మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే 6 రోజువారీ అలవాట్లు

by Team Onco
501 views

మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని నిర్ధారణ అయినట్లయితే, మీరు కూడా ప్రమాదంలో ఉన్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో క్యాన్సర్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ సర్వసాధారణంగా మారుతోంది, మరియు మన జీవనశైలి మరియు రోజువారీ అలవాట్లు ఇందులో పాత్ర పోషిస్తాయా అని మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

క్యాన్సర్ జీవనశైలికి సంభందించిన వ్యాధి. క్యాన్సర్‌కు జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి, అయితే ఇవి 5 – 10% క్యాన్సర్‌లకు మాత్రమే కారణమవుతున్నాయి. అంటే క్యాన్సర్‌ను పూర్తిగా నిరోధించలేకపోయినా, మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే ఆరు అలవాట్లను ఇక్కడ చూద్దాం. 

1. పొగాకు

పొగాకు క్యాన్సర్‌కు అతిపెద్ద కారణం. ఇది నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది. 

tobacco or smoking can cause cancer and is among 6 habits that can increase cancer risk

గుట్కా, జర్దా, పాన్ మసాలా మొదలైన వాటి రూపంలో పొగాకును నమలడం తల మరియు మెడ క్యాన్సర్‌లకు ప్రధాన కారణం. ధూమపానం, వేపింగ్, హుక్కా మొదలైనవి పొగాకు వినియోగానికి సంభందించిన హానికరమైన రూపాలు. 

సరళంగా చెప్పాలంటే, పొగాకు వినియోగంలో సురక్షితమైన స్థాయి అనేది లేదు. కానీ శుభవార్త ఏమిటంటే: మీరు ధూమపానం మానేసిన తర్వాత, కొన్ని సంవత్సరాలలో మీ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

ధూమపానం మానేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ధూమపానాన్ని విజయవంతంగా మానేయడంలో మీకు సహాయపడే అనేక సపోర్టు గ్రూపులు, డి-అడిక్షన్ కౌన్సెలర్లు, మరియు వైద్య నిపుణులు ఉన్నారు. 

2. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు

ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో చిప్స్ నుండి బ్రెడ్ వరకు ఈ రోజు మన మార్కెట్లో సులభంగా లభించే అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. మీకు చేరే ముందు దాని సహజ రూపం మార్చబడిన ఏదైనా ఆహారాన్ని ప్రాసెస్ చేయబడిన ఆహారం అంటారు. దీనర్థం, వాటిని సంరక్షించడానికి లేదా దాని స్వభావాన్ని మార్చడానికి ఇప్పటికే వండిన, గడ్డ కట్టిన, క్యాన్‌లో ఉంచబడిన, ప్రిసర్వేటివ్స్ (preservatives) వాడిన, ప్యాక్ చేసిన ఆహారాలను ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటారు. 

eating processed foods can cause cancer

మీ ఫ్రిజ్  మరియు ఆహారాన్ని ఉంచే చోట్లలో ఆ పదార్థాలలో ఎన్ని ప్రాసెస్ చేయబడ్డాయో చూడండి. మనము తినే వాటిలో దాదాపు 30% ప్రాసెస్ చేయబడుతుందని మీకు అర్ధమవుతుంది. 

ఈ అలవాటును మార్చుకోవడానికి సంకల్పం మరియు ప్రేరణ అవసరం, అయితే దీన్ని ఆచరించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, మీ దినచర్యలో తాజా ఆహారాలను చేర్చడానికి ఆహ్లాదకరమైన మరియు రుచికరమైన ఆహార మార్గాలను ఎంచుకోవాలి. 

కొన్ని మార్గాలు:

  • తాజా కూరగాయలు, పండ్లు మరియు తృణధాన్యాలు (బార్లీ, మిల్లెట్ వంటివి) వంటి తాజా ఆహారాల నుండి తయారు చేయగల వంటకాల జాబితాను (రెసిపీలతో సహా) రూపొందించండి. మీ వంటకాలు మరియు రుచి ప్రాధాన్యతలను బట్టి, మీ కోసం ఈ వంటకాలను అందించగల వెబ్‌సైట్‌లను వెతకండి. ఈ సమాచారాన్ని కలిగి ఉండటం వలన, ప్రాసెస్ చేయబడిన ఆహారాలపై మీ ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. 
  • మీరు షాపింగ్ చేసే ముందు మీ కిరాణా సామాన్ల జాబితాను తయారు చేసుకోండి. మీకు అవసరమైన ఆరోగ్యకరమైన పదార్థాలను వ్రాయండి మరియు మీరు దుకాణంలో ఉన్నప్పుడు అనవసర కొనుగోళ్లను నివారించండి. 
  • మీరు తినగల తాజా పండ్లు మరియు కూరగాయలను ఎంచుకోండి. వివిధ వంట పదార్థాలు మరియు సుగంధ ద్రవ్యాలతో ప్రయోగాలు చేయడం కూడా సహాయపడవచ్చు. 
  • వంట కోసం ఎక్కువ సమయం కేటాయించండి. ఇది మీ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చే ఒక అంశం. చాలా మంది పని చేసే వారు వంట చేయకుండా ఉంటారు మరియు ప్యాక్ చేసిన ఆహారాలపై ఆధారపడతారు, వారి ఆహారంలో తగినంత పోషకాహారం లేకపోవడానికి ఇది దారితీస్తుంది. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ని (పండ్లు మరియు కూరగాయలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు మసాలా దినుసులు కలిగిన ఆహార ప్రణాళిక) అనుసరించడాన్ని మీరు పరిగణించవచ్చు. 

3. శారీరికంగా చురుకుగా ఉండకపోవడం

మీరు ఎక్కువ సమయం కూర్చొని ఉంటే, మీకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయం క్యాన్సర్ ముప్పుతో ముడిపడి ఉంటుంది. 

sitting for longer hours can increases the chances of getting cancer

వారానికి నాలుగు నుండి ఐదు సార్లు 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక అనేది సులభమైన ఏరోబిక్ వ్యాయామం. వ్యాయామం చేసేటప్పుడు మీరు ఎక్కువగా నీటిని తీసుకునేలా చూసుకోండి. 

4. చక్కెర పానీయాలు 

కూల్ డ్రింక్స్ మరియు ప్రాసెస్ చేసిన జ్యూస్‌లలో చక్కెర చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అధిక చక్కెర కంటెంట్ ఉన్న పానీయాలు తాగడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్‌కు మరో ప్రమాద కారకం అయిన ఊబకాయంతో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. 

చక్కెర పానీయాలు ప్రత్యేకంగా యువ మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌ కు దారి తీసే అవకాశం ఉంది. 

sugary cool drinks or fruit juices can increase cancer risk

5. మద్యం

ఆల్కహాల్ నోటి, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు, పురీషనాళం, మరియు రొమ్ము వంటి అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని క్యాన్సర్లకు అధిక మొత్తంలో మద్యం తీసుకోవడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఇతర రకాల క్యాన్సర్‌లకు (రొమ్ము క్యాన్సర్ వంటివి), తక్కువ మొత్తంలో మద్యం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.

alcohol consumption is one among the 6 factors that increase risk of getting cancer

6. రెడ్ మీట్

మటన్ మరియు పంది మాంసం వంటి రెడ్ మీట్ (red meat) తీసుకోవడం వల్ల మీ ప్రేగు మరియు కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 

red meat is one among the 6 risk factors that increases cancer risk

మీరు రెడ్ మీట్‌ని క్రమం తప్పకుండా తినే అలవాటు ఉన్నట్లయితే, చేపలు మరియు పౌల్ట్రీ వంటి లీన్ మీట్‌లను (lean meats) ప్రత్యామ్నాయంగా తీసుకోండి. గుడ్లు, బీన్స్ మరియు కాయధాన్యాలు ప్రోటీన్ యొక్క ఇతర మంచి వనరులు. 

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

 

Related Posts

Leave a Comment