తెలుగు

పాలియేటివ్ కీమోథెరపీ అంటే ఏమిటి – ఎందుకు అవసరం?

వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలు ఉన్నాయి. కొన్ని క్యూరేటివ్ (Curative) అయితే కొన్ని పాలియేటివ్ (Palliative). క్యూరేటివ్ క్యాన్సర్ చికిత్సలు క్యాన్సర్‌ను నయం చేయడంలో సహాయపడతాయి, అయితే పాలియేటివ్ క్యాన్సర్ చికిత్సలు రోగికి నొప్పి లేదా ఇతర క్యాన్సర్ లక్షణాల (cancer symptoms) నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. పాలియేటివ్ కేర్ క్యాన్సర్‌ను నయం చేయదు కానీ క్యాన్సర్ రోగి యొక్క జీవన నాణ్యతను (quality of life) మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అలాగే, క్యాన్సర్‌ను నయం చేయడానికి కీమోథెరపీని ఇస్తే, దానిని క్యూరేటివ్ కీమోథెరపీ (Curative Chemotherapy) అంటారు. క్యాన్సర్ లక్షణాల నుండి రోగికి ఉపశమనం కలిగించడానికి మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కీమోథెరపీని ఇచ్చినట్లయితే, దానిని పాలియేటివ్ కీమోథెరపీ (Palliative Chemotherapy) అంటారు. కొంతమంది రోగులలో, పాలియేటివ్ కెమోథెరపీతో రోగి యొక్క జీవితకాలం పొడిగించడం సాధ్యమవుతుంది.

సాధారణంగా, కీమోథెరపీని రెండు పరిస్థితుల్లో సిఫార్సు చేస్తారు;

  • క్యాన్సర్‌కు చికిత్స మరియు పునరావృతం కాకుండా నియంత్రించుటకు

వేగంగా అభివృద్ధి చెందడం క్యాన్సర్ కణాల లక్షణం. ఇటువంటి  కణాలను నాశనం చేయడం ద్వారా కీమోథెరపీ క్యాన్సర్‌కు చికిత్స చేస్తుంది. ఇక్కడ, కీమోథెరపీ యొక్క లక్ష్యం క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం మరియు క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడం. అటువంటి సందర్భాలలో ఇచ్చే కీమోథెరపీని క్యూరేటివ్ కీమోథెరపీ అంటారు.

కీమోథెరపీ ద్వారా సమర్థవంతంగా చికిత్స చేయబడి మరియు నయం చేయబడ్డ కొన్ని క్యాన్సర్‌లు: లింఫోమాస్, లుకేమియా మరియు టెస్టిక్యులర్ క్యాన్సర్‌.

  • కణితులను తగ్గించడానికి మరియు వాటిని సమర్థవంతంగా చికిత్స చేయడానికి

మెటాస్టాటిక్ క్యాన్సర్ల (metastatic cancers) విషయంలో (క్యాన్సర్ శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపించినప్పుడు), కీమోథెరపీ నయం చేయడంలో సహాయపడదు కానీ కణితులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అటువంటి సందర్భాలలో, ఇచ్చే కీమోథెరపీని పాలియేటివ్ కీమోథెరపీ అంటారు.

“సులభంగా చెప్పాలంటే, రోగులకు నొప్పి లేదా ఇతర క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనం కలిగించడానికి, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు వారి ఆయుర్దాయం పొడిగించడానికి పాలియేటివ్ కీమోథెరపీ సహాయపడుతుంది.”

క్యాన్సర్ రోగికి పాలియేటివ్ కీమోథెరపీ ఎప్పుడు ఇస్తారు?

నయం చేయలేని క్యాన్సర్‌ల (క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించినప్పుడు మరియు రోగి క్యూరేటివ్ కీమోథెరపీకి ప్రతిస్పందించనప్పుడు) కోసం పాలియేటివ్ కీమోథెరపీని ఎంపిక చేసుకుంటారు. ఈ సందర్భంలో, కణితులను తగ్గించడానికి లేదా క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనాన్ని కల్పించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది క్యూరేటివ్  కీమోథెరపీతో పాటు లేదా క్యాన్సర్ సమయంలో ఎప్పుడైనా ఇవ్వబడుతుంది.

పాలియేటివ్ కీమోథెరపీని నోటి ద్వారా లేదా ఇంట్రావీనస్ (సిరలోకి) ద్వారా ఇవ్వవచ్చు.

ఇనాటివరకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (pancreatic cancer), నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ (non-small cell lung cancer) మరియు రొమ్ము క్యాన్సర్లలో (breast cancer) పాలియేటివ్ కీమోథెరపీ విజయవంతంగా దాని ప్రయోజనాలను చూపింది.

పాలియేటివ్ కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు:

దుష్ప్రభావాల రకం మరియు తీవ్రత రోగి నుండి రోగికి ఉపయోగించే కీమోథెరపీ ఔషధాల రకాన్ని బట్టి మరియు చికిత్స చేయబడుతున్న కణితి రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే, సంభవించే సాధారణ లక్షణాలు;

  • అలసట
  • జుట్టు రాలడం 
  • బరువు తగ్గడం
  • ఆకలి లేకపోవడం
  • రక్త కణాల సంఖ్య తగ్గడం 
  • విరేచనాలు లేదా మలబద్ధకం
  • నోటి పుండ్లు
  • వికారం లేదా వాంతులు

కీమోథెరపీ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి

మీ చికిత్స యొక్క నిర్దిష్ట దుష్ప్రభావాల గురించి మరియు వాటిని ఎలా నియంత్రించవచ్చు అనే దాని గురించి మీరు చికిత్స చేస్తున్న వైద్యుడిని అడగాలని మేము సూచిస్తున్నాము.

పాలియేటివ్ కీమోథెరపీ ఎంతకాలం ఉంటుంది?

వ్యవధి క్యాన్సర్ రకం మరియు దశ, దాని లక్షణాలు మరియు రోగి యొక్క సాధారణ ఆరోగ్యంతో సహా బహుళ కారకాలపై ఆధారపడి ఉంటుంది. చాలావరకు, ఇది 3-12 నెలల మధ్య ఉంటుంది మరియు ఆయుర్దాయం రోగి ఈ చికిత్సకు ఎంత బాగా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

భారతదేశంలో పాలియేటివ్ కీమోథెరపీ ఖర్చు:

ప్రాంతం, వైద్యుని నైపుణ్యం మరియు మీరు ఎంచుకున్న వైద్య సదుపాయాల రకాన్ని బట్టి ఖర్చు ఆసుపత్రి నుండి ఆసుపత్రికి మారవచ్చు.

పాలియేటివ్ కీమోథెరపీని ఎంచుకునే ముందు లాభాలు మరియు నష్టాలను అంచనా వేయండి

పాలియేటివ్ కీమోథెరపీని తీసుకోవాలని నిర్ణయించుకునే ముందు, రోగి వయస్సు మరియు సాధారణ ఆరోగ్యం, క్యాన్సర్ దశ, మరియు ఆశించిన చికిత్స ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనితో పాటు, చికిత్స నుండి మీరు ఎటువంటి ప్రయోజనాలు పొందగలరు మరియు అప్రయోజనాల గురించి మీ వైద్యుడిని అడగి తెలుసుకోండి.

ప్రయోజనాలు:

ముందు చెప్పినట్లుగా, ఇది క్యాన్సర్ లక్షణాల నుండి మీకు ఉపశమనం కలిగించి మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ కణితి పాలియేటివ్ కీమోథెరపీకి అనుకూలంగా స్పందిస్తే, మీరు మీ ఆయుష్షులో పెరుగుదలను కూడా ఆశించవచ్చు.

అప్రయోజనాలు:

అన్ని ఇతర క్యాన్సర్ చికిత్సల మాదిరిగానే, పాలియేటివ్ కీమోథెరపీ కూడా కొన్ని హానిచేయని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కానీ మీ డాక్టర్ వాటిని ఎదుర్కోవటానికి మందులను సూచించవచ్చు. అరుదైన సందర్భాల్లో, కొంతమంది రోగులు చికిత్స నుండి ఆశించిన దాని కంటే తక్కువ ప్రయోజనం పొందవచ్చు.

పాలియేటివ్ కీమోథెరపీ యొక్క లాభాలు మరియు నష్టాలు వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. క్యాన్సర్ రోగులందరికీ పాలియేటివ్ కీమోథెరపీ పనిచేస్తుందనడానికి తగిన ఆధారాలు లేవు. ప్రధానంగా, ఆంకాలజిస్టులు ఘన కణితులతో మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎంపిక చేసిన రోగులకు ఈ చికిత్సను సూచిస్తారు.

పాలియేటివ్ కీమోథెరపీ గురించి మీరు మీ వైద్యుడిని అడగవలసిన ప్రశ్నలు

మీ కేసు గురించి మీకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి మీ వైద్యునితో చర్చించండి. ఇది మీకు సరైన ఎంపిక అని తెలుసుకున్న తర్వాత  నిర్ణయం తీసుకోండి. మీరు మీ వైద్యుడిని అడగవలసిన కొన్ని ప్రశ్నల జాబితా:

  • పాలియేటివ్ కీమోథెరపీ నాకు ఎందుకు సరైన ఎంపిక?
  • ఇది నా జీవిత కాలాన్ని పొడిగించగలదా?
  • ఇది క్యాన్సర్ లక్షణాల నుండి నాకు ఉపశమనం కలిగిస్తుందా?
  • నేను ఎదుర్కొనే నిర్దిష్ట దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?
  • ఈ చికిత్స యొక్క దుష్ప్రభావాలు నియంత్రించగలవా?
  • ఇది జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందా?
  • ఈ చికిత్సకు నా క్యాన్సర్ ప్రతిస్పందించే సంభావ్యత ఏమిటి?
  • చికిత్స ఎంతకాలం కొనసాగుతుంది?
  • ఈ చికిత్స సమయంలో నేను నా సాధారణ జీవనశైలిని కొనసాగించవచ్చా?
  • నా క్యాన్సర్ స్పందించకపోతే ఏమి చేయాలి? ఏవైనా ప్రత్యామ్నాయ ఎంపికలు ఉన్నాయా?

కీమోథెరప్యూటిక్ పాలియేషన్ యొక్క అధ్యయనాలు

ఏ ఒక్క కీమోథెరపీ నియమావళి ప్రామాణిక చికిత్సగా (standard treatment) చూపబడలేదు. క్లినికల్ ట్రయల్స్‌లో వివిధ క్యాన్సర్లపై నిర్వహించిన అధ్యయనాలు కీమోథెరప్యూటిక్ పాలియేషన్ తర్వాత విభిన్న ఫలితాలను చూపించాయి.

పాలియేటివ్ కీమోథెరపీని ఉపయోగించడంలో సహాయపడే సాక్ష్యం క్లినికల్ ట్రయల్స్‌ ద్వారా శాస్త్రీయంగా అంచనా వేయబడింది. పాలియేటివ్ కీమోథెరపీ వల్ల జీవన నాణ్యత మెరుగుపడుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. అయినప్పటికీ, మనుగడ మరియు ఆయుర్దాయం వలె కాకుండా, జీవన నాణ్యత వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అందువలన విశ్లేషణ చేయడం కష్టం.

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

Team Onco

Helping patients, caregivers and their families fight cancer, any day, everyday.

Recent Posts

  • తెలుగు

కీమోథెరపీకి ఎలాంటి దుస్తులు ధరించాలి?

కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.

2 years ago
  • తెలుగు

మీ కోసం సరైన ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనాలి?

ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.

2 years ago
  • हिन्दी

वो 6 आदतें जो हैं कैंसर को बुलावा (habits that increase cancer risk)

तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…

2 years ago
  • తెలుగు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు సరైన ఆహారాలు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.

2 years ago
  • తెలుగు

మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే 6 రోజువారీ అలవాట్లు

క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!

2 years ago
  • हिन्दी

घर में इन गलतियों से आप दे रहें कैंसर को न्योता!

शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…

2 years ago