క్యాన్సర్ సంక్లిష్టంగా ఉంటుంది, కానీ క్యాన్సర్ గురించి సరైన జ్ఞానం మరియు సహాయం లేకపోవడం వలన అది మరింత క్లిష్టంగా మారుతుంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమయాల్లో మీకు సరైన మార్గదర్శం చేయడానికి మీకు సహాయపడే నిపుణుల బృందం మా Onco వద్ద ఉంది.
Onco లోని కేర్ మేనేజ్‌మెంట్ బృందం మీ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల సహాయాన్ని అందించగల వైద్య నిపుణులను కలిగి ఉంటుంది. వారు మీకు సహాయం చేయగల అనేక సమస్యలలో కొన్ని ఈ కింది జాబితాలో ఉన్నాయి.
- సమాచారం
ఇంటర్నెట్‌లో గొప్ప వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ, క్యాన్సర్ రోగులు మరియు సంరక్షకులు సరైన సమాచారాన్ని కనుగొనడంలో ఇప్పటికీ కష్టపడుతున్నారు.
దీనికి కారణం ఏమిటంటే, క్యాన్సర్ విషయానికి వస్తే, ఒక ప్రశ్నకు ఎవరి దగ్గర స్థిరమైన సమాధానం ఉండదు. సమాధానాలు రోగి వయస్సు, వారి వైద్య చరిత్ర, వారు ఎదుర్కొనే ఇతర వ్యాధులు, ప్రభావితమైన అవయవం, వ్యాధి దశ, రోగి యొక్క సాధారణ ఆరోగ్యం మరియు అనేక ఇతర అంశాల వంటి నిర్దిష్ట వివరాలపై ఆధారపడి ఉంటాయి.
దీని కారణంగా, క్యాన్సర్‌కు సంబంధించిన చాలా ప్రశ్నలకు మీరు ఇంటర్నెట్‌లో ఒక సరైన సమాధానాన్ని కనుగొనలేరు. సమయాన్ని వృథా చేయకుండా సరైన సమాచారాన్ని కనుగొనడం రికవరీకి కీలకమైనది.
Onco యొక్క కేర్ మేనేజ్‌మెంట్ బృందం మీకు సరైన ఆంకాలజిస్ట్‌ను కనుగొనడం నుండి చికిత్స యొక్క దుష్ప్రభావాలతో వ్యవహరించే వరకు మీ ప్రశ్నలకు సరైన మరియు ఖచ్చితమైన సమాధానాలను త్వరగా అందించగలదు.
మీ సంరక్షణ నిర్వాహకులు మీ కోసం సమాధానమివ్వగల ప్రశ్నలకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
- నాకు సరైన ఆంకాలజిస్ట్ ఎవరు మరియు ఎందుకు?
- నా బడ్జెట్‌లో నేను చికిత్స పొందగలిగే ఆసుపత్రులు ఏవి?
- మీరు నాకు దగ్గరలో ఉన్న సెంటర్‌లో డయాగ్నస్టిక్ టెస్ట్ బుక్ చేయగలరా?
- నాకు ఈ ఔషధాన్ని ఎందుకు సూచించారు? సాధ్యమయ్యే దుష్ప్రభావాలు ఏమిటి?
- నేను ఈ దుష్ప్రభావాలను ఎలా తగ్గించగలను లేదా నివారించగలను?
- నేను సరైన హోమ్-కేర్ ఎక్కడ పొందగలను?
2. చికిత్స ప్రణాళిక
కేర్ మేనేజ్‌మెంట్ బృందం మీ చికిత్స యొక్క ప్రతి దశను ముందుగా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడుతుంది. మా అంతర్గత వైద్య నిపుణుల బృందంలో వివిధ చికిత్సా విధానాలకు చెందిన ఆంకాలజిస్ట్‌లు ఉన్నారు, వారు తుదుపరి దశల గురించి మీకు సలహా ఇవ్వగలరు.
వైద్య నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో మీ రోగనిర్ధారణ రిపోర్టులను అర్ధం చేసుకోవడం మరియు మీ చికిత్స మరియు రికవరీ ప్రయాణం యొక్క తదుపరి దశలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
పోషకాహార అవసరాల నుండి కౌన్సెలింగ్ సహాయం వరకు మీ అవసరాలను గుర్తించడం ద్వారా, మీ కేర్ మేనేజర్ క్యాన్సర్ సంరక్షణకు సంబంధించిన అంశాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయవచ్చు, ఇది మీ విజయవంతమైన చికిత్స మరియు వేగంగా కోలుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
3. రాయితీలు మరియు ఆర్థిక ప్రణాళిక
మీ కేర్ మేనేజర్ మీకు సమీపంలోని వివిధ ఆసుపత్రులలో క్యాన్సర్ చికిత్స ఖర్చులను పోల్చి చూపిస్తారు, తద్వారా మీరు మీ చికిత్స సెంటర్ గురించి తెలుసుకొని మీకు అనువైన చికిత్స సెంటర్ ని ఎంచుకోవచ్చు.
మీరు Onco ద్వారా బుక్ చేసుకున్నప్పుడు మందులు, రోగనిర్ధారణ పరీక్షలు మరియు నిర్దిష్ట వైద్యుల సంప్రదింపులపై తగ్గింపులను కూడా పొందగలరు.
క్యాన్సర్ చికిత్స యొక్క ఖర్చుల విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి, మీరు క్రౌడ్ ఫండింగ్ మరియు ఇతర తగిన మార్గాల ద్వారా నిధులను ఎలా సేకరించవచ్చో కేర్ మేనేజర్ మీకు సలహా ఇవ్వగలరు.
4. మీకు తగిన క్యాన్సర్ సంరక్షణ
క్యాన్సర్ చికిత్సను ఎదుర్కొన్న ఎవరికైనా ఇది జీవితంలో చాలా అలసిపోయే మరియు తరచుగా గందరగోళంగా ఉండే సమయం అని తెలుసు. మీ సమస్యలను వినడానికి ఎవరైనా ఉండటం మరియు వారు మీకు సహాయంతో పాటు పరిష్కారాలను అందించడం మీ అనుభవాన్ని మార్చివేస్తుంది.
ప్రక్రియ తర్వాత మిమ్మల్ని తనిఖీ చేయడం నుండి, మీ తదుపరి పరీక్ష లేదా డాక్టర్ అపాయింట్‌మెంట్‌కు ముందు మీకు గుర్తు చేయడం వరకు, మీ సంరక్షణ నిర్వాహకులు మీ అవసరానికి అనుగుణంగా చేయగలిగిన సహాయాన్ని అందిస్తారు.
5. ఆఫ్‌లైన్ సహాయం
మీ కేర్ మేనేజర్ మీకు ఆన్‌లైన్లో అందుబాటులో ఉండటం వలన మీకు అవసరమైనప్పుడు వారిని చేరుకోవడానికి మీకు సులభం అవుతుంది. కానీ కొన్నిసార్లు, మీకు ఆసుపత్రిలో లేదా క్లినిక్‌లో అదనపు సహాయం అవసరం కావచ్చు. అటువంటి సమయాల్లో, Onco భారతదేశంలోని చాలా నగరాల్లో వారి నెట్వర్క్ కలిగి ఉంది, అక్కడ ఆఫ్లైన్ సెంటర్స్ లో మీకు సహాయం చేస్తుంది.
పై జాబితా నుండి మీరు చూడగలిగినట్లుగా, మీ కేర్ మేనేజర్ మీకు సహాయం చేయలేని క్యాన్సర్ సంబంధిత సమస్య ఏదీ లేదు. మాతో మీ క్యాన్సర్ సంరక్షణ ప్రయాణాన్ని ప్రారంభించడానికి, మీరు 79965 79965 నెంబర్ కి కాల్ చేయవచ్చు.