తెలుగు

కీమోథెరపీకి ఎలాంటి దుస్తులు ధరించాలి?

మీ కీమోథెరపీ సెషన్లలో మీకు ఏ విధమైన బట్టలు సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడతాయని ఆశ్చర్యపోతున్నారా? మేము మీకు ఇక్కడ ఉత్తమ ఎంపికలను అందిస్తున్నాము. 

కీమోథెరపీ సాధారణంగా కొన్ని నెలల వ్యవధిలో కొన్ని సెషన్లలో జరుగుతుంది. ఔషధం మీకు ఎలా అందించబడుతుందనే (IV లేదా పోర్ట్) దానిపై ఆధారపడి, మీరు మీ దుస్తులలో కొన్ని సర్దుబాట్లు చేయాల్సి రావచ్చు. అందువల్ల, మీ కీమోథెరపీ సెషన్‌ల కోసం సరైన దుస్తులు ఉండడం మంచిది. 

ఈ సమయంలో బట్టలు కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలతో చూద్దాం:

 • సైజింగ్

కీమోథెరపీ సమయంలో చాలా మంది బరువు కోల్పోతారు లేదా పెరుగుతారు. కాబట్టి చాలా బిగుతుగా ఉండే బట్టలు కొనడం మానుకోండి. 

మీ శరీరానికి అంటుకోకుండా, మీకు మంచి అనుభూతిని కలిగించే దుస్తుల కోసం చూడండి. కాటన్ మరియు రేయాన్ దుస్తులు మీకు మరింత సుఖంగా ఉండేందుకు సహాయపడతాయి.

మీరు బరువు తగ్గినప్పటికీ, తాళ్ళతో కట్టుకునే వీలును కల్పించే దుస్తులు ఉపయోగించవచ్చు. 

 • వెచ్చని దుస్తులు

ఆసుపత్రులు చల్లగా ఉంటాయి మరియు కీమోథెరపీ వల్ల మీరు ఇంకా ఎక్కువ చలిని అనుభవించవచ్చు.  

ఉన్ని మీ చర్మంపై అంతగా సౌకర్యంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నితో చేసిన  జంపర్‌లను ఎంచుకోవడానికి బదులుగా, మీరు ఇతర దుస్తులను పరిగణించవచ్చు. 

అదనపు వెచ్చదనాన్ని అందించడానికి మీ సాధారణ దుస్తుల లోపల ధరించగలిగే టీ-షర్టులు లేదా చొక్కాల కోసం చూడండి. 

సాక్స్, ఫింగర్‌లెస్ గ్లోవ్స్ (fingerless gloves), మఫ్లర్‌లు మరియు క్యాప్‌లు మీ తల, మెడ మరియు అరచేతులు వంటి మీ శరీర భాగాలను సాధారణంగా బట్టలతో కప్పి ఉంచడానికి సహాయపడతాయి. 

మీకు ఇంకా చల్లగా అనిపిస్తే, మీ సాధారణ దుస్తులతో పాటు ధరించగలిగే లెగ్ వార్మర్‌లు (leg warmers) లేదా పోంచోలను (ponchos) ప్రయత్నించండి. 

 • కాథెటర్లకు యాక్సెస్ పాయింట్ 

IV లైన్‌లు మరియు పోర్ట్‌లు రెండూ సాధారణంగా మీ ఛాతీకి అనుసంధానించబడి ఉంటాయి. దీని అర్థం ఎత్తైన మెడతో ఏదైనా ధరించడం లేదా ఛాతీ మరియు చంకల చుట్టూ ఏదైనా అమర్చడం మంచిది కాదు. 

మీ ఛాతీ ప్రాంతాన్ని యాక్సెస్ చేయడానికి మీ టాప్ లేదా టీషర్ట్ సులభంగా క్రిందికి లాగబడేలా మెడ భాగంలో వెడల్పుగా ఉండే దుస్తుల కోసం వెళ్లండి. 

మహిళలు బ్రాలు ధరించడాన్ని నివారించవచ్చు మరియు బదులుగా వారి టాప్‌లలో బిల్ట్-ఇన్ బ్రాలను ఎంచుకోవచ్చు, తద్వారా ఈ ప్రక్రియలో బ్రా తీసివేయడం అవసరం ఉండదు. 

ఫ్రంట్ ఓపెన్ షర్టులు కూడా దీనికి బాగా ఉపయోగపడతాయి. 

ఈ సమయంలో మీరు తక్కువ ధరలో బట్టలు కొనాలని సిఫార్సు చేయబడింది. ఎందుకంటే మీరు మీ పోర్ట్ లేదా డ్రెయిన్ పైపుల కోసం కుడి లేదా ఎడుమ భాగంలో చొక్కాని చీల్చడం లేదా మీ ఛాతీ ప్రాంతంలో చొక్కాకి రంధ్రాలను చేయవల్సి ఉంటుంది. 

 • సౌకర్యం కోసం శాలువాలు లేదా దుప్పట్లు

ప్రక్రియ సమయంలో మీ ఛాతీలో కొంత భాగాన్ని బహిర్గతం చేయడం వల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తే, కీమోథెరపీ సమయంలో మిమ్మల్ని వెచ్చగా మరియు సౌకర్యవంతంగా ఉంచడానికి మీరు శాలువా లేదా దుప్పటిని ధరించవచ్చు.

 • సహాయం లేకుండా దుస్తులు ధరించడం 

మీరు ఇటీవల శస్త్రచికిత్సకు గురైనట్లయితే లేదా కీమోథెరపీ వల్ల అలసట కారణంగా, తాత్కాలికంగా మీ చేతులను పైకి ఎత్తడం కష్టంగా ఉంటుంది. 

కాబట్టి మీ వెనుక భాగంలో జిప్‌లు, బటన్‌లు లేదా హుక్స్‌లను ఫిక్సింగ్ చేయడం అంత సులభం కాకపోవచ్చు. అదేవిధంగా విశాలమైన ఓపెనింగ్ లేకుండా బట్టలు ధరించడం కూడా అసౌకర్యంగా ఉండవచ్చు. 

అలంటి సమయంలో బట్టలు కొనుగోలు చేసేటప్పుడు, మీరు సులువుగా ఆ బట్టలను వేసుకోగలరా మరియు విప్పగలరా అని చూసుకోండి. 

 • టోపీలు

టోపీలు మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి. మీకు జుట్టు రాలడం మొదలైనప్పుడు, మీ తల భాగాన్ని కప్పి ఉంచుకోవాలనుకుంటే, ఎంచుకోవడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. 

హెడ్ ​​టైస్ (Head ties), స్కార్ఫ్‌లు, బండనాస్ (bandanas), బీనీ టోపీలు మరియు ఇలాంటి అనేక రకాలు ఈ సమయంలో మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. 

మీ స్కాల్ప్‌పై మెత్తగా ఉండేదాన్ని మరియు మీరే ధరించగలిగే మరియు తీసివేయగలిగే వాటిని ఎంచుకోవాలని గుర్తుంచుకోండి. 

ఎంచుకోవడానికి వివిధ ధరలలో విగ్‌లు కూడా ఉన్నాయి. మీరు మీ ప్రాంతంలోని ఈకామర్స్ సైట్‌ల ద్వారా వీటిలో దేనినైనా ఆర్డర్ చేసుకోవచ్చు. 

 • ఎండ నుండి రక్షణ

ఈ సమయంలో మీ చర్మం మరింత సున్నితంగా ఉండవచ్చు. కాబట్టి తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మరియు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండండి. 

పెద్ద హ్యాట్, సన్ గ్లాసెస్ (sunglasses) లేదా స్కార్ఫ్‌లు కఠినమైన సూర్యకాంతి నుండి మిమ్మల్ని రక్షించగలవు. అదనంగా, సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం మరియు అవసరమైన విధంగా మీరు మళ్లీ అప్లై చేయగల సున్నితమైన మాయిశ్చరైజర్‌ని తీసుకెళ్లడం గుర్తుంచుకోండి. 

 • ఫేస్ మాస్క్‌లు

అనవసరంగా వైరస్‌లకు గురికాకుండా ఉండేందుకు ఈ సమయంలో ఫేస్ మాస్క్‌లు ధరించడం మంచిది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా, మీరు క్యాన్సర్ చికిత్స సమయంలో అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. 

ఆసుపత్రి వంటి బహిరంగ ప్రదేశంలోకి వెళ్లేటప్పుడు మీరు సర్జికల్ N95 మాస్క్‌ని ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది. ఇవి మీకు అందుబాటులో లేకపోతే, మరింత రక్షణ కోసం శ్వాస తీసుకోవడానికి సౌకర్యంగా ఉండే రెండు లేదా అంతకంటే ఎక్కువ లేయర్‌ల ఫ్యాబ్రిక్‌లతో డబుల్ మాస్కింగ్‌ను పరిగణించండి. 

బట్టలును జాగ్రత్తగా ఉంచుకోవడం

ప్రతి ఉపయోగం తర్వాత అన్ని బట్టలు ఉతకాలి. బట్టలు ఉతికేటప్పుడు కఠినమైన రసాయనాలు లేదా బలమైన వాసనలు కలిగిన డిటర్జెంట్లను ఉపయోగించడం మానుకోండి. 

ఒక డిసిన్ఫెక్టన్ట్ (disinfectant) బట్టలను శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. ఉతికిన తర్వాత ఎండలో ఎండబెట్టడం మంచిది. 

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్  వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

Team Onco

Helping patients, caregivers and their families fight cancer, any day, everyday.

Recent Posts

 • తెలుగు

మీ కోసం సరైన ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనాలి?

ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.

8 months ago
 • हिन्दी

वो 6 आदतें जो हैं कैंसर को बुलावा (habits that increase cancer risk)

तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…

8 months ago
 • తెలుగు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు సరైన ఆహారాలు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.

8 months ago
 • తెలుగు

మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే 6 రోజువారీ అలవాట్లు

క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!

8 months ago
 • हिन्दी

घर में इन गलतियों से आप दे रहें कैंसर को न्योता!

शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…

8 months ago
 • English

When Should You Start Getting Cancer Screenings? A Guide for Men and Women

Don't wait until it's too late. Stay on top of your health with these essential cancer screenings for both men…

8 months ago