క్యాన్సర్ రోగులకు ఉత్తమ ఆహారం: ప్రత్యేకంగా తెలుగు ప్రజల కోసం 

by Team Onco
1185 views

క్యాన్సర్ చికిత్సలు ఆకలిని కోల్పోవడం, రుచి కోల్పోవడం, వికారం, వాంతులు మొదలైన దుష్ప్రభావాలను(side effects) కలిగిస్తాయి.

బరువు తగ్గడం లేదా విపరీతమైన నీరసం, మీ చికిత్సను మరియు చికిత్స నుండి కోలుకునే ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు సరిపడా పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

మీరు తెలంగాణ(Telangana) మరియు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రాంతాలకు చెందినవారైతే లేదా తెలుగు వంటకాలకు ప్రాధాన్యతనిస్తే, మీకు  కావాల్సిన పోషకాహారాన్ని తీసుకుంటూనే, మీ రోజువారీ ఇష్టమైన వంటకాలను తీసుకోవడం కొనసాగించవచ్చు.

ఈ కథనంలో, సీనియర్ డైటీషియన్ డా. కృష్ణ ప్రియ మీకు తెలుగు వంటకాల నుండి కొన్ని ఎంపిక చేసిన వంటకాలను, క్యాన్సర్ రోగుల (Cancer Pateints) కోసం ఎంచుకున్న వంటకాలను మీకు అందిస్తున్నారు. ఈ వంటకాలతో, మీరు తగినంత ప్రోటీన్ తీసుకోవచ్చు, అలాగే మెరుగైన జీర్ణక్రియ కోసం తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవచ్చు.

క్యాన్సర్ డైట్(Cancer Diet) దుష్ప్రభావాలను తగ్గించడంలో మరియు మీ చికిత్స నుండి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. మీరు మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన అనారోగ్యాలతో బాధపడుతుంటే, మీ ప్రస్తుత పరిస్థితికి తగినట్లుగా ఆహారం తీసుకోవడం చాలా అవసరం. Onco క్యాన్సర్ డైటీషియన్‌లు(Cancer Dietitians) మీ క్యాన్సర్ రకం, మీరు తీసుకుంటున్న చికిత్స విధానం, మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరియు మీకు ఉన్న ఏవైనా అలర్జీలు లేదా ఆహార ప్రాధాన్యతలకు సరిపోయే ఆహార ప్రణాళికతో(Diet Plan) మీకు సహాయం చేయగలరు.

మీ కోసం సరైన ఆహార ప్రణాళికను పొందడానికి 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

తెలుగు వంటకాల నుండి ఉత్తమ క్యాన్సర్ డైట్ వంటకాలు

1. చీజీ ఓట్స్ పెసరట్టు (Cheesy Oats Pesarattu)

Cheesy oats pesarettu is the best diet for cancer patients

కావలసిన పదార్థాలు
½ కప్పు ఆకుపచ్చ పెసర పప్పు
¼ కప్పు వోట్స్ (instant oats)
½ కప్పు బియ్యం
½ స్పూన్ మెంతి గింజలు
తురిమిన చీజ్
2 పచ్చి మిరపకాయలు
1 అంగుళం అల్లం
½ కప్పు కొత్తిమీర
నెయ్యి
ఉప్పు
1 కప్పు ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు
1 ఉల్లిపాయ ముక్కలు
100gms పనీర్
½ కప్పు టొమాటో కెచప్ లేదా మీకు నచ్చినది ఏదైనా
కొన్ని తరిగిన కొత్తిమీర ఆకులు

చేయవలసిన విధానం 

  • పచ్చి పెసర పప్పు, బియ్యం మరియు మెంతి గింజలను కలిపి 7 గంటలు లేదా రాతంత్రా నానబెట్టండి.
  • ఓట్స్‌ను మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • నానబెట్టిన పదార్థాలను, మిరపకాయలు మరియు అల్లంతో పాటు గ్రైండ్ చేయండి.
  • ఈ పిండిలో ఓట్స్ పొడిని కలపండి. దోసె వేయుటకు సరిపడేలా తగినంత నీళ్లు పోసి కలుపుకోండి.
  • తరిగిన కొత్తిమీర తరుగును పిండిలో వేయాలి.
  • ఒక గిన్నెలో క్యాప్సికమ్, పనీర్, ఉల్లిపాయలు మరియు మిగిలిన కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
  • దోసె పెనం వేడి చేసి నెయ్యి రాయండి.
  • పాన్‌పై పిండిని దోసెలా వేయండి.
  • దోసెను రెండు వైపులా కాల్చుకోండి. 
  • దోసెకు కెచప్‌ను రాయండి.
  • దానిపై కూరగాయలు వేసి, తురిమిన చీజ్ ను చల్లుకోండి.
  • దోసెను వేడిగానే తినండి. 

 

2. మినపప్పు లడ్డు (Urad Dal Ladoo)

Urad dal laddoo is the best diet for cancer patients

కావలసిన పదార్థాలు
1 కప్పు మినపప్పు
⅓ కప్పు పంచదార
⅓ కప్పు నెయ్యి
3 – 4 ఏలకులు

చేయవలసిన విధానం:

  • మందపాటి అడుగు గల పాన్ ను వేడి చేయండి.
  • తక్కువ మంట మీద, మినపప్పును బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • బాగా వేగిన మినపప్పును ఒక ప్లేట్‌లో వేసి చల్లబరచండి.
  • చల్లారిన మినపప్పుకు కొన్ని యాలకులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • చక్కెరను విడిగా పొడి చేయండి.
  • మినపప్పు పొడిని చక్కెర పొడితో కలపండి.
  • ఒక బాణలిలో నెయ్యి కరిగించి, మినపప్పు మరియు చక్కెర మిశ్రమాన్ని వేయండి.
  • గరిటెని ఉపయోగించి, అది చిక్కగా అయ్యే వరకు కలపాలి.
  • తరువాత ఆ మిశ్రమాన్ని లడ్డూలుగా చేయండి.
  • లడ్డూలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి, గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

3. గోధుమ పిండితో బొబ్బట్లు (Bobattlu with wheat flour)

Bobbatlu is a sweetish diet for cancer patients

కావలసిన పదార్థాలు
2 కప్పులు గోధుమ పిండి
1 కప్పు సెనగ పప్పు
1 కప్పు బెల్లం
సెనగ పప్పు ఉడికించడానికి 1 ½ కప్పు నీరు
పిండి తయారీకి కావాల్సిన నీరు
3 టేబుల్ స్పూన్లు నెయ్యి
¼ స్పూన్ యాలకుల పొడి
రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం:

  • గోధుమ పిండికి చిటికెడు ఉప్పు మరియు నెయ్యి వేసి కలపండి.
  • తరువాత నీటిని ఉపయోగించి మెత్తని పిండిలా చేసుకొని రెండు గంటలు పక్కన పెట్టుకోండి.
  • మరో వైపు సెనగ పప్పును నీటిలో గంటసేపు నానబెట్టండి.
  • ఆ నీటిలో నుంచి వడకట్టిన సెనగ పప్పును ప్రెషర్ కుక్కర్‌లో 1 ½ కప్పుల నీటిలో ఉడికించాలి. దీనికి సన్నని మంట మీద సుమారు 5 విజిల్స్ పడుతుంది.
  • సెనగ పప్పును వడకట్టి, చల్లారిన తర్వాత మిక్సీలో బెల్లం, చిటికెడు ఉప్పు, యాలకులపొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్ స్మూత్ గా ఉండేలా చూసుకోండి.
  • ఎక్కువ నీటిని తొలగించడానికి మిశ్రమాన్ని ఒక పాన్లో వేయించాలి.
  • బొబ్బట్లలోకి స్టఫింగ్ కోసం ఈ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసుకోండి.
  • కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని కూడా చిన్న లడ్డూలుగా చేసుకోండి. గోధుమ పిండి లడ్డూలూ మరియు సెనగ పిండి లడ్డూలూ ఒకే సంఖ్యలో ఉండాలి.
  • గోధుమ పిండిని కావాల్సినంత పెద్దగా రోటి వలె వత్తుకోండి. మధ్యలో సెనగ పిండి లడ్డూను ఉంచి గోధుమపిండి రోటీతో పూర్తిగా కవర్ చేయండి. 
  • నెయ్యి ఉపయోగించి, ఈ బొబ్బట్లను పెనం మీద రెండువైపులా సమానంగా కాల్చుకోవాలి.
  • తయారైన బొబ్బట్లను కావాల్సినంత వేడిగా ఉండగానే తినండి.

4. మామిడికాయతో అన్నం (Mango Rice)

Best cancer diet for cancer patients from south India

కావలసిన పదార్థాలు
2 కప్పులు అన్నం
1 పచ్చి మామిడి, తురిమినది
¼ కప్పు వేరుశెనగ
2 రెమ్మలు కరివేపాకు
2 ఎండు మిరపకాయలు
¼ టీస్పూన్ పసుపు
3 టేబుల్ స్పూన్లు నూనె
1 అంగుళం అల్లం
1 టేబుల్ స్పూన్ సెనగ పప్పు
1 టేబుల్ స్పూన్ మినప్పప్పు
1 స్పూన్ ఆవాలు

చేయవలసిన విధానం:

  • లోతైన బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి.
  • ఈ నూనెలో వేరుశెనగలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • బాణలిలో మిగిలిన నూనెలో ఆవాలు వేయండి.
  • సెనగ పప్పు, మినప్పప్పు, మరియు ఎర్ర మిరపకాయలను వేసి  వేయించాలి.
  • అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి వేయించండి.
  • తగినంత ఇంగువ, ఉప్పు, మరియు పసుపు వేసి కలపండి.
  • తరిగి పెట్టుకున్న మామిడికాయను వేసి, అది మెత్తగా మరియు గుజ్జుగా అయ్యేవరకు బాణలికి మూత పెట్టి ఉడికించాలి.
  • సరిగ్గా కలపడానికి వీలుగా ఉండెందుకు కొద్ది కొద్దిగా అన్నం వేసుకుంటూ బాగా కలుపుకోండి.
  • తరువాత మంటను ఆపివేసి, వేయించి పెట్టుకున్న వేరుశెనగలను కలుపుకోండి.

5. బీట్‌రూట్ రసం (Beetroot Rasam)

Healthy rasam with beetroot for maintaining good health during cancer

కావలసిన పదార్థాలు
2 కప్పులు తరిగిన బీట్‌రూట్
2 టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరి
తరిగిన వెల్లుల్లి యొక్క 6 రెబ్బలు
½ తరిగిన ఉల్లిపాయ
1 కప్పు చింతపండు రసం
2 స్పూన్ నూనె
½ స్పూన్ ఆవాలు
½ స్పూన్ జీలకర్ర గింజలు
½ స్పూన్ మినప్పప్పు
ఒక చిటికెడు ఇంగువ
2 రెమ్మలు కరివేపాకు
2 పచ్చిమిర్చి
½ స్పూన్ పసుపు పొడి
½ స్పూన్ మిరప పొడి
¼ కప్పు సన్నగా తరిగిన పుదీనా మరియు కొత్తిమీర ఆకులు
రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం:

  • బీట్‌రూట్‌ను పది నిమిషాలు లేదా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి, అవసరమైతే మాత్రమే నీరు ఉపయోగించండి.
  • ఉడికించిన బీట్‌రూట్‌ను కొబ్బరితో కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
  • బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు వేయండి.
  • మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకులను వేయించి, ఇంగువ వేయండి.
  • వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  • చింతపండు, ఉప్పు మరియు పసుపు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
  • రుబ్బి పెట్టుకున్న బీట్‌రూట్ మరియు కొబ్బరి మిశ్రమాన్ని వేయండి. తగినంత నీరు వేసుకోండి. ఈ మిశ్రమం యొక్క రసం తగినంత చిక్కగా ఉండాలి.
  • చివరగా మిరప పొడి, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేయాలి.
  • వేడిగా ఉండగా తీసుకోవాలి.

6. చికెన్ పులావ్ (Chicken Pulao)

Chicken pulao - protein diet recipe for cancer patients to maintain their energy levels

కావలసిన పదార్థాలు
250 గ్రాముల చికెన్
1 ½ కప్పులు బాస్మతి బియ్యం
2 ½ కప్పుల నీరు
2 టేబుల్ స్పూన్లు పెరుగు
1 తరిగిన ఉల్లిపాయ
1 తరిగిన టమోటా
2 టేబుల్ స్పూన్లు నూనె
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
½ స్పూన్ మిరప పొడి
చిటికెడు పసుపు
1 స్పూన్ గరం మసాలా
1 బిరియాని ఆకు
1 అనాస పువ్వు
½ స్పూన్ జీలకర్ర
6 లవంగాలు
4 ఏలకులు
1 అంగుళం దాల్చిన చెక్క
¾ టీస్పూన్ సోంపు పొడి
2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పుదీనా ఆకులు
2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు
రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం:

  • బాస్మతి బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నానబెట్టండి.
  • పెరుగు, మిరప పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరియు పసుపు వేసి చికెన్‌ను కలిపి మ్యారినేట్(marinate) చేయండి. ఇది చికెన్‌ను మృదువుగా చేస్తుంది.
  •  కుక్కర్‌లో నూనె వేడి చేసి, సుగంధ ద్రవ్యాలు వేయండి: బిరియాని ఆకు, అనాస పువ్వు, జీలకర్ర గింజలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క  మరియు సోంపు పొడి.
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • మ్యారినేట్ చేసిన చికెన్ ని కుక్కర్ లో వేసి బాగా ఉడికించాలి.
  • టొమాటో వేసి మెత్తగా అయ్యెవరకు ఉడికించాలి.
  • పుదీనా మరియు కొత్తిమీర ఆకులు వేయండి.
  • నీళ్లు పోసి మరిగించండి.
  • ఉప్పు మరియు నానబెట్టిన బియ్యం వేయండి.
  • సన్నని మంటపై ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించండి.
  • తరువాత అన్నం మరియు చికెన్ బాగా కలిసేలా కలిపి వేడిగా తినండి.

7. జొన్నపిండి కేక్ (Millet Cake)

Healthiest sweet for cancer patients during the cancer treatments

కావలసిన పదార్థాలు
60 గ్రాముల జొన్నపిండి (ఏదైనా రకం)
50 గ్రాముల చక్కెర
20 ml పాలు
2 గుడ్లు
1 స్పూన్ వనిల్లా (Vanilla extract)

చేయవలసిన విధానం:

  • ఓవెన్‌ను (Oven) ముందుగా 180 °C వరకు వేడి చేయండి.
  • ఒక గిన్నెలో గుడ్లు తీసుకొని బాగా కలపండి.
  • కొద్దిగా పంచదార వేసి కలపండి.కొంచెం చిక్కగా అయ్యాక ఆపండి.
  • ఇప్పుడు, జొన్నపిండిని కొంచెం కొంచెం వేసి కలపండి.
  • తరువాత పాలు మరియు వనిల్లా (Vanilla) వేయండి.
  • ఒక కేక్ పాన్ (Cake Pan) తీసుకుని, చుట్టూ వెన్న రాసి, తయారు చేసిన మిశ్రమాన్ని అందులో పోయండి.
  • 30 నిమిషాలు ఓవెన్‌ లో పెట్టండి. ఒక టూత్‌పిక్‌ని తీసుకొని కేక్ మధ్యలో గుచ్చి, కేక్ బాగా తయారయ్యిందో  లేదో తెలుసుకోవచ్చు. టూత్‌పిక్‌ కి కేక్ అంటకుండా శుభ్రంగా బయటకు వస్తే, అప్పుడు ఓవెన్ నుండి తీయవచ్చు.
  • మీరు కావాలనుకుంటే కేక్‌పై పొడి చక్కెర పొడి చల్లుకోవచ్చు.

8. పాలక్ మరియు పప్పు – పొడి (Palak and Dal – Dry)

Palak and dal dry recipe for cancer patients

కావలసిన పదార్థాలు
250 గ్రాముల పాలకూర ఆకులు
½ కప్పు కందిపప్పు
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
2 తాజా మిరపకాయలు
3 రెబ్బలు తరిగిన వెల్లుల్లి
½ స్పూన్ మిరప పొడి
¼ స్పూన్ జీలకర్ర
½ స్పూన్ గరం మసాలా
రుచికి సరిపడా ఉప్పు
వేయించడానికి నూనె

చేయవలసిన విధానం:

  • పాలకూర ఆకులను కడగి తరిగి పెట్టుకోండి.
  • కందిపప్పు సగం ఉడికినంత వరకు నీటితో ఉడికించాలి.
  • బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్రను వేయండి.
  • తరువాత, వెల్లుల్లి మరియు ఎర్ర మిరపకాయలను వేయండి.
  • వెల్లుల్లి యొక్క పచ్చి వాసన పోయిన తర్వాత, ఉల్లిపాయలను వేయండి.
  • ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  • పాలకూర, పసుపు మరియు ఉప్పు వేసి, ఒక 4-5 నిమిషాలు కలుపుతూ వేయించండి.
  • కందిపప్పు వేసి, కలుపుతూ బాగా ఉడికించండి.
  • ఎర్ర మిరప పొడి మరియు గరం మసాలా పొడి వేసి బాగా కలుపొని మంటను ఆపేయండి. 

9. సర్వపిండి (Sarvapindi)

Best healthy diet for south Indian cancer patients - Sarvapindi with Spinach

కావలసిన పదార్థాలు
3 కప్పులు బియ్యం పిండి
2 కప్పుల నీరు
1 కప్పు సన్నగా తరిగిన బచ్చలికూర(spinach) ఆకు
1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
2 తరిగిన పచ్చి మిర్చి
కరివేపాకు కొన్ని రెమ్మలు
రుచికి సరిపడా ఉప్పు
వేయించడానికి నూనె

చేయవలసిన విధానం:

  • ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని మరిగించాలి.
  • అందులో బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
  • పిండిని కలుపుటకు ఒక గిన్నెలోకి తీసుకోని చల్లారనివ్వండి.
  • బచ్చలికూర ఆకులు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు మరియు దంచిన మిరపకాయలను పిండిలో కలపండి.
  • పిండిని పది నిమిషాలు వదిలేయండి.
  • తర్వాత దాన్ని చిన్న ఉండలుగా చేయండి.
  • మీడియం మంట మీద, పాన్ మీద రోటీ ఆకారంలో ప్రతి ఉండని నొక్కండి.
  • నూనె వేసి రెండు వైపులా సమానంగా కాల్చుకోండి.
  • గోధుమ రంగు మచ్చలు కనిపించిన తర్వాత, మీరు పాన్ నుండి రోటీని తీయవచ్చు.
  • పెరుగుతో కలిపి తినవచ్చు.

10. గోంగూర చికెన్ కర్రీ (Gongura Chicken Curry)

Gongura chicken is the healthy recipe for cancer patients to maintain their stamina during the cancer treatments

కావలసిన పదార్థాలు
500 గ్రాముల చికెన్
1 ½ కప్పులు గోంగూర ఆకులు
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
1 స్పూన్ గరం మసాలా పొడి
2 టేబుల్ స్పూన్లు గసగసాల పేస్ట్
1 బిరియాని ఆకు
2 ఏలకులు
2 లవంగాలు
1 అంగుళం దాల్చిన చెక్క
½ స్పూన్ జీలకర్ర
¾ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
చిటికెడు పసుపు
¼ స్పూన్ మిరప పొడి
రుచికి సరిపడా ఉప్పు
వేయించడానికి నూనె

చేయవలసిన విధానం:

  • చికెన్‌ని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరప పొడి, ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి.
  • గసగసాలు కరకరలాడే వరకు పొడిగా వేయించాలి.
  • గసగసాలను మిక్సీలో పౌడర్ చేసి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేయండి.
  • శుభ్రం చేసిన గోంగూర ఆకులను ఒక స్పూన్ నూనెతో వేయించాలి.
  • ఆకులు వాటి తేమను కోల్పోయి పరిమాణంలో తగ్గిపోయినప్పుడు, మంటను ఆపివేయండి.
  • చల్లారిన తర్వాత, ఆకులను పేస్ట్‌ చేయండి.
  • పాన్‌లో నూనె వేసి అన్ని సుగంధ ద్రవ్యాలు జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క మరియు ఏలకులు వేయండి.
  • ఉల్లిపాయలు మరియు కరివేపాకు వేయండి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  • చికెన్ మరియు గరం మసాలా వేయండి.
  • అవసరమైనంత నీరు వేసి, చికెన్ తెల్లగా మరియు మెత్తగా మారే వరకు ఉడికించాలి.
  • గోంగూర మరియు గసగసాల పేస్ట్ వేయండి.
  • బాగా కలుపుతూ గ్రేవీ తగినంత చిక్కగా వచ్చే వరకు ఉడికించాలి.
  • రుచికి సరిపడా ఉప్పు వేయండి.
  • అన్నం లేదా రోటీతో వేడిగా తినండి.

11. గుడ్డు దోస (Egg Dosa)

Egg dosa - healthy protein recipe - for Andhra and Telangana people

కావలసిన పదార్థాలు
1 కప్పు దోసె పిండి
2 గుడ్లు
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
¼ కప్పు తురిమిన క్యారెట్
సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు
2 స్పూన్ నూనె
రుచికి సరిపడా ఉప్పు

చేయవలసిన విధానం:

  • దోసె పాన్ కు నూనె పూసి వేడి చేయండి.
  • దోసె పిండిని పోయండి.
  • దోసె పాక్షికంగా కాలిన తర్వాత, దానిపై గుడ్డు పగలగొట్టి, పచ్చసొనను దోస మీద వేయండి.
  • దోసెపై తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు మరియు క్యారెట్‌లను చల్లండి.
  • గుడ్డు పూర్తిగా ఉడకడానికి దోసెను తిప్పి కాల్చుకోండి.
  • వేడిగా తినండి.

12. కరకరలాడే బెండకాయ రెసిపీ (Crispy Bhindi Recipe)

Bindi fry - healthy south Indian recipe for cancer people

కావలసిన పదార్థాలు
500 గ్రాముల బెండకాయలు
2 స్పూన్లు వేరుశెనగ
1-2 ఎర్ర మిరపకాయలు
2 టేబుల్ స్పూన్లు ధనియాలు
2 టేబుల్ స్పూన్లు జీలకర్ర
1 టీస్పూన్ సెనగ పప్పు
1-2 వెల్లుల్లి రెబ్బలు
2 టేబుల్ స్పూన్లు ఎండిన కొబ్బరి
రుచికి సరిపడా ఉప్పు
వేయించడానికి నూనె

చేయవలసిన విధానం:

  • ఒక బాణలిలో జీలకర్ర, సెనగ పప్పు, ఎర్ర మిరపకాయలు, ధనియాలు  మరియు వేరుశెనగలను వేసి వేయించాలి. తర్వాత వాటిని చల్లార్చి పొడి చేయాలి.
  • ఈ పొడిలో ఉప్పు, కొబ్బరి తురుము, దంచిన వెల్లుల్లిపాయలు వేయాలి.
  • నూనె వేడి చేసి బెండకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • డీప్ ఫ్రై (deep fry) చేసిన బెండకాయలకు వేడిగా ఉండగానే తయారు చేసుకున్న పొడిని వేసి కలపండి.
  • అన్నంలోకి లేదా రోటీలోకి జత చేసుకొని తినండి.

13. పచ్చి బఠానీల వడ (Green Peas Vada)

Best snack recipes in telugu for cancer patients

కావలసిన పదార్థాలు
2 కప్పులు చల్లబరచిన బఠానీలు
1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ తరిగిన జీడిపప్పు
1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి
రుచికి సరిపడా ఉప్పు
వేయించడానికి నూనె

చేయవలసిన విధానం:

  • బటానీలను ఉడకబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, మరియు జీడిపప్పు వేసి బాగా కలపండి.
  • బాణలిలో నూనె పోసి వేడిగా అయ్యాక, పిండిని చిన్న వడలుగా చేసి నూనెలో వేసి వేయించండి.
  • బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి.
  • వేడిగా ఉండగా తినండి.

కీమోథెరపీ చేయించుకునే క్యాన్సర్ రోగులు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? – ఈ కథనాన్ని ఇక్కడ చదవండి

మీ పరిస్థితికి సరైన డైట్ ప్లాన్ కావాలంటే, మీరు మాకు 79965 79965కు కాల్ చేయవచ్చు లేదా మీరు మా యాప్ (App) ద్వారా మా పోషకాహార నిపుణుడితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

Related Posts

Leave a Comment