భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఇది మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు అంచనా.
రెగ్యులర్ స్క్రీనింగ్ మరియు టీకా కార్యక్రమాలు అమలు చేయని ప్రాంతాల్లో గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా కనిపిస్తుంది.
HPV వ్యాక్సిన్ 9 నుండి 26 సంవత్సరాల వయస్సు వారికి సిఫార్సు చేస్తారు.
HPV వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, వల్వార్(vulvar) క్యాన్సర్, యోని క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్, మల ద్వార(anal) క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు, ఒరోఫారింజియల్ క్యాన్సర్‌లు, HPV వల్ల కలిగే తల మరియు మెడ క్యాన్సర్‌లు మరియు భాగస్వాములకు HPV ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధిస్తుంది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవకాశాలను పెంచే ప్రమాద కారకాలు క్రింది విధంగా ఉన్నాయి:
3. కెమికల్స్, హార్మోన్లు మరియు ఇతర క్యాన్సర్ కారకాలు కూడా గర్భాశయ క్యాన్సర్‌కు ప్రమాద కారకాలుగా గుర్తించబడ్డాయి.
4. ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
5. రోగులలో HPV ఇన్ఫెక్షన్ మరియు మునుపటి HIV ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
HPV వ్యాక్సిన్ పొందడానికి సరైన సమయం ఏది?
HPV వ్యాక్సిన్ లైంగిక చర్యలకు ముందు లేదా HPVతో ప్రభావితమవ్వక ముందు తీసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది. మీకు ఇప్పటికే HPV సోకినట్లయితే, ఈ టీకా దానిని నయం చేయడానికి మీకు ఉపయోగపడదు కానీ ఇతర HPV జాతుల ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతుంది.
HPV వ్యాక్సిన్ పొందడానికి ఉత్తమ వయస్సు 11 లేదా 12 సంవత్సరాలు, అయితే టీకాలు వేయడం 9 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది మరియు 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఇది 26 సంవత్సరాల తర్వాత సూచించబడదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే, ప్రజలు 40 సంవత్సరాల వరకు వైద్యుల అనుమతితో తీసుకోవచ్చు.
HPV వ్యాక్సిన్ (గార్డసిల్ 9); 9 నుండి 26 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలకు మరియు బాలికలకు ఇవ్వవచ్చని నిరూపించబడింది. అబ్బాయిలకు టీకాలు వేయడం వల్ల వైరస్ వ్యాప్తి నుండి బాలికలను రక్షించడంలో సహాయపడుతుంది. HPV వ్యాక్సిన్ (గార్డసిల్ 9) USAలో అబ్బాయిలు మరియు పురుషులకు సిఫార్సు చేయబడింది, అయితే ఇది భారతదేశంలో ఇంకా సిఫారసు చేయబడలేదు.
మీరు HPV వ్యాక్సిన్‌ని పొందాలనుకుంటే గైనకాలజిస్ట్(Gynecologist)ని సంప్రదించమని మేము మీకు సూచిస్తున్నాము.
HPV వ్యాక్సిన్‌ను ఎవరు తీసుకోకూడదు?
HPV టీకా ఈ క్రింది వాటి కోసం సిఫార్సు చేయబడలేదు;
HPV టీకాలు సురక్షితమేనా?
HPV టీకాలు క్లినికల్ ట్రయల్స్‌లో మరియు వాస్తవ-ప్రపంచ వినియోగంలో సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి. గార్డసిల్ 2006లో ఆమోదించబడింది మరియు గార్డసిల్ 9, 2014లో USFDAచే మగ మరియు ఆడ ఇద్దరిలో ఉపయోగకరమైనదని ఆమోదించబడింది. అయినప్పటికీ, టీకా తీసుకున్న తర్వాత జ్వరం, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో దురద, చేయి నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం మొదలైన కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కొనబడినవి.
సర్వైకల్ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కింది లక్షణాలలో ఏవైనా నిరంతరంగా ఉంటే గర్భాశయ క్యాన్సర్ కోసం పరీక్షించుకోవాలి:
భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎలా పొందాలి?
ప్రపంచవ్యాప్తంగా లైసెన్స్ పొందిన రెండు గర్భాశయ క్యాన్సర్ టీకాలు (HPV Vaccines) ప్రస్తుతం భారతదేశంలోని ఈ రెండు కంపెనీల ద్వారా అందుబాటులో ఉన్నాయి;
ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా వేస్తారు. ప్రజలు కోరినప్పుడు లేదా డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే ఇది ఇవ్వబడుతుంది.
సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ (HPV Vaccine) ఎంత ఖర్చు అవుతుంది?
0.5ml గార్డసిల్ (Gardasil) వ్యాక్సిన్ ఒక్క డోస్ కు దాదాపు Rs. 10,000 ఖర్చవుతుంది
0.5ml సర్వారిక్స్ (Cervarix) వ్యాక్సిన్ ఒక్క డోస్ కు దాదాపు Rs. 4500 ఖర్చవుతుంది
కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.
ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.
तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…
నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.
క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!
शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…