మీరు మామోగ్రఫీ – రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పద్ధతి గురించి ఏమి తెలుసుకోవాలి?

by Team Onco
1187 views

ఈ వ్యాసం రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో మామోగ్రఫీ (Mammography) యొక్క ప్రాముఖ్యత గురించి మీకు అవగాహన కల్పిస్తుంది.

మామోగ్రఫీ అంటే ఏమిటి?

మామోగ్రఫీ (Mammography) అనేది వైద్యపరమైన ఇమేజింగ్ సాంకేతికత (Medical imaging technique). ఇది X-రేలను (X-rays) ఉపయోగించి రొమ్ములను పరిశీలిస్తుంది. ఈ మామోగ్రఫీ పరీక్షను మామోగ్రామ్ అంటారు. రొమ్ము క్యాన్సర్‌లను గుర్తించడంలో మరియు రోగనిర్ధారణ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

Breast cancer can be detected early by a Mammogram

మామోగ్రఫీ రకాలు:

రెండు రకాల మామోగ్రామ్‌లు ఉన్నాయి:

స్క్రీనింగ్ మామోగ్రామ్ (Screening Mammogram):

స్పష్టమైన రొమ్ము క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా రొమ్ములలో కణితిని గుర్తించడానికి ఇది నిర్వహిస్తారు.

డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ (Diagnostic Mammogram): 

స్క్రీనింగ్ పరీక్ష తర్వాత మీ వైద్యుడు మీకు రొమ్ములో కణితులు ఉన్నట్లు గమనిస్తే లేదా రొమ్ములో గడ్డలు, చేయి కింద గడ్డలు, చనుమొనలు నుండి స్రావాలు విడుదలవ్వడం, రొమ్ములపై దద్దుర్లు, చర్మం దురద పెట్టడం, మరియు రొమ్ములు లేదా చనుమొనలు లోపలికి ముడుచుకోవడం వంటి రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు కనిపించినప్పుడు ఇది నిర్వహించబడుతుంది. 

స్క్రీనింగ్ మామోగ్రామ్ (Screening Mammogram):

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు ప్రతి సంవత్సరం స్క్రీనింగ్‌లు చేయించుకోవాలని సిఫార్సు చేస్తుంది. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర (Family history of breast cancer) మరియు జన్యు మార్పుల-సంబంధిత రొమ్ము క్యాన్సర్ చరిత్ర (History of breast cancer from gene mutations) కలిగిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అటువంటి మహిళలకు MRI కూడా సిఫార్సు చేస్తారు.

రొమ్ము క్యాన్సర్‌లను ముందుగా గుర్తించడానికి  వార్షిక మామోగ్రామ్‌లు (Yearly Mammograms) సహాయపడతాయని పరిశోధన రుజువు చేస్తుంది. కణితిని దాని ప్రారంభ దశలో గుర్తించినప్పుడు దానికి చికిత్స చేయవచ్చు, నయం చేయవచ్చు మరియు రొమ్ము సంరక్షణ చికిత్సలను (Breast Conservation Surgery) కూడా పొందవచ్చు.

డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ (Diagnostic Mammogram):

రొమ్ములో గడ్డలు లేదా చనుమొన నుంచి స్రావాలు కారడం వంటి అసాధారణ లక్షణాలు గమనించినప్పుడు లేదా స్క్రీనింగ్‌లు రొమ్ములలో కణితిని గుర్తించినప్పుడు, డయాగ్నోస్టిక్ మామోగ్రఫీ సిఫార్సు చేయబడుతుంది. ఇది సాధారణంగా స్క్రీనింగ్ మామోగ్రామ్ తర్వాత సిఫార్సు చేస్తారు.

మామోగ్రఫీ ఎలా పని చేస్తుంది?

సాంప్రదాయిక మామోగ్రామ్‌లో, ఒక స్థిరమైన X-రే ట్యూబ్ రొమ్ములను చిత్రీకరిస్తుంది. ఈ ఆధునిక సాంకేతికత రొమ్ములను వివిధ కోణాల నుండి చిత్రీకరిస్తుంది. తద్వారా కణితిని బాగా పరీశిలించి ప్రభావవంతమైన చికిత్సను సూచించడానికి సహాయపడుతుంది. 

ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనం స్క్రీనింగ్ మరియు డయాగ్నోస్టిక్ మామోగ్రఫీ లో ఉపయోగించే X-రే కిరణాల ద్వారా వచ్చే దుష్ప్రభావాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. డయాగ్నోస్టిక్ మామోగ్రామ్‌లు కణితి ఉందో లేదో గుర్తించడంలో సహాయపడతాయి, అయితే స్క్రీనింగ్ మామోగ్రామ్‌లు రొమ్ముల యొక్క వివరణాత్మక పరీశీలనకు (Detailed examination) ఉపయోగపడుతాయి.

మామోగ్రఫీలో పురోగతులు:

డిజిటల్ మామోగ్రఫీ (Digital Mammography):

ఫిల్మ్ మామోగ్రామ్‌కి (Film Mammogram) విరుద్ధంగా, డిజిటల్ మామోగ్రామ్ రొమ్ము యొక్క చిత్రాలను డిజిటల్‌గా క్యాప్చర్ చేయడానికి x-రేలను ఉపయోగిస్తుంది.

కంప్యూటర్ సహాయంతో గుర్తించడం (Computer-aided detection):

ఇవి అసాధారణ కణజాలం (abnormal tissue) యొక్క ప్రాంతాల కోసం డిజిటలైజ్డ్ మామోగ్రాఫిక్ చిత్రాల ద్వారా స్కాన్ చేస్తాయి. అసాధారణ కణజాలం గుర్తించబడితే, ఆ ప్రాంతాన్ని బాగా పరిశీలించమని రేడియాలజిస్ట్‌ను (Radiologist) హెచ్చరిస్తుంది.

డిజిటల్ బ్రెస్ట్ టోమోసింథసిస్ (Digital Breast Tomosynthesis; DBT):

3D మామోగ్రఫీ మరియు డిజిటల్ బ్రెస్ట్ టోమోసింథసిస్ (DBT), వివిధ కోణాల నుండి రొమ్ము యొక్క బహుళ చిత్రాలను తీసుకొని వాటిని 3D చిత్రంగా పునర్నిర్మించే ఒక అధునాతన సాంకేతికత.

మామోగ్రఫీ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు: 

ప్రయోజనాలు (Advantages):

స్క్రీనింగ్ మామోగ్రఫీ అధిక ఖచ్చితత్వంతో రొమ్ములో అనుమానాస్పద కణితులను గుర్తిస్తుంది. దీనితో మనం అవసరం లేకుంటే అనవసరమైన మరియు ఇతర ఖరీదైన పరిశోధనలను నివారించవచ్చు.

అనుమానాస్పద కణితులు ఉన్నవారిలో, ఈ పరిశోధనలు ఆ కణితుల పట్ల వైద్యుని దృష్టిని హెచ్చరించడం ద్వారా తదుపరి మూల్యాంకనానికి మార్గనిర్దేశం చేస్తాయి.

కణితులు చిన్నవిగా మరియు ప్రారంభ దశలో ఉన్నప్పుడు, వాటిని నయం చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మరియు రొమ్మును సంరక్షించడానికి శస్త్రచికిత్స ఎంపికలతో సహా విస్తృత శ్రేణి చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

నష్టాలు (Disadvantages): 

  • రేడియేషన్‌కు అధికంగా గురయ్యే అవకాశం ఉంది, కానీ ఖచ్చితమైన రోగనిర్ధారణ ప్రయోజనంతో పోలిస్తే, ప్రమాదం చాలా తక్కువ.
  • కొన్నిసార్లు తప్పుడు-పాజిటివ్ (False- Positive) చూపించిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల వైద్యులు అదనపు మామోగ్రామ్‌లు లేదా అల్ట్రాసౌండ్ (Ultrasound), ఫాలో-అప్ మరియు బయాప్సీతో లోతు పరిశోధనలను చేయవలసి వస్తుంది.

 

Related Posts

Leave a Comment