నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు సరైన ఆహారాలు

by Team Onco
658 views

నోటి పుండ్లు కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ యొక్క దుష్ప్రభావం కావచ్చు. ఇవి నొప్పిని కలిగిస్తాయి మరియు తినడం, మింగడం లేదా మాట్లాడటం కూడా కష్టతరం చేస్తుంది. నోటి పుండ్లు సాధారణంగా చికిత్స ప్రారంభించిన 2 – 3 వారాల తర్వాత వస్తాయి మరియు ప్రతి సెషన్ తర్వాత మళ్లీ కనిపించవచ్చు. 

Table of Contents

మీరు నోటి పుండ్లతో బాధపడుతున్నారా?

ఈ క్రింది లక్షణాలు మీకు నోటి పుండ్లు ఉన్నాయో లేదో తెలియజేస్తుంది:

  • మీ నోటిలో ఎర్రగా కనిపించే పుండ్లు ఉన్నాయా, కొన్నిసార్లు మధ్యలో తెల్లటి మచ్చలు ఉన్నాయా?
  • మీరు నమలినప్పుడు లేదా మింగినప్పుడు నొప్పి వస్తుందా?
  • మీకు గొంతు నొప్పిగా అనిపిస్తుందా?
  • మీరు మీ చిగుళ్ళలో లేదా నోటిలో వాపును చూడగలరా?
  • నోటిలో, చిగుళ్ళపై లేదా నాలుక కింద చిన్న కోతల నుండి రక్తస్రావం అవుతుందా?
  • మీ నాలుకపై చీము కనిపిస్తుందా?
  • మీ నోటిలో శ్లేష్మం(mucus) పెరిగిందా?

మీరు పై ప్రశ్నలలో దేనికైనా అవును అని సమాధానం ఇచ్చినట్లయితే, దీని గురించి మీ వైద్యునికి తెలియజేయండి. ఈ లక్షణాలను మెరుగ్గా నియంత్రించడానికి మరియు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి వారు మీకు మార్గనిర్దేశం చేయగలుగుతారు. 

మీకు నోటి పుండ్లు ఉన్నప్పుడు ఏమి తినగలరు?

ఈ సమయంలో నమలడం మరియు మింగడం కష్టంగా మారుతుంది. నోటిలో ఏర్పడ్డ గాయాలకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ఎక్కువగా నమలడం అవసరం లేని ఆహారాన్ని తీసుకోవడం మంచిది. సెమీ-సాలిడ్ (Semi-solid), తక్కువ ఫైబర్ మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారం, ముఖ్యంగా చల్లగా లేదా కొద్దిగా చల్లగా ఉండే ఆహారాలు, సులభంగా తినవచ్చు. అంటే స్మూతీస్ (smoothies), ఐస్ క్రీములు, ఫ్రూట్ జ్యూస్ వంటి ఆహారాలు ఈ సమయంలో మీకు సరిపడే ఆహారాలు. 

మీ క్యాన్సర్ చికిత్స సమయంలో మీరు తగినంత పోషకాహారాన్ని పొందడానికి, మా సీనియర్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ కృష్ణ ప్రియ మీ కోసం కొన్ని వంటకాలను సూచించారు. ఈ వంటకాలను ఇలాంటి సమయంలో సురక్షితంగా తినవచ్చు మరియు ఈ ఆహారం సరైన పోషకాలని కలిగి ఉంటుంది.  

1. స్ట్రాబెర్రీ-కొబ్బరి పాల స్మూతీ

strawberry smoothie can help cancer patients deal with mouth sores while on cancer treatments

కావలసినవి

  • 1 కప్పు స్ట్రాబెర్రీ ముక్కలు
  • ½ కప్పు కొబ్బరి పాలు
  • ½ కప్పు పెరుగు
  • ½ అరటి కాయ

చేయవలసిన విధానం

అన్ని పదార్థాలను బ్లెండర్లో కలపండి. చల్లగా తీసుకోండి.

2. జొన్న, రాగి & ఖర్జూరం జావ

Ragi jonna java can help cancer patients fight with cancer treatment side effects, mainly mouth sores

కావలసినవి

  • ½ కప్ జొన్నలు
  • ½ కప్పు రాగి
  • విత్తనాలు తీసేసిన 4 ఖర్జూరాలు

చేయవలసిన విధానం

  • జొన్నలు మరియు రాగులను విడిగా కడగి, బాగా వడకట్టండి.
  • 4 కప్పుల నీరు మరియు ఖర్జూరాలతో కలిపి మూడు విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించండి.
  • చల్లారిన తర్వాత, మిక్సర్ లేదా బ్లెండర్ ఉపయోగించి బ్లెండ్ చేయండి. 
  • అవసరమైతే బ్లెండింగ్ సమయంలో నీరు కలపండి. 
  • మిశ్రమాన్ని పాన్‌లో పోసి మీడియం మంట మీద ఉడికించండి. నిరంతరం మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. 
  • మిశ్రమం సరిగ్గా కలిసాక, స్టవ్ ఆఫ్ చేసి, చల్లారాక తీసుకోండి. 

3. పాలకూర & కాలీఫ్లవర్ సూప్

cauliflower soup helps cancer patients intake sufficient nutrition while suffering from mouth sores

కావలసినవి

  • 3 కప్పులు, తరిగిన పాలకూర
  • 1 కప్పు సన్నగా తరిగిన కాలీఫ్లవర్
  • ¼ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • 2 స్పూన్ల నూనె
  • రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాలు

చేయవలసిన విధానం

  • ఉల్లిపాయలను నూనెలో 1 నిమిషం లేదా అవి మెత్తబడే వరకు వేయించాలి.
  • పాలకూర మరియు కాలీఫ్లవర్ వేసి 2 నిమిషాలు వేయించాలి.
  • రెండు కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత, చల్లారడానికి కాస్త సమయం ఇవ్వండి. తరువాత, దానిని తగినంత బ్లెండ్ చేయండి. 
  • కాస్త చల్లారాక తీసుకోండి. 

4. మసూర్ దాల్ & పాలక్ ఖిచిడి

Masoor dal and palak kichdi can help cancer patients deal with mouth sores while on cancer treatments

కావలసినవి

  • 1 కప్పు బియ్యం
  • ½ కప్పు ఎర్ర కందిపప్పు
  • 2 కప్పులు, తరిగిన పాలకూర
  • ½ స్పూన్ యాలకుల పొడి
  • ½ స్పూన్ పసుపు 
  • ½ స్పూన్ దాల్చిన చెక్క పొడి 
  • 1 టేబుల్ స్పూన్ టమోటా గుజ్జు
  • 2 స్పూన్ నెయ్యి 
  • రుచికి సరిపడా ఉప్పు 

చేయవలసిన విధానం

  • బియ్యం మరియు కందిపప్పును కడిగి 15 నిమిషాలు నానబెట్టండి.
  • పాలకూర ఆకులను కడిగి తగినంత బ్లెండ్ చేయండి, దానిని వడకట్టండి.
  • ప్రెజర్ కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి, యాలకుల పొడి, పసుపు మరియు దాల్చినచెక్క పొడి కూడా వేయండి.
  • టొమాటో గుజ్జును వేయండి.
  • చివరగా కడిగిన బియ్యం, కందిపప్పు మరియు బ్లెండ్ చేయబడ్డ పాలకూరను వేయండి. 
  • ఉప్పు మరియు 3 కప్పుల నీరు వేయండి. 
  • 3 – 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి. 
  • ఉడికిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాస్త చల్లారాక తినండి. 

5. పసుపు పాల ఐస్ క్రీమ్

turmeric and milk ice cream is the best food for patients with mouth sores

కావలసినవి

  • 2 కప్పుల కొబ్బరి పాలు
  • 1 ½ స్పూన్ల పసుపు 
  • 4-5 స్పూన్ల స్వచ్ఛమైన తేనె

చేయవలసిన విధానం

  • అన్ని పదార్థాలను బ్లెండర్‌లో లో వేసి మిక్స్ చేయండి మరియు తేనె దిగువకు అంటుకోనంత వరకు మిక్స్ చేయండి.
  • ఐస్ క్రీమ్ అచ్చులలో పోసి రాత్రిపూట ఫ్రీడ్జ్ లో పెట్టండి. 
  • చల్లగా తినండి.

6. చల్లని కీర దోసకాయ సూప్

cucumber soup for cancer patients

కావలసినవి

  • 1 ఒలిచిన దోసకాయ
  • 1 కప్పు పెరుగు (ఎక్కువ పులుపు ఉండకూడదు)
  • 1 స్పూన్ నిమ్మరసం
  • 1 స్పూన్ స్వచ్ఛమైన తేనె
  • 1 స్పూన్ సన్నగా తరిగిన పుదీనా ఆకులు
  • 1-2 వెల్లుల్లి రెబ్బలు
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • బ్లెండర్‌లో అన్ని పదార్థాలను వేసి మృదువుగా అయ్యేంత వరకు కలపండి
  • నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి.
  • చల్లగా తాగండి.

7. గుమ్మడికాయ ఆపిల్ సూప్

pumpkin and apple soup for cancer patients

కావలసినవి

  • 2 కప్పులు ఒలిచిన మరియు ముక్కలుగా చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు
  • 1 కప్పు ఒలిచిన మరియు ముక్కలుగా చేసుకున్న ఆపిల్ ముక్కలు
  • ¼ కప్పు తరిగిన ఉల్లిపాయలు
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 టేబుల్ స్పూన్లు తరిగిన వెల్లుల్లి
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. 
  • మీడియం మంట మీద వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను వేయించాలి.
  • గుమ్మడికాయ మరియు ఆపిల్ ముక్కలు వేసి, 1 నిమిషం వేయించాలి.
  • ఉడికించడానికి ఉప్పు మరియు 2 కప్పుల నీరు జోడించండి.
  • పాన్‌ను మూతతో కప్పి 20 నిమిషాలు లేదా గుమ్మడికాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత, చల్లార్చి మిక్సర్ లేదా బ్లెండర్‌లో మిక్స్ చేయండి. 
  • సూప్ మందంగా చేయడానికి, మిక్స్ చేసిన మిశ్రమాన్ని తిరిగి పాన్‌లో వేసి, తగినంత వరకు ఉడికించాలి. 

8. వనిల్లా సోయా హల్వా

vanilla and soya halwa is good for cancer patients to deal with mouth sores

కావలసినవి

  • 2 కప్పులు సోయా పాలు
  • 1 స్పూన్ వెనిల్లా
  • 3 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి
  • ⅓ కప్పు చక్కెర
  • చిటికెడు ఉప్పు

చేయవలసిన విధానం

  • ఒక గిన్నెలో చక్కెర, మొక్కజొన్న పిండి మరియు ఉప్పు వేసి కలపండి.
  • ముద్దలు రాకుండా నిరంతరం కలుపుతూ, సోయా పాలలో కొద్ది కొద్దిగా పోయాలి. 
  • ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద చిక్కబడే వరకు ఉడికించాలి. వంట చేసేటప్పుడు నిరంతరం కలుపుతూ ఉండాలి. 
  • స్టవ్ నుండి చిక్కగా ఉన్న మిశ్రమాన్ని తీసివేసి, వెనీలా వేసి బాగా కలపాలి. 
  • సర్వింగ్ డిష్‌లో లేదా గ్లాసుల్లో పోసి, సర్వ్ చేసే ముందు రెండు గంటలపాటు చల్లార్చండి.

9. అవోకాడో, బేరిపండు, బచ్చలికూర స్మూతీ 

avacado and pear soup is the best food item for cancer patients with mouth sores

కావలసినవి

  • 1 కప్పు, తరిగిన పండిన అవోకాడో (ఒలిచిన)
  • 1 ½ కప్పు తరిగిన బచ్చలికూర
  • 1 కప్పు ఒలిచిన మరియు తరిగిన ఆపిల్ ముక్కలు
  • 1 కప్పు ఒలిచిన మరియు తరిగిన పియర్/బేరిపండు ముక్కలు

చేయవలసిన విధానం

ఒక కప్పు చల్లటి నీటితో పాటు అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి మిక్స్ చేయండి. చల్లగా తాగండి. 

10. క్యారెట్ ఉల్లిపాయ సూప్

carrot and onion soup for cancer patients to deal with mouth sores

కావలసినవి

  • 2 క్యారెట్లు, ముక్కలుగా చేసుకొవాలి
  • 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి
  • ½ స్పూన్ పసుపు 
  • ¼ టీస్పూన్ దాల్చిన చెక్క పొడి
  • 2 కప్పుల వెజిటబుల్ స్టాక్ (vegetable stock)
  • 1 కప్పు పాలు
  • 1 టేబుల్ స్పూన్ తాజా క్రీమ్
  • 1 టేబుల్ స్పూన్ వెన్న
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • ఒక పాన్ లో, వెన్న వేసి వేడి చేయాలి మరియు ఉల్లిపాయలు వేయాలి. మృదువైనంత వరకు వేయించాలి. 
  • ఉల్లిపాయలకు పసుపు మరియు జీలకర్ర పొడిని వేయాలి. 
  • క్యారెట్లు వేసి, పాన్ మూతపెట్టి, క్యారెట్లు మెత్తబడే వరకు ఉడికించాలి. 
  • ఉడికిన మరియు చల్లబడిన తర్వాత, మిక్స్‌ను పాలు మరియు వెజిటబుల్ స్టాక్‌తో కలిపి బ్లెండర్‌లో వేసి మిక్స్ చేయండి. 
  • మిక్స్ అయిన తర్వాత, ఉడకబెట్టడానికి తిరిగి పాన్‌ లోకి మిక్స్ ని తీసుకోండి. 
  • రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రెష్ క్రీమ్ గార్నిష్ తో సర్వ్ చేయాలి. 

11. పెరుగు అన్నం

curd rice can help cancer patients deal with mouth sores

కావలసినవి

  • ½ కప్ వండిన, మెత్తగా ఉండే అన్నం
  • 1 ½ కప్పు నీరు
  • 1 కప్పు పెరుగు
  • 1 స్పూన్ నూనె
  • ½ స్పూన్ ఆవాలు
  • ½ స్పూన్ సన్నగా తరిగిన అల్లం
  • ½ స్పూన్ జీలకర్ర 
  • ½ టీస్పూన్ ఇంగువ 
  • కొన్ని కరివేపాకులు 
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • అన్నాన్ని, పెరుగు మరియు నీటితో కలపండి. 
  • రుచికి ఉప్పు కలపండి.
  • పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. 
  • అవి వేగిన తర్వాత, అల్లం మరియు కరివేపాకు వేయండి. 
  • కరివేపాకు వేగిన తర్వాత, ఇంగువను వేయండి.
  • ఇప్పుడు, వేడి నూనె మిశ్రమాన్ని పెరుగు అన్నంలో పోయాలి. తర్వాత కలిపి తినండి. 

12. చికెన్ స్టూ (Chicken stew)

chicken stew is the best food item for non-vegetarian cancer patients

కావలసినవి

  • 500 గ్రాముల చికెన్
  • 2 క్యారెట్లు, ఒలిచి ముక్కలుగా చేసుకోవాలి
  • 2-4 బంగాళదుంపలు, ఒలిచి ముక్కలుగా చేసుకోవాలి
  • 3 లవంగాలు 
  • 1 బిర్యానీ ఆకు
  • 2 టేబుల్ స్పూన్ల వెన్న
  • 1 టేబుల్ స్పూన్ మైదా పిండి
  • రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం

  • ఒక పాత్రలో వెన్న వేడి చేసి, క్యారెట్‌లను వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. 
  • దానికి ఉప్పు, వెల్లుల్లి జోడించండి. వెల్లుల్లి యొక్క పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. 
  • మైదా వేసి, క్యారెట్ ముక్కలకు పట్టేంత వరకు కలపాలి. 
  • చికెన్ మరియు బంగాళాదుంపలను వేయాలి.
  • చికెన్ మరియు బంగాళాదుంప మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. 
  • వడ్డించే ముందు చికెన్‌ను ముక్కలు చేసి, కూరగాయలను స్మాష్ చేయండి. రోగి తురిమిన చికెన్‌ను నమలలేకపోతే మీరు దీని కోసం బ్లెండర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మీ పరిస్థితికి సరైన ఆహార ప్రణాళిక కావాలా?
79965 79965కు కాల్ చేసి, మా సీనియర్ పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్  వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

Related Posts

Leave a Comment