ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో క్యాన్సర్ బారిన పడతారని ఒక అంచనా. క్యాన్సర్ ఇప్పుడు ఒక క్లిష్టమైన ఆరోగ్య మరియు మానవ సమస్య. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది క్యాన్సర్ ను తగ్గించడానికి మరియు మెరుగైన క్యాన్సర్ సంరక్షణ కోసం పని చేసే సంస్థ. ప్రతి సంవత్సరం, ఫిబ్రవరి 4వ తేదీని క్యాన్సర్ దినోత్సవంగా పరిగణిస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారాలు, మరియు సంఘాలు దీనికి మద్దతుగా తమ వంతు కృషి చేస్తున్నాయి.
ఈ సంవత్సరం క్యాన్సర్‌లో రోగులకు అందించే సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణలో సిఫార్సు చేయబడిన ఉత్తమ పద్ధతుల మధ్య వ్యత్యాసానిపై దృష్టి సారించింది. క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే స్థాయిలో సంరక్షణ లభించదు. వారు ఉండే ప్రాంతం, ఆర్థిక పరిస్థితి, లింగం, మరియు అనేక ఇతర అంశాలు వారు పొందే చికిత్స, సమాచారం మరియు సహాయాన్ని ప్రభావితం చేస్తాయి.
మేము, Onco లో, మా సేవల ద్వారా ఏడాది పొడవునా ఈ అంతరాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నాము. క్యాన్సర్ కేర్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి నెలలో మేము కొన్ని అదనపు ఆఫర్‌లు మరియు ఈవెంట్‌లను కూడా తీసుకొస్తున్నాం.
క్యాన్సర్ చికిత్సలో ఆర్థిక సమస్యలు
భారతదేశంలో, క్యాన్సర్ రోగులు మరియు సంరక్షకులు మొదటిగా పరిగణించే వాటిల్లో ఒకటి ఆర్థిక సమస్య. క్యాన్సర్ చికిత్స చాలా మంది భారతీయులకు ఖరీదైనదిగా పరిగణించబడుతుంది. సబ్సిడీతో కూడిన క్యాన్సర్ చికిత్స సౌకర్యాలు జనాభా యొక్క డిమాండ్‌లను తీర్చలేక పోతున్నాయి, ఇది రోగుల సుదీర్ఘ నిరీక్షణకు దారి తీస్తుంది.
నాణ్యమైన క్యాన్సర్ కేర్‌ను మరింత సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో, మేము ఓంకో కేర్ ప్లస్‌ను (Onco Care Plus) అందిస్తున్నాము. మీరు మా యాప్ Onco క్యాన్సర్ కేర్ ద్వారా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పొందవచ్చు. నెలకు రూ.399తో, మీరు క్రింది ప్రయోజనాలను పొందవచ్చు:
- ఆంకాలజిస్ట్‌తో ఒక ఉచిత కన్సల్టేషన్
- ఆంకాలజిస్ట్‌తో ఒక ఉచిత ఆడియో కన్సల్టేషన్ (audio consultation)
- మా భాగస్వామి సెంటర్స్ నుండి డయాగ్నస్టిక్ పరీక్షలు మరియు స్కాన్‌లపై 35% తగ్గింపు
- మా సెంటర్స్ నుండి క్యాన్సర్ చికిత్సలపై 5% తగ్గింపు
- మందుల డెలివరీపై (medicines delivery) 15% తగ్గింపు
- మీ కోసం ఉత్తమ చికిత్స ప్రణాళికను కనుగొనే ట్యూమర్ బోర్డ్ సర్వీస్ పై 50% తగ్గింపు
మా Onco Care Plus సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి
క్యాన్సర్ కేర్ లో సమాచార సమస్యలు
క్యాన్సర్ రోగులు మరియు సంరక్షకులకు శ్రేయోభిలాషులు తరచూ విభిన్నమైన మరియు విరుద్ధమైన సలహాలు ఇస్తారు మరియు క్యాన్సర్‌కు ఎలా చికిత్స చేయవచ్చనే దానిపై ఇంటర్నెట్ కూడా చాలా (తప్పు) సమాచారాన్ని అందజేస్తుంది.
ఈ అంతరాన్ని తగ్గించడానికి, మేము క్యాన్సర్ సంరక్షణకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు ఉచితంగా సమాధానాలను అందిస్తున్నాము. ఇది Onco క్యాన్సర్ కేర్ యాప్‌లోని ఒక ఫీచర్, మీరు ఈ ఆప్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనర్థం మీరు సరైన సమాచారం పొందడానికి వేరే ఇతర వెబ్సైట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మీ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలను పొందవచ్చు.
అదనంగా, Onco కేర్ ప్లస్ క్యాన్సర్ రోగులకు వారి చికిత్స ప్రణాళిక నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో తెలుసుకునేలా కాంప్లిమెంటరీగా వారికి తగిన పోషకాహార ప్రణాళికను కూడా అందిస్తుంది.
క్యాన్సర్ చికిత్సా ఫలితాలను మెరుగుపరచడంలో సరైన పోషకాహారం ఎలా సహాయపడుతుందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి https://onco.com/blog/customised-cancer-diet-and-nutrition-in-telugu/
మా కేర్ మేనేజర్‌లు రోగి యొక్క క్యాన్సర్ ప్రయాణం అంతటా చేదోడువాదోడుగా ఉంటారు, తద్వారా వారు సరైన మొత్తం సమాచారాన్ని ఒకే చోట పొందగలరు, అది వారికి సరైన క్యాన్సర్ సౌకర్యాన్ని కనుగొనడంలోనైనా లేదా నిర్దిష్ట దుష్ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ కేర్ అందుబాటులో లేకపోవడం
భారతదేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, అయితే 90% క్యాన్సర్ కేర్ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. లాక్‌డౌన్‌లు మరియు వైరస్‌ల భయం, ప్రజలను చికిత్స కోసం ప్రయాణించకుండా నిరోధిస్తుంది. ఈ పరిస్థితి క్యాన్సర్ చికిత్సను పొందడంలో మరింత సమస్యగా మారింది.
ఆన్‌లైన్లో (online) డాక్టర్ సంప్రదింపులు మరియు ట్యూమర్ బోర్డ్ వంటి ఆన్‌లైన్ సేవల ద్వారా, ఈ సమస్యను తగ్గించి, ఎక్కడ ఉన్నారనే దానితో సంబంధం లేకుండా సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను పొందేలా చేయాలని మేము ఆశిస్తున్నాము.
అదనంగా, మేము నైపుణ్యాన్ని మరియు అనుభవాన్ని పంచుకోవడంలో సహాయపడటానికి నిపుణులైన ఆంకాలజిస్ట్‌లు, క్యాన్సర్ బాధితులు మరియు వైద్య అభ్యాసకులతో ఉచితంగా ఆన్లైన్లో ఈవెంట్‌లను పెడుతున్నాం. ఈ ఈవెంట్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి instagram లేదా facebook లో మమ్మల్ని అనుసరించండి .
క్యాన్సర్ కేర్ లో అధునాతన సాంకేతికత అందుబాటులో లేకపోవడం
కీమోథెరపీ, సర్జరీ మరియు రేడియేషన్ థెరపీలలో అత్యాధునిక సాంకేతికత ఇప్పటికీ మెట్రోపాలిటన్ నగరాల్లోని కొన్ని క్యాన్సర్ సెంటర్ లలో మాత్రమే ఉంది. ఈ సెంటర్లు ఉండే ప్రాంతం మరియు వైద్యానికి అయ్యే ఖర్చు చాలా మంది క్యాన్సర్ రోగులకు ఈ సౌకర్యాలను అందుబాటులో లేకుండా చేసింది.
మా Onco క్యాన్సర్ సెంటర్‌లు ప్రపంచ-స్థాయి సాంకేతికతను, అందుబాటు ఖర్చులలో, సులభంగా అందుబాటులో ఉండటానికి అనేక ప్రదేశాలలో క్యాన్సర్ సహాయాన్ని అందిస్తున్నాయి. కీమోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు COVID-రహితంగా ఉండే సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో అందించబడతాయి. జుట్టు రాలడం వంటి దుష్ప్రభావాలను తగ్గించే స్కాల్ప్-కూలింగ్ టెక్నాలజీ కూడా రోగులకు అందుబాటులో ఉంటుంది.
క్యాన్సర్ కేర్ లో సామజిక సమస్యలు
భారతదేశంలో క్యాన్సర్ యొక్క దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే దానితో పాటుగా వచ్చే సామాజిక భయం. సామాజిక జీవనం నుండి వారిని ఒంటరితనంలో నెడతారనే భయంతో ప్రజలు తమ రోగ నిర్ధారణను పంచుకోవడానికి ఇప్పటికీ వెనుకాడుతున్నారు.
వారి క్యాన్సర్ కథనాల గురించి ఎక్కువగా మాట్లాడే మా సర్వైవర్స్ కమ్యూనిటీ (survivors community) ద్వారా, మేము ఈ ధోరణిని మార్చాలని ఆశిస్తున్నాము. క్యాన్సర్ తో పోరాడిన వీరు క్యాన్సర్ చికిత్స సమయంలో మద్దతు మరియు ప్రోత్సాహాన్ని కోరుకునే ఎవరికైనా మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.
మేము క్యాన్సర్ చికిత్సకు సమగ్ర విధానాన్ని అందిస్తాము, ఇందులో రోగికి అలాగే వారి సంరక్షకులకు కౌన్సెలింగ్ సేవలు ఉంటాయి.
క్యాన్సర్‌పై ఈ పోరాటంలో మీరు ఎలా చేరగలరు?
మిమ్మల్ని ఈ పోరాటం కదిలిస్తే, క్యాన్సర్ కేర్ లో ఈ సమస్యలను నిర్ములించడంలో మాతో చేరాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఈ పోరాటంలో మీరు చేయగల కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి:
- అవగాహనను ప్రోత్సహించండి
పై సమాచారం నుండి ప్రయోజనం పొందగల క్యాన్సర్ రోగి లేదా వారి సంరక్షకుడు మీకు తెలిస్తే, దయచేసి వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి. నాణ్యమైన క్యాన్సర్ కేర్ ఇంతకుముందు అనుకున్న దానికంటే తక్కువ ధరకే లభిస్తుందని తెలుసుకుని వారు ఆశ్చర్యపోతారు.
క్యాన్సర్ లక్షణాలపై అవగాహన అనేది మీకు క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే కారణాలపై మీ అవగాహనను పెంచుకోవడానికి మరియు మీరు దానిని ఎలా పెరగకుండా ఆపగలరో తెలుసుకోవడనికి, మా కథనాలను చదవండి.
ఫిబ్రవరి క్యాన్సర్ అవేర్‌నెస్ నెల, కానీ సంవత్సరంలో ఏ నెల అయినా క్యాన్సర్ గురించి ఈవెంట్‌ని చేయడానికి మంచి సమయమే. చాలా విద్యా సంస్థలు మరియు కార్యాలయాల్లో ఆన్లైన్ ఈవెంట్‌లు జనాదరణ పొందాయి.
- మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి
క్యాన్సర్ విషయానికి వస్తే ఎవరూ అనర్హులు కారు. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల శరీరంలో ఏవైనా అసాధారణతలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.
మీ రొమ్ములలో ఏవైనా గడ్డలు ఉన్నాయా అని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మర్చిపోకండి. మీరు మీ రొమ్ములను ఎలా స్వయంగా పరీక్షించుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి . రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్ మరియు ఇది ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులభంగా చికిత్స చేయవచ్చు.
మీరు ఏ స్క్రీనింగ్ పరీక్షలకు వెళ్లాలో తెలుసుకోవడానికి మీ వైద్యుడితో మాట్లాడండి. సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్‌లను ప్రారంభ దశల్లో గుర్తించవచ్చు.
- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి
సరైన బరువును కలిగి ఉండటం మరియు చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
మీ జీవనశైలిలో సాధారణ మార్పులు క్యాన్సర్ నివారణకు ఒక ప్రారంభం కావచ్చు. ప్యాకేజ్ చేయబడ్డ ఆహారాలు, ఎర్రటి మాంసం, చక్కెర పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండటం, తాజా పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం కూడా దీనికి బాగా దోహదపడుతుంది.
- పొగాకు మానేయండి
క్యాన్సర్ కు కారణమైన వాటిల్లో పొగాకు ముఖ్యమైనది మరియు తప్పక నివారించవలసినది. రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ల తర్వాత, భారతదేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లు పెదవి మరియు నోటి క్యాన్సర్లు. ఈ రకమైన క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో పొగాకు ఒకటి.
ఊపిరితిత్తులు, నోటి మరియు గర్భాశయ క్యాన్సర్‌తో సహా వివిధ రకాల క్యాన్సర్‌లతో పాటు, పొగాకు అనేక ఇతర అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. మీ పొగాకు అలవాటును మానుకోవడంలో మీకు సమస్య ఉంటే, మీరు పొగాకు మానడంలో సహాయపడే డి-అడిక్షన్ కౌన్సెలర్‌తో(de-addiction counsellor) మాట్లాడండి.
ఇంకా ఎంతో భవిష్యత్తు మనకోసం వేచి చూస్తుంది
క్యాన్సర్ కేర్‌ను నిజంగా అందుబాటులోకి తీసుకురావడానికి చాలా పని చేయాల్సి ఉంది. భారతదేశంలో క్యాన్సర్ కేర్‌లో ఈ సమస్యలను తగ్గించాలని చూస్తున్న ప్రతి వ్యక్తితో భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాము.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కోసం మా ఈవెంట్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, మా వెబ్‌సైట్ సందర్శించండి.