తెలుగు

నా క్యాన్సర్ కోసం సరైన చికిత్సను కనుగొనడంలో Onco నాకు ఎలా సహాయపడింది?

ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో కొన్ని చీకటి క్షణాలు ఉంటాయి. ఆ సమయంలో మనం భవిష్యత్తులో వేటిని అనుభవిస్తామో స్పష్టత ఉండదు. ఆ క్షణాలలో మనం సురక్షితంగా ఉన్నామా లేమా అని కూడా తెలుసుకోలేము.

అటువంటి సమయంలో ఏమి కీడు జరగబోతుందో అని ఆలోచించడం వలన ఇటువంటి చీకటి క్షణాలు ఉన్నదానికంటే ఎక్కువ భయాందోళనలు కలిగిస్తాయి. దానికి కారణం మనం ఉన్న పరిస్థితి గురించి పూర్తిగా తెలియకపోవడం లేదా అర్థం చేసుకోకపోవడం.

ప్రతి మనిషికి ఒక చీకటి క్షణం: వారు క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అవ్వడం. ఆ క్షణంలో మీరు తీసుకోవాల్సిన చికిత్సలు ఏమిటి అనే వాటిపై తక్కువ అవగాహన ఉండటం, మీ వైద్యులు మీ కోసం నిర్దిష్ట చికిత్సను ఎందుకు ఎంచుకున్నారు, మరియు ఆ చికిత్స ప్రణాళిక సరైనదా కాదా  అనే విషయాలపై చాలా మంది రోగులకు లేదా వారి సంరక్షకులకు తగినంత సమాచారం లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. 

చాలా మంది రోగులకు మరియు వారి సంరక్షకులకు సరైన చికిత్స మార్గంలో ఉన్నామా లేదా ఇంకేమైనా ఉత్తమ చికిత్సలు ఉన్నాయా అని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా చికిత్స నుండి ఆశించిన ఫలితాలు పొందనప్పుడు మరియు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు. 

ఒక సాధారణ మనిషికి, వారి కాన్సర్ కు సరైన చికిత్సా విధానాలు మరియు మందులు గురించి తగినంత సమాచారం తెలియకపోవచ్చు. ఇటువంటి కష్ట సమయాలలో Onco నాకు అవసరమైన సహాయం అందించింది. 

సరైన చికిత్సను కనుగొనడం

క్యాన్సర్‌ను విజయవంతంగా నయం చేయడానికి సరైన సమయంలో సరైన చికిత్స ముఖ్యమైనదని తెలిసాక మీరు ఏమి చేస్తారు?

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రేష్మా ఎన్* అనే మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు (cervical cancer) చికిత్స ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నిజ జీవిత కథ ఇది.

మొదటిగా ఆమె మెడికల్ ఆంకాలజిస్ట్‌ను సంప్రదించింది, ఆమె వైదుడు ఆమెకు ప్రథమ చికిత్సగా కీమోథెరపీని ఎంపిక చేసారు.

అదృష్టవశాత్తూ, ఆమె రెండవ అభిప్రాయం (second opinion) కోసం Onco యొక్క ఆంకాలజిస్టుల బృందాన్ని కూడా సంప్రదించింది. ఆమె కేసుకు సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత, రేష్మాకు కీమోథెరపీ సరైనది కాదని, రేడియేషన్ థెరపీని ప్రథమ చికిత్సగా అందించాలని Onco ఆంకాలజిస్టుల బృందం నిర్ధారించింది.

అంతేకాకుండా, Onco ఆంకాలజిస్టుల బృందం కాన్ఫరెన్స్ కాల్‌లో(conference call) ఆమెకు చికిత్స చేస్తున్న ఆంకాలజిస్ట్‌ను సంప్రదించి, కీమోథెరపీ కాకుండా రేడియేషన్ థెరపీని మొదట ఎందుకు ప్రారంభించాలని భావించారో వివరించారు. సంభాషణ తర్వాత, రేష్మాకు చికిత్స చేస్తున్న మెడికల్ ఆంకాలజిస్ట్ Onco ప్యానెల్ యొక్క నిర్ణయం సరైనదని అంగీకరించారు మరియు వెంటనే చికిత్స ప్రణాళికను మార్చారు.

రేష్మా ముందుగా చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే ఇప్పుడు రేడియేషన్ థెరపీ చేయించుకుంటోంది. ఆమెకు Onco ద్వారా ఆమె కేర్ మేనేజర్ నుండి నిరంతర సహాయం మరియు సరైన ఆహార ప్రణాళిక కూడా అందించబడింది.

Onco నిపుణుల ప్యానెల్ సహాయం లేకుండా, ఆమె చికిత్స సరైనదేనా లేదా ఏమైన ఇతర మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తనకు వేరే మార్గం లేదని రేష్మా భావించింది.

“జ్ఞానమే శక్తి” అని అందరూ అంటారు, మరి క్యాన్సర్ చికిత్స విషయానికి వస్తే, కోలుకునే అవకాశాలను అంచనా వేయడానికి మరియు మీ చికిత్స పురోగతిని పర్యవేక్షించడానికి అన్ని చికిత్సా పద్ధతుల (మెడికల్, శస్త్రచికిత్స, మరియు రేడియేషన్) నుండి ఆంకాలజిస్టుల నిపుణుల బృందం కంటే ఎవరు ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉంటారు?

సరైన ఆంకాలజిస్ట్‌ని కనుగొనడం

బీహార్‌కు చెందిన మనోహర్ డి* తనకు ఉత్తమమైన ఆంకాలజిస్ట్‌ని కనుగొనడానికి Oncoకు ఫోన్ చేశారు. అతను అప్పటికే ఓరోఫారింజియల్ క్యాన్సర్‌తో (Oropharyngeal cancer) బాధపడుతున్నారు. అతని నివాసానికి సమీపంలో అతని క్యాన్సర్ రకానికి సంబంధించిన ఉత్తమమైన వైద్యులను కనుగొనమని మమ్మల్ని సంప్రదించారు. 

మనోహర్ తన నగరంలోని ప్రసిద్ధ ట్రస్ట్ ఫండ్ ఆసుపత్రి నుండి రెండవ అభిప్రాయం పొందాలని అడిగారు. అతనికి ఈ ట్రస్ట్ ఫండ్ ఆసుపత్రిలో చికిత్స పొందితే కొంచెం ఆర్ధిక భారం తగ్గుతుంది.

అయినప్పటికీ, అతనికి మేము సూచించిన ఆసుపత్రిలో సంరక్షణ మరియు నైపుణ్యంపై నమ్మకం ఉన్నందున అతను మేము సూచించిన ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు. అతనికి  ముందుగానే చికిత్సా విధానాలు మరియు వాటి ఉపయోగాలను వివరించినందున అతను మా సూచనలపై నమ్మకం పొందారు. మా యొక్క ఈ సేవ అతనికి తన క్యాన్సర్ పై మరింత స్పష్టతను ఇచ్చింది మరియు ఆందోళనను తగ్గించింది.

చాలా మంది క్యాన్సర్ రోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, చికిత్స చేసే ఆంకాలజిస్ట్ మార్గదర్శకంగా ఉంటారు. వైద్యులు వారు అందించే చికిత్సపై రోగులకు విశ్వాసం కల్పించడం వారికి ఎంతగానో సహాయం చేస్తుంది మరియు త్వరగా కోలుకునేలా చేస్తుంది. రోగి కూడా తన ఆంకాలజిస్ట్‌పై విశ్వాసం మరియు నమ్మకాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఈ కష్టమైన దశలో కుటుంబానికి మార్గనిర్దేశం చేయగల సరైన ఆంకాలజిస్ట్‌ను కనుగొనడం చాలా కీలకం. మనకు సమీపంలో వున్న ఆంకాలజిస్ట్ ని పొందడం కూడా ముఖ్యమే, ప్రధానంగా ప్రయాణ సమయంలో ఇన్ఫెక్షన్ల  భయం లేకుండా ఉండేందుకు. 

భారతదేశం మరియు US అంతటా 1500+ ఆంకాలజిస్ట్‌ల నెట్‌వర్క్‌ కలిగివున్నOnco ద్వారా, ప్రతి రోగి వారి చికిత్స కోసం సరైన వైద్యుడిని కనుగొనవచ్చు మరియు అతనికి అందుబాటులో ఉన్న ఉత్తమ చికిత్స విధానాలను కూడా కనుగొనవచ్చు. 

అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని కనుగొనడం

ఈ COVID-19 మహమ్మారి సమయంలో ఒక శనివారం రాత్రి 8:30 గంటలకు గుర్గావ్‌కు (Gurgaon) చెందిన బాలాజీ* కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. బాలాజీ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. అదే రోజున బాలాజీకి చెప్పలేనంత నొప్పి రావడం మొదలయింది. 

బాలాజీ సరిగ్గా నొప్పి ఎక్కడ ఉందో లేదా దానికి కారణం ఏమిటో వివరించలేకపోయారు. అతనికి నొప్పి భరించలేనంతగా ఉందని, తక్షణ వైద్యం అవసరమని వారు అప్పుడే తెలుసుకున్నారు.

చాలా మంది ఆంకాలజిస్టులు ఆ సమయంలో ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించడంతో, వారు సరైన చికిత్స పొందేందుకు చాలా కష్టపడ్డారు.

అప్పుడే వారు Oncoను సంప్రదించారు, వెంటనే తమకు దగ్గరగా ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి చేరుకునేలా సహాయం పొందారు. ఆసుపత్రిలోని నిపుణులు బాలాజీకి కావాల్సిన వైద్యాన్ని వెంటనే అందించగలిగింది మరియు అక్కడికక్కడే తప్పనిసరి COVID-19 పరీక్షను కూడా చేసింది.

బాలాజీకి అవసరమైన వైద్య సహాయం పొందడానికి అరగంట పట్టింది. అతనికి మరియు అతని సంరక్షకులకు, ఈ సమయానుకూల సహాయం అమూల్యమైనది, ఎందుకంటే ఆ సమయంలో ఏమి చేయాలో వారికి నిజంగా ఎటువంటి అవగాహనా లేదు.

సరైన ఆంకాలజిస్ట్‌తో కనెక్ట్ చేయడం, సరైన చికిత్సను పొందుతున్నారా లేదా అని నిర్ధారించడం, మరియు మరెన్నో సేవలు Oncoతో కనెక్ట్ కావడం ద్వారా క్యాన్సర్ రోగులు మరియు వారి కుటుంబాలు  ప్రయోజనం పొందారు. అదనంగా, పోషకాహార నిపుణుడి నుండి సరైన ఆహార ప్రణాళికలు పొందడం వలన వారి జీవన నాణ్యతను మరింత మెరుగుపరుచుకోగలిగారు.

* పేషెంట్ల గుర్తింపును వెల్లడించకుండా పేర్లు మాత్రమే మార్చబడ్డాయి

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965 కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

Team Onco

Helping patients, caregivers and their families fight cancer, any day, everyday.

Recent Posts

  • తెలుగు

కీమోథెరపీకి ఎలాంటి దుస్తులు ధరించాలి?

కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.

2 years ago
  • తెలుగు

మీ కోసం సరైన ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనాలి?

ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.

2 years ago
  • हिन्दी

वो 6 आदतें जो हैं कैंसर को बुलावा (habits that increase cancer risk)

तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…

2 years ago
  • తెలుగు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు సరైన ఆహారాలు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.

2 years ago
  • తెలుగు

మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే 6 రోజువారీ అలవాట్లు

క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!

2 years ago
  • हिन्दी

घर में इन गलतियों से आप दे रहें कैंसर को न्योता!

शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…

2 years ago