయ క్యాన్సర్
మీ ఆహార ఎంపికలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు
చాలా మంది క్యాన్సర్ రోగులు (cancer patients) వారు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడానికి వారి ఆంకాలజిస్ట్‌లపై ఆధారపడతారు. ఒక ఆంకాలజిస్ట్ మీరు ఏమి తినాలి మరియు ఏ ఆహారాలు తినకూడదు అనే దాని గురించి ప్రాథమిక సమాచారాన్ని అందించగలరు, అయితే ఏ ఆహారాలలో ఎక్కువ కేలరీలు ఉన్నాయి, ఏ ఆహారాలు మరింత సులభంగా తీసుకోవచ్చు (మీ వైద్య పరిస్థితి ఆధారంగా) మరియు ఏ ఆహారాలు వాంతులు, వికారం, విరేచనాలు, మలబద్ధకం మొదలైన దుష్ప్రభావాలను నియంత్రించడానికి మీకు సహాయపడుతుంది అనే వివరాలను అందించలేకపోవచ్చు.
కొంతమంది క్యాన్సర్ రోగులు లేదా వారి సంరక్షకులు మంచి క్యాన్సర్ ఆహారాన్ని తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్‌లో కొన్ని విశ్వసనీయ వైద్య వెబ్‌సైట్‌లు మీకు క్యాన్సర్ డైట్‌లపై సరైన సమాచారాన్ని అందించగలవు, అయితే ఇది మీ వైద్య పరిస్థితి, క్యాన్సర్ రకం మరియు దశ, దుష్ప్రభావాలు, అలెర్జీలు మొదలైన వాటికి ఖచ్చితమైనది కాదు.
అందుకే సరైన ఆహారం కోసం క్యాన్సర్ డైటీషియన్‌ను సంప్రదించాలి. ఇది మీరు వేగంగా కోలుకోవడానికి మరియు మీ జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మా క్యాన్సర్ పోషకాహార సేవల గురించి మరింత తెలుసుకోవడానికి, మాకు 79965 79965 కు కాల్ చేయండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి