మీరు క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ (Chemotherapy) తీసుకుంటున్నట్లయితే, మీ చికిత్స నుండి మెరుగైన ఫలితాలను పొందడానికి మీరు కొన్ని ఆహార నియమాలు పాటించాలి.
కీమోథెరపీ మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. కొంతమంది రోగులు ఈ చికిత్స సమయంలో బరువు కోల్పోతారు. సరియైన కీమో డైట్ (Chemo diet) ఈ సమస్యలను నియంత్రించడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ఈ డైట్ ని కీమోథెరపీకి ముందు, కీమోథెరపీ సమయంలో మరియు కీమోథెరపీ తర్వాత పాటించాలి.
కీమో డైట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?
సరియైన కీమో డైట్ ఈ ప్రయోజనాలు ఇస్తుంది:
- శరీరం తగినంత బరువును కలిగివుండటానికి సరిపడ కేలరీలను అందిస్తుంది
- చికిత్స సమయంలో చురుకుగా ఉండటానికి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది
- రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
- క్యాన్సర్ చికిత్సను తట్టుకునేంత శక్తిని ఇస్తుంది
దీనితో పాటు, చాలా మంది రోగులు కీమోథెరపీ యొక్క కొన్ని దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొంటారు. అందరికీ అన్ని దుష్ప్రభావాలు ఉండవు, చికిత్స రకం బట్టి అనేక రకాలైన దుష్ప్రభావాలు రావచ్చు. కొంతమంది రోగులు ఈ దుష్ప్రభావాలలో దేనినీ కూడా అనుభవించకపోవచ్చు.
కీమోథెరపీ దుష్ప్రభావాలలో (Chemotherapy side effects) వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం మరియు విపరీతమైన అలసట వంటివి సాదారణం. ఈ దుష్ప్రభావాలు రోగికి అవసరమైన పోషకాహారాన్ని తీసుకోవడం మరియు గ్రహించడం కష్టతరం చేస్తాయి.
మీ చికిత్స నుండి మరింత విజయాన్ని పొందడానికి మరియు త్వరగా కోలుకోవడానికి మీ ఆహారంలో ఏమి చేర్చాలో ఇక్కడ మేము చర్చిస్తాము.
కీమోథెరపీ సమయంలో మీరు ఎంత తినాలి?
సగటున, రోజుకు, కీమోథెరపీలో ఉన్న వ్యక్తి తినవలసినవి:
కార్బోహైడ్రేట్లు (carbohydrates):
మీరు తీసుకునే మొత్తం క్యాలరీలలో 55% కార్బోహైడ్రేట్ల నుండి తీసుకోవాలి.
కార్బోహైడ్రేట్ల ఉదాహరణలు:
గోధుమలు, బియ్యం, బజ్రా, జోవర్ మొదలైనవి.
ఫ్యాట్స్(Fats):
మీ మొత్తం క్యాలరీలలో 30% ఫ్యాట్స్ నుండి తీసుకోవాలి.
ఫ్యాట్స్ ఉదాహరణలు:
పాలు, చీజ్, వంట నూనె, నట్స్, పీనట్ బటర్ మొదలైనవి.
మీరు అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన ఇతర పరిస్థితులతో బాధపడుతుంటే, ఆ పరిస్థితులకు అనుకూలంగా మీరు మీ ఆహారాన్ని తీసుకోవాలి.
ప్రొటీన్లు(Proteins):
మీ శరీర బరువులో ప్రతి కిలోకు 1.2 – 1.5 గ్రాముల ప్రోటీన్లు అవసరం
ఉదాహరణకు, మీ శరీర బరువు 50 కిలోలు ఉంటే, మీరు రోజుకు 65 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.
ప్రోటీన్ల ఉదాహరణలు:
గుడ్లు, చికెన్, పనీర్, కంది పప్పు మొదలైనవి.
సాధారణంగా, కణజాల పునరుద్ధరణలో(Tissue repair and regeneration) సహాయపడటానికి క్యాన్సర్ చికిత్స సమయంలో అధిక ప్రోటీన్ ఆహారం సిఫార్సు చేయబడుతుంది.
క్యాన్సర్ రోగులకు ఉత్తమ ప్రోటీన్ ఆహారాలు ఏమిటి?
మీరు మాంసాహారులు(Non-vegetarian) అయితే, చికెన్, చేపలు మరియు గుడ్లు వంటివి తినవచ్చు. రెడ్ మీట్(Red meat) మరియు సాసేజ్ వంటి ప్రాసెస్డ్ మీట్(Processed meat like sausage) నివారించడం మంచిది.
మీరు శాఖాహారులైతే(Vegetarian), పచ్చి శెనగలు, కందిపప్పు, మసూర్ దాల్ వంటివి తీసుకోవచ్చు.
క్యాన్సర్ సమయంలో ప్రోటీన్ వినియోగంపై ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి:
- బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, వేరుశెనగలు మొదలైనవి మీ ఆహారంలో చేర్చుకోండి.
- పాలు మరియు పాల ఉత్పత్తులు అనగా జున్ను, పెరుగు, మరియు పనీర్ వంటివి తీసుకోండి.
- ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు తినే ప్రోటీన్లను మీ శరీరం గ్రహించాలి. అధిక ఒత్తిడి మీ ప్యాంక్రియాస్‌పై(Pancreas) ప్రభావాన్ని చూపుతుంది, వాపుకు కారణమవుతుంది మరియు ఇది ప్రోటీన్‌లను సరిగా గ్రహించకుండా చేస్తుంది. మీ ఆహారంలో ప్రోటీన్లను శరీరం గ్రహించేలా చేయడానికి మీ ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
- అధిక మొత్తంలో టీ మరియు కాఫీ తీసుకోవడం వల్ల మీ శరీరం ప్రోటీన్లను గ్రహించే శక్తిని కోల్పోతుంది. కాబట్టి టీ కాఫీలను రోజుకు 2-3 కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది.
- అతిగా తినడం లేదా చాలా తరచుగా తినడం వల్ల శరీరం మీ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయకుండా నిరోధిస్తుంది. గంటకోసారి భోజనం చేసే బదులు రెండు మూడు గంటల గ్యాప్ తర్వాత తినడం మంచిది.
- మీ భోజనానికి ముందు సలాడ్‌లు లేదా కివి, పైనాపిల్, బొప్పాయి మరియు మామిడి వంటి పండ్లను తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల (Digestive enzymes) ఉత్పత్తి పెరుగుతుంది మరియు ప్రోటీన్లను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.
మీకు వాంతులు లేదా వికారం (Nausea and vomiting) అనిపించినప్పుడు ఏమి తినాలి?
కీమోథెరపీ చేయించుకుంటున్న వారిలో వికారం (వాంతులు చేసుకునేలా అనిపించడం) అనేది చాలా సాధారణమైన దుష్ప్రభావం. ఇది వారిని ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది మరియు వాంతులు చేసుకోడం వలన, వారు తినే విలువైన కేలరీలను కోల్పోతారు.
ఏ రకమైన ఆహారాలు ఈ వికారం అనుభూతిని తగ్గిస్తాయో అర్థం చేసుకోవడం ముఖ్యం, తద్వారా మీరు అవసరమైన కేలరీలు మరియు పోషకాహారాన్ని తీసుకోవడం కొనసాగించవచ్చు.
వికారం తగ్గించడంలో బ్లాండ్ ఫుడ్స్(Bland foods) కీలకం. బ్లాండ్ ఫుడ్స్ అనగా చప్పగా ఉండే ఆహారాలు, మరియు మసాలా లేని ఆహారాలను సూచిస్తాయి.
మీకు వికారం ఉన్నట్లయితే |
|
ఏమి తినాలి |
ఏమి తినకూడదు |
మృదువైన, టోస్టెడ్ బ్రెడ్ |
మసాలా కూరలు |
లస్సీ / స్మూతీస్ |
నారింజ, నిమ్మకాయలు |
పెరుగు |
పాలు |
ఓట్స్ |
వేయించిన ఆహారాలు |
కార్న్‌ఫ్లేక్స్ |
కార్బోనేటేడ్ డ్రింక్స్ |
ఐస్ క్రీమ్ |
కాఫీ |
వికారం(Nausea) తగ్గించడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి:
- నీరు లేదా టీ/కాఫీ తీసుకునే ముందు కూడా బిస్కెట్లు వంటి పొడి ఆహారాలతో రోజును ప్రారంభించండి.
- అల్లం వికారం తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు దీనిని అల్లం టీగా తీసుకోవచ్చు. మీరు డయాబెటిక్ కాకపోతే క్యాండీ రూపంలో కూడా అల్లంని తీసుకోవచ్చు.
- ఘాడమైన వాసనలు వికారం పెంచవచ్చు. కాబట్టి వంటగది నుండి దూరంగా ఉండటం సహాయపడవచ్చు. అలాగే, క్యాన్సర్ రోగులకు బాగా వెంటిలేషన్(Ventilation) ఉన్న గదిలో ఆహారాన్ని అందించడం మంచిది.
- చాలా వేడిగా ఉండే ఆహారాలతో పోల్చినప్పుడు చల్లగా లేదా గది ఉష్ణోగ్రత వద్ద అందించే ఆహారాన్ని వారు సులభంగా తీసుకుంటారని కనుగొనబడింది. కాబట్టి మీరు ఐస్ క్రీమ్, కోల్డ్ జ్యూస్, స్మూతీస్ మొదలైన వాటిని తగిన పరిమాణంలో తీసుకోడానికి ప్రయత్నించవచ్చు.
కీమోథెరపి సమయంలో వికారం మరియు వాంతులు ఎలా నియంత్రించాలో ఈ వీడియోలో చూడండి https://www.youtube.com/watch?v=ZjCNB9Rr03c&list=PLWvjOzjhhZhaqspsG6R8IJZtxGjwOXw4p
మీకు విరేచనాలు(Diarrhea) అయితే ఏమి తినాలి?
కీమోథెరపీ యొక్క మరొక సాధారణ దుష్ప్రభావం విరేచనాలు. విరేచనాలు తగ్గించడానికి తక్కువ ఫైబర్ గల ఆహారం(Low-fiber diet), చిన్న మొత్తంలో రోజులో ఎక్కువ సార్లు తినడానికి ప్రయత్నించండి.
అధిక ఫైబర్ ఆహారాలు జీర్ణవ్యవస్థ ద్వారా త్వరగా జీర్ణించబడుతాయి. పండ్లు మరియు కూరగాయలు, పప్పులు (కందిపప్పు మొదలైనవి), బఠానీలు మొదలైనవి అధిక ఫైబర్ ఆహారంగా పరిగణించబడతాయి. మీరు విరేచనాలతో బాధ పడుతున్నట్లయితే వీటిని నివారించాలి.
ఈ సమయంలో వైట్ రైస్, ఓట్స్, యాపిల్, బార్లీ, రైస్ వాటర్ మొదలైన కరిగే ఫైబర్స్(Soluble fibers) మరియు పెక్టిన్‌లతో(Pectins) కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి.
మీకు విరేచనాలు ఉంటే |
|
ఏమి తినాలి |
ఏమి తినకూడదు |
వైట్ రైస్ |
ముడి పండ్లు |
బియ్యం నీరు |
పచ్చి కూరగాయలు |
యాపిల్స్ |
కాయధాన్యాలు (పప్పులు) |
బార్లీ |
చిక్‌పీస్ (చనా) |
ఓట్స్ |
బీన్స్ (కిడ్నీ బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి) |
పెరుగు |
స్వీట్లు |
విరేచనాలు మీ శరీరంలో ద్రవాన్ని కోల్పోయేలా చేస్తుంది మరియు ఇది డీహైడ్రేషన్ కు (Dehydration) దారితీయవచ్చు. దీనిని నివారించడానికి, ఎక్కువ నీరు త్రాగటం ముఖ్యం. మీరు లేత కొబ్బరి నీరు, మజ్జిగ మరియు బ్లాక్ టీ కూడా పుష్కలంగా తీసుకోవచ్చు.
మీకు మలబద్ధకం (Constipation) ఉన్నప్పుడు ఏమి తినాలి?
డయేరియా కోసం సిఫార్సు చేయబడిన ఆహారానికి విరుద్ధంగా, అధిక ఫైబర్ ఆహారంతో మలబద్ధకాన్ని తగ్గించవచ్చు.
మీకు మలబద్ధకం ఉంటే |
|
ఏమి తినాలి |
ఏమి తినకూడదు |
ముడి పండ్లు (ముఖ్యంగా చర్మం మరియు విత్తనాలు కలిగిన పండ్లు) |
ప్రాసెస్ చేసిన పిండి (మైదా) |
మొలకలు |
పాలు |
కాయధాన్యాలు (అన్ని పప్పులు) |
చీజ్ |
చిక్‌పీస్ (చనా) |
వేయించిన ఆహార పదార్థాలు |
బీన్స్ (కిడ్నీ బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి) |
గుడ్లు |
నట్స్ |
రెడ్ మీట్ |
మలబద్ధకాన్ని నివారించడానికి, పుష్కలంగా నీరు త్రాగాలి. మీరు టీ, గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీరు వంటి వేడి పానీయాలను కూడా ఉదయాన్నే తీసుకోవచ్చు.
మీరు ఫైబర్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు, వీటిని పండ్ల రసం లేదా గంజితో పాటు తీసుకోవచ్చు.
మలబద్ధకాన్ని తగ్గించడానికి శారీరక శ్రమ (Physical activity) చాలా ముఖ్యం.
ఆహార భద్రత (Food safety) ముఖ్యమైనది:
కీమోలో ఉన్నవారు ఆహారం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లు మరియు ఫుడ్ పాయిజనింగ్‌కు(Food poisoning) గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహార భద్రతను ఎల్లవేళలా గమనించడం ముఖ్యం.
- పచ్చి పాలను మానుకోండి మరియు పాశ్చరైజ్డ్ పాలను (Pasteurized milk) ఎంచుకోండి.
- పెరుగు మరియు మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు అవి పాశ్చరైజ్డ్ పాలతో తయారు చేయబడినవా లేదా అని గమనించండి.
- మీరు వాడే నీరు బాగా ఫిల్టర్ చేయబడి లేదా బాగా కాచి చల్లార్చిన నీరు అయివుండాలి. జ్యూస్‌లు, స్మూతీస్ మొదలైన పానీయాలలో ఉపయోగించే నీటికి కూడా ఇదే వర్తిస్తుంది.
- వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసిన ఆహారానికి కట్టుబడి ఉండండి.
మీరు గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు మొదలైనవాటిని ఎదుర్కొంటుంటే, పాల ఉత్పత్తులను నివారించడం ఆ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కీమోథెరపీ సమయంలో టీ, గ్రీన్ టీ మరియు కాఫీ తీసుకోవడం సురక్షితమేనా?
గ్రీన్ టీ (Green tea) ఆరోగ్యానికి మంచిది, కానీ సాధారణ టీ మరియు కాఫీ లాగా ఇందులో కూడా కెఫీన్ ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, కెఫీన్ మీకు నిద్రలేమి, తలనొప్పి మరియు కడుపు నొప్పిని కలిగిస్తుంది.
కెఫీన్ మీ శరీరంలో ఐరన్ గ్రహించే (Iron absorption) శక్తిని కూడా తగ్గిస్తుంది, ఇది రక్తహీనతకు (Anemia) దారితీస్తుంది. కొందరిలో ఇది లివర్ టాక్సిసిటీకి (Liver toxicity) కూడా కారణం కావచ్చు.
రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం సరైనది మరియు కావాల్సినది కూడా. ఎక్కువ కెఫిన్ తీసుకునే బదులు, మీరు కొన్ని డార్క్ చాక్లెట్, నట్స్ మొదలైనవాటిని ప్రయత్నించవచ్చు.
క్యాన్సర్ రోగులకు చక్కెర (Sugar) మంచిది కాదా?
చక్కెర క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అనేది అపోహ. ఈ అపోహ కారణంగా కొంతమంది క్యాన్సర్ రోగులు చక్కెర మరియు కార్బోహైడ్రేట్లను కూడా పూర్తిగా దూరంగా ఉంచుతున్నారు.
మీరు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు, బరువు నిర్వహణలో సహాయపడటానికి అధిక కేలరీల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటికే ఆకలి లేకపోవడం మరియు అలసట వంటి అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, చక్కెర మరియు కార్బోహైడ్రేట్‌లను పూర్తిగా నివారించడం మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది.
చక్కెరతో సమస్య ఏమిటంటే అది మనకు ఖాళీ కేలరీలను(empty calories) ఇస్తుంది. ఖాళీ కేలరీల కంటే ఎక్కువ విటమిన్లు మరియు పోషకాలను తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది, ఎందుకంటే ఇవి క్యాన్సర్ చికిత్స సమయంలో మీ శరీరం బలంగా ఉండటానికి సహాయపడతాయి.
క్యాన్సర్ పేషెంట్లు తమ ఆహారంలో చక్కెర వాడకాన్ని పరిమితం చేయడం మరియు ఎక్కువ పోషకాలను పొందడంపై దృష్టి పెట్టడం మంచిది. కానీ మీరు పోషకాహార లోపంతో, గణనీయమైన బరువు తగ్గినట్లయితే, మీరు కీమోథెరపీ సమయంలో కూడా ప్రతిరోజూ ఆహారంలో 3 నుండి 4 టీస్పూన్ల చక్కెరను సురక్షితంగా తీసుకోవచ్చు.
మీరు డయాబెటిస్‌తో (Diabetes) బాధపడుతుంటే, మీరు చక్కెరను నివారించాలి మరియు మీ వైద్యుని సూచనలను అనుసరించాలి.
మీరు డయాబెటిక్ కాకపోతే, రోజుకు 3 నుండి 4 టీస్పూన్ల చక్కెర తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు.
మీ పరిస్థితికి సరైన ఆహార ప్రణాళిక కావాలా?
79965 79965కు కాల్ చేసి, మా సీనియర్ పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి