ఈ వ్యాసం క్యాన్సర్ రోగులకు మరియు వారి సంరక్షకులకు ట్యూమర్ బోర్డ్ (Tumour Board) యొక్క ఉపయోగాలను వివరిస్తుంది.
భారతదేశంలో క్యాన్సర్ రోగులు మరియు వారి సంరక్షకులు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి వారి వ్యాధికి సంబంధించిన తగినంత సమాచారం లేకపోవడం. వారి క్యాన్సర్ దశ ఏమిటి, తరువాత ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, ఏ చికిత్స చాలా అనుకూలంగా ఉంటుంది, మరియు ఆ చికిత్స నుండి ఎలాంటి ఫలితాలను ఆశించవచ్చు అనే విషయాలపై సమాచారం పొందడం చాలా ముఖ్యం.
సరైన సమయంలో సరైన సమాచారం లేకుండా, క్యాన్సర్ ఉన్నదానికంటే చాలా క్లిష్టమైన వ్యాధిగా అనిపించవచ్చు.
క్యాన్సర్ చికిత్స ప్రయాణం యొక్క ప్రతి దశలో, అనగా రోగనిర్ధారణ నుండి, సరైన చికిత్సను పొందడం, మరియు క్యాన్సర్ ను జయించాక ఉపశమన సమయంలో ఫాలో-అప్ గురించి, రోగులు మరియు వారి సంరక్షకులు పూర్తి అవగాహన కోసం కష్టపడుతుంటారు.
మా అంకితమైన కేర్ మేనేజర్‌ల (Care Managers) ద్వారా మీ క్యాన్సర్ చికిత్స ప్రయాణం అంతటా Onco మీకు సహాయం చేయగలదు. క్యాన్సర్ చికిత్స సమయంలో మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వడంలో వారు మీకు సహాయం చేయగలరు.
మా ట్యూమర్ బోర్డ్ సేవ మీరు సరైన చికిత్స మార్గంలో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మీకు ఇంతకంటే మెరుగైన చికిత్స ప్రణాళిక ఏదైనా అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది.
ట్యూమర్ బోర్డ్‌లో భారతదేశం మరియు యుఎస్ (US) నుండి ఆంకాలజీకి సంబంధించిన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన క్యాన్సర్ నిపుణులు ఉన్నారు. ఈ ఆంకాలజిస్టులు క్యాన్సర్‌కు చికిత్స చేయడంలో 10+ సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు మరియు టాటా మెమోరియల్, AIIMS మరియు మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ వంటి ప్రముఖ సంస్థల నుండి శిక్షణ పొందారు.
ఈ సేవను పొందేందుకు, మీరు మీ వైద్య రిపోర్టులను (Medical reports) మా కేర్ మేనేజర్ కు షేర్ చేయాలి. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే అవి కూడా రిపోర్టులతో జోడించి పంపవచ్చు. మేము మీ యొక్క పరిస్థితి గురించి స్పష్టంగా వివరిస్తాము మరియు మీరు తీసుకోవాల్సిన తదుపరి రోగ నిర్ధారణ పరీక్షలు, సరియైన చికిత్స ఎంపికలు, మరియు మా సూచనలతో సహా వివరణాత్మక రిపోర్టును సిద్ధం చేస్తాము.
మీ రిపోర్టులను షేర్ చేసిన రెండు మూడు రోజుల్లో, మీరు మా నుండి ట్యూమర్ బోర్డ్ రిపోర్టును (Tumour Board Report) అందుకుంటారు.
మీకు ప్రయోజనం కలిగించే అత్యాధునిక చికిత్స ఎంపికల సమాచారంతో పాటుగా మీ కోసం ఉత్తమమైన చికిత్స ఎంపికను ట్యూమర్ బోర్డ్ రిపోర్టు మీకు అందిస్తుంది. మీ క్యాన్సర్‌కు తగిన క్లినికల్ ట్రయల్స్‌ను (Clinical Trials) కనుగొనడంలో కూడా మేము మీకు సహాయం చేస్తాము.
దానితో పాటు మీ చికిత్స నుండి ఆశించిన ఫలితాలను (Expected Outcomes) మరియు ఫాలో-అప్ వివరాలను (Follow-up details) కూడా వివరిస్తాము.
రిపోర్టును స్వీకరించిన తర్వాత మీరు 25 రోజుల పాటు ట్యూమర్ బోర్డును సంప్రదించవచ్చు. మీరు మీ చికిత్స ప్రయాణంలో మా కేర్ మేనేజర్స్ సేవలను కూడా పొందవచ్చు.
మీ అవసరాలు మరియు బడ్జెట్‌పై ఆధారపడి సరైన రోగనిర్ధారణ పరీక్షలు మరియు చికిత్సా కేంద్రాలతో పాటు, మీ క్యాన్సర్ రకం మరియు దశకు సరైన ఆంకాలజిస్ట్‌ను కనుగొనడంలో కూడా మా కేర్ మేనేజర్ మీకు సహాయం చేస్తారు.
మా కేర్ మేనేజర్‌లు మీ క్యాన్సర్ ప్రయాణంలో ప్రతి దశలో ఆ దశకు సంబంధించిన సమాచారం మరియు సేవలతో మీకు సహాయం చేస్తూనే ఉంటారు. ఈ సేవలను ఎంచుకున్న రోగులకు మేము పోషకాహార మార్గదర్శకత్వం (Nutrition guidance) మరియు కౌన్సెలింగ్ (Counselling)సేవలను కూడా అందిస్తాము.
Onco యొక్క ట్యూమర్ బోర్డ్ కొన్ని విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంది, ఇది మీ క్యాన్సర్ చికిత్స నుండి ఎక్కువ ప్రయోజనం పొందడంలో మీకు సహాయపడుతుంది.
Onco.com ఏ నిర్దిష్ట చికిత్సా కేంద్రం లేదా ఆంకాలజిస్ట్‌తో అనుబంధించబడలేదు. ఇది క్యాన్సర్ చికిత్సలపై నిష్పాక్షికమైన సలహాను అందించడానికి మరియు రోగికి సరైన చికిత్స మార్గాన్ని చూపించడానికి మాకు వీలు కల్పిస్తుంది.
రెండవ అభిప్రాయం మీ చికిత్సలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి నివారించడానికి ఎంతో సహాయపడుతుంది. మీరు మా ట్యూమర్ బోర్డ్ రిపోర్ట్స్ ను మీకు చికిత్స చేసే ఆంకాలజిస్టుల బృందంతో పంచుకోవచ్చు మరియు మీకు కావాలంటే చికిత్స ఎంపికలను చర్చించవచ్చు.
ట్యూమర్ బోర్డ్‌లోని ఆంకాలజిస్టులు క్యాన్సర్‌కు చికిత్స చేయడంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు USలోని ప్రధాన సంస్థల నుండి శిక్షణ పొందారు.
మీ క్యాన్సర్ రకం మరియు దశలో నిర్దిష్ట నైపుణ్యం ఉన్న ఆంకాలజిస్ట్‌లను మేము ఎంచుకుంటాము, తద్వారా మీరు సాధ్యమైనంత ఉత్తమమైన సలహాను పొందుతారు.
మీరు ఇకపై భారతదేశం మరియు యుఎస్‌లోని అగ్ర కాన్సర్ వైద్య నిపుణుల నుండి వైద్య సహాయం పొందడానికి ప్రయాణించాల్సిన అవసరం లేదా వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు మా ఆన్‌లైన్ కన్సల్టేషన్ సర్వీస్ (Online Consultation Service) ద్వారా నిపుణుల అభిప్రాయాన్ని పొందవచ్చు.
మీరు మీ మెడికల్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో మాతో పంచుకోవచ్చు మరియు ఆన్‌లైన్‌లోనే వ్రాతపూర్వక అభిప్రాయాన్ని పొందవచ్చు.
వివిధ చికిత్సల యొక్క ఆశించిన ఫలితాలను అర్థం చేసుకోవడానికి ట్యూమర్ బోర్డ్ మీకు సహాయం చేస్తుంది. అవసరమైన ఫాలో-అప్ విధానాలు మరియు మనుగడ రేటు (expected survival rate) స్పష్టంగా వివరించబడుతుంది.
ఇది మీ చికిత్స గురించి పూర్తి అవగాహన కల్పించి సరైన చికిత్సను ఎంపిక చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
ట్యూమర్ బోర్డ్ రిపోర్టు మీకు ప్రయోజనం కలిగించే ఆధునిక చికిత్సలు, మందులు మరియు క్లినికల్ ట్రయల్స్‌పై సమాచారాన్ని అందిస్తుంది. మా నిపుణులైన ఆంకాలజిస్ట్‌ల మార్గదర్శకత్వంలో వివిధ చికిత్సల ప్రయోజనాలు మరియు ప్రమాదాలు జాగ్రత్తగా పరిశీలించి ఉత్తమ చికిత్సను ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది.
మీ చికిత్సను ఎంపిక చేసుకోవడానికి సహాయపడే అధునాతన రోగనిర్ధారణ పరీక్షలతో కూడా మేము మీకు సహాయం చేస్తాము. మా రోగులలో కొందరు ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ పునరావృతమయ్యే ప్రమాదాన్ని గుర్తించగలిగారు, తర్వాత కీమోథెరపీ వంటి నిర్దిష్ట చికిత్సా విధానాలను నివారించగలిగారు.
పైన పేర్కొన్న కారణాలన్నీ మీ క్యాన్సర్ చికిత్స మరియు దాని ఫలితాల గురించి మీకు నమ్మకంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.
క్యాన్సర్ చికిత్సకు సాధారణంగా శస్త్రచికిత్స, మెడికల్ ఆంకాలజీ మరియు రేడియేషన్ చికిత్సతో కూడిన బహుళ చికిత్సలు అవసరమవుతాయి. Onco యొక్క ట్యూమర్ బోర్డ్ లో క్యాన్సర్ చికిత్సలలో వివిధ స్పెషలైజేషన్ల నుండి నిపుణులు పాల్గొంటారు.
ట్యూమర్ బోర్డులో భాగమైన కొన్ని వైద్య నిపుణులు ఇక్కడ ఉన్నారు:
సర్జికల్ ఆంకాలజిస్టులు (Surgical Oncologists):
గట్టి కణితులతో అనేక రకాల క్యాన్సర్లకు ప్రారంభ దశల్లో చికిత్స కోసం శస్త్రచికిత్స ఉత్తమ ఎంపిక. అందువలన, మీ నిర్దిష్ట క్యాన్సర్ రకంలో నైపుణ్యం కలిగిన సర్జికల్ ఆంకాలజిస్ట్ మీ రిపోర్టును రూపొందించే ట్యూమర్ బోర్డ్‌లో భాగం అవుతారు.
మెడికల్ ఆంకాలజిస్టులు (Medical Oncologists):
అనేక రకాల క్యాన్సర్లకు కీమోథెరపీ అనేది ఒక సాధారణ చికిత్సా విధానం. మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీ వంటి కొత్త చికిత్సా విధానాలలో ప్రత్యేకత కలిగి ఉంటారు.
రేడియేషన్ ఆంకాలజిస్ట్ (Radiation Oncologist):
చాలా మంది క్యాన్సర్ రోగులకు, రేడియేషన్ థెరపీ వారి చికిత్స ప్రణాళికలో ముఖ్యమైన భాగం. ప్రాథమిక చికిత్స పద్ధతిగా కాకపోతే, సహాయక చికిత్సగా అయినా ఉపయోగిస్తారు.
ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ థెరపీని నిర్వహించడంలో శిక్షణ పొందుతారు.
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (Surgical Gastroenterologist):
జీర్ణశయాంతర అవయవాలలో శస్త్రచికిత్సలకు అత్యంత ప్రత్యేకమైన సర్జన్లు అవసరం. కాబట్టి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కూడా క్యాన్సర్ ఉన్న ప్రదేశం ఆధారంగా అవసరమైనప్పుడు ట్యూమర్ బోర్డులో పాల్గొంటారు.
జీర్ణకోశ అవయవాలు అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం(Rectum), మలద్వారం (Anus), కాలేయం, ప్యాంక్రియాస్, మొదలైనవి.
న్యూరోసర్జన్లు (Neurosurgeons):
సెంట్రల్ మరియు పెరిఫెరల్ నాడీ వ్యవస్థ వ్యాధుల చికిత్సలో నైపుణ్యం కలిగిన వైద్యులను న్యూరో సర్జన్లు అంటారు. క్యాన్సర్ మెదడు లేదా వెన్నెముకను ప్రభావితం చేసినట్లయితే, మీ రిపోర్టును రూపొందించడానికి ఒక న్యూరో సర్జన్ ట్యూమర్ బోర్డులో పాల్గొంటారు.
న్యూక్లియర్ మెడిసిన్ వైద్యులు (Nuclear Medicine Physicians):
న్యూక్లియర్ మెడిసిన్ వైద్యులు చికిత్సలో రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించడంలో నిపుణులు. వారు రోగనిర్ధారణ కోసం ఉపయోగించే స్కాన్‌ల నుండి చిత్రాలను కూడా అర్థం చేసుకుంటారు. మోలిక్యులర్ ఇమేజింగ్ (molecular imaging) మరియు మోలిక్యులర్ థెరపీ (molecular therapy) వంటి విధానాలకు కూడా వారి నైపుణ్యం అవసరం.
ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్లకు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్యులను ట్యూమర్ బోర్డులో చేరుస్తారు.
మీ కేసు చరిత్ర మరియు వ్యాధి యొక్క ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి పైన పేర్కొన్న వైద్య నిపుణులందరూ కలిసి పని చేస్తారు. వారు మీ వ్యాధికి సంబంధించిన వివరణ, దాని కోసం సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స ప్రణాళిక, చికిత్స తర్వాత అవసరమైన ఫాలో-అప్ మరియు చికిత్స నుండి ఎలాంటి ఫలితాలను ఆశించాలనే అవగాహనతో కూడిన రిపోర్టును వారు సిద్ధం చేస్తారు.
మీరు 79965 79965కి కాల్ చేయడం ద్వారా లేదా మా వెబ్‌సైట్ ద్వారా మమ్మల్ని సంప్రదదించి Onco యొక్క ట్యూమర్ బోర్డ్ నుండి వ్రాతపూర్వక రిపోర్టును పొందవచ్చు. మా కేర్ మేనేజర్‌ల నుండి నిరంతర మద్దతుతో పాటు ఈ సేవను పొందేందుకు మీరు మా యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీరు మీ ప్రస్తుత రిపోర్టులు మరియు ఇప్పటివరకు చేయించుకున్న రోగనిర్ధారణ పరీక్షలు మరియు స్కాన్‌ల ఫలితాలను మాతో పంచుకోవాలి. వీటిని షేర్ చేసిన నాలుగు రోజులలో, మీ కోసం ఉత్తమమైన చికిత్స ప్రణాళికను వివరించే మా ట్యూమర్ బోర్డ్ రిపోర్ట్ మీకు అందుతుంది.
మీకు ఏమైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే వాటిని కూడా మీ మెడికల్ రిపోర్ట్స్ కు జత చేసి పంపించవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మీ ట్యూమర్ బోర్డ్ రిపోర్టులో పొందగలరు. రిపోర్టు అందిన తర్వాత కూడా, మీరు మా క్యాన్సర్ నిపుణుల నుండి తదుపరి 25 రోజుల పాటు ఏవైనా ప్రశ్నలను అడగవచ్చు.
మీ తదుపరి క్యాన్సర్ ప్రయాణంలో మా కేర్ మేనేజర్స్ మీకు సహాయం చేస్తారు.
Onco యొక్క ట్యూమర్ బోర్డ్ క్యాన్సర్ చికిత్స మరియు సలహా కోసం US మరియు UK మార్గదర్శకాలను (Guidelines) అనుసరిస్తుంది. ట్యూమర్ బోర్డ్ అందించిన అభిప్రాయం NCCN మరియు ASCO మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది.
కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.
ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.
तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…
నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.
క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!
शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…