మీ యొక్క క్యాన్సర్, చికిత్స ఎంపికలు, ఆశించే చికిత్స ఫలితాలు, మరెన్నో విషయాల గురించి అవగాహన కోసం ఆంకాలజిస్ట్‌తో సంప్రదింపులు (Oncologist Consultation) చాలా కీలకం. ఈ కథనంలో, మీరు ఆంకాలజిస్ట్ ని సంప్రదించడానికి ముందుగా ఎలా సిద్ధం అవ్వాలో మేము మీకు తెలియజేస్తాము. ఇలా చేయడం వల్ల మీరు ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ నుండి ఎక్కువ ప్రయోజనాలు పొందగలరు.
మీరు ఆంకాలజిస్ట్ (cancer doctor) ని సంప్రదించిన తరువాత, మీ యొక్క ప్రస్తుత పరిస్థితి, మీరు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు, మరియు భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలను ఆశించాలనే దాని గురించి పూర్తి స్పష్టత పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
కన్సల్టేషన్ (Consultation) నుండి మీరు ఏమి ఆశించవచ్చు?
మీ మొదటి కన్సల్టేషన్ లో మీరు ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్యుడు) నుండి ఆశించదగ్గ కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
- క్యాన్సర్ వైద్యుడు మిమ్మల్ని పూర్తిగా పరిశీలిస్తారు, ముఖ్యంగా శరీరంలోని క్యాన్సర్-బాధిత భాగలలో, ఆర్మ్ పిట్స్ (చంకలు), మెడ, లేదా జననేంద్రియ అవయవాల వంటి ప్రధాన కీళ్ల ప్రాంతాల్లో ఏదైనా వాపు ఉందా అని చూడవచ్చు.
- ఆంకాలజిస్ట్ మిమ్మల్ని క్యాన్సర్ లక్షణాలు, ధూమపానం లేదా మద్యపానం అలవాట్లు, కుటుంబ చరిత్ర (Family history), వైద్య చరిత్ర (Medical history), గతంలో తీసుకున్న చికిత్సలు మొదలైన వాటితో సహా వ్యక్తిగత చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
- మీరు ఇటీవల చేయించుకున్న స్కాన్‌లు (Recent scans), రక్త పరీక్షలు, లేదా ఏవైనా రోగనిర్ధారణ పరీక్షల యొక్క రిపోర్ట్స్ ను పరిశీలిస్తారు.
- తరువాత ఆంకాలజిస్ట్ మీ పరిస్థితిని వివరిస్తారు మరియు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను సూచిస్తారు. అంతేకాకుండా, మీకు సరియైన చికిత్సను ఎంచుకోవడానికి మరియు మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని రోగనిర్ధారణ పరీక్షలను(diagnostic tests) ఆదేశించవచ్చు.
- మీరు తీసుకోవాల్సిన తదుపరి చర్యలను స్పష్టంగా తెలియజేస్తారు. ఒకవేళ ఆంకాలజిస్ట్‌కు చికిత్సను ప్లాన్ చేయడానికి ముందు మీ పరిస్థితిపై మరింత సమాచారం అవసరమైతే, మరిన్ని స్కాన్‌లు మరియు రోగనిర్ధారణ పరీక్షలను ఆదేశిస్తారు.
- చికిత్స ఎలా ఉంటుంది, అది ఎక్కడ జరుగుతుంది, దానిలో ఏ దశలు ఉన్నాయి మరియు సుమారుగా మీకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను కూడా వివరిస్తారు.
- ఆంకాలజిస్ట్ మీరు ఇతర శారీరక లేదా భావోద్వేగ లక్షణాలతో బాధపడుతున్నారా లేదా అని పరిశీలిస్తారు. ఒకవేళ మీరు చాలా ఒత్తిడి మరియు ఆందోళనలో ఉన్నట్లయితే ఆంకాలజిస్ట్ మిమ్మల్ని మానసిక సలహాదారుని సంప్రదించమని సూచించవచ్చు.
- ఆంకాలజిస్ట్ మీరు వెంటనే చికిత్స ప్రారంభించగల కొన్ని మందులను కూడా సూచించవచ్చు. ఇవి సాధారణంగా నొప్పి నుండి లేదా క్యాన్సర్ సంబంధిత లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతాయి.
కన్సల్టేషన్ కోసం నేను ఏమి తీసుకొని వెళ్ళాలి?
మిమ్మల్ని మీరు ముందుగా సిద్ధం చేసుకోవడం ఉత్తమం మరియు క్రింద చెప్పబడినవన్నీ మీ కన్సల్టేషన్ కోసం చాలా ముఖ్యం. అవన్నీ మర్చిపోకుండా మీతో పాటు తీసుకెళ్లండి:
- ఆంకాలజిస్ట్‌తో ఇది మీ మొదటి కన్సల్టేషన్ అయితే, స్కాన్‌లు, బయాప్సీ రిపోర్ట్స్ (Biopsy reports), ఎండోస్కోపీలు (ఒకవేళ ఉంటే) లేదా రక్త పరీక్షల యొక్క ఇటీవలి రిపోర్ట్స్ అన్నింటిని మీ వెంట తీసుకెళ్లండి.
- ఈ కన్సల్టేషన్ కు ముందు మీరు చికిత్స పొందినట్లయితే, మీరు సంప్రదించిన ఇతర ఆంకాలజిస్ట్‌ల నుండి మునుపటి అన్ని ప్రిస్క్రిప్షన్‌లు (మందుల చీటీలు) మరియు సూచనలను కలిపి ఒక రికార్డ్ పెట్టుకోండి. తద్వారా, కన్సల్టింగ్ ఆంకాలజిస్ట్ మీకు ఇప్పటికే ఏ చికిత్సలు అందించబడ్డాయో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
- గత 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో చేసిన స్కాన్‌లు మరియు రోగనిర్థారణ పరీక్షల యొక్క అన్ని రిపోర్ట్స్ ను తీసుకెళ్లండి. వాటిని ఇటీవలి నుండి పాత వరకు క్రమంలో అమర్చండి.
- మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అన్ని లక్షణాలు మరియు ఆరోగ్య సమస్యల యొక్క జాబితాను తయారు చేసుకొని పెట్టుకోండి, తద్వారా దేనినీ మర్చిపోకుండా మీ ఆంకాలజిస్ట్ తో స్పష్టంగా చర్చించవచ్చు.
- అలాగే, మీరు ఆంకాలజిస్ట్‌ని అడగాలనుకుంటున్న ప్రశ్నల జాబితాను సిద్ధం చేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న చికిత్సా ఎంపికలు, వాటి విజయావకాశాలు, ఊహించిన దుష్ప్రభావాలు, మరియు భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఎదురయ్యే ప్రమాదాలు గురించి ప్రశ్నలు అడగవచ్చు.
- మీ చికిత్స తర్వాత మీ జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి, చికిత్స ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలి మరియు మీకు వైద్య బృందం నుండి ఎప్పుడు సహాయం అవసరం అనే దాని గురించి కూడా మీరు అడగవచ్చు.
- మీ కేర్ గివర్ ని (Caregiver) మీతో పాటు తీసుకెళ్లండి, తద్వారా డాక్టర్ మీకు ఏమి సలహా ఇస్తున్నారో అతను/ఆమె స్పష్టంగా తెలుసుకుంటారు.
- ఆంకాలజిస్ట్ నుండి ఏదైనా నిర్దిష్ట సూచనలను మర్చిపోకుండా రాసుకోవడం మంచిది. ఒకవేళ మీకు ఆ సూచనలపై సందేహాలు ఉంటే, తదుపరి ఫాలో-అప్ (Follow-up) ద్వారా స్పష్టం చేసుకోవచ్చు.
- మీరు నగదు-రహిత (Cashless) చికిత్సలకు అర్హులైతే మీ భీమా వివరాలను (Insurance details) ఖచ్చితంగా తీసుకెళ్ళండి.
కన్సల్టేషన్ కు ఎంత సమయం పడుతుంది?
మొదటి కన్సల్టేషన్ కు ఒక గంట సమయం పట్టవచ్చు, తదుపరి కన్సల్టేషన్స్ కు 10-15 నిమిషాలు మాత్రమే పట్టవచ్చు. చివరి కన్సల్టేషన్స్ మీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
మీరు Onco ద్వారా ప్రాధాన్యత బుకింగ్‌లను (Priority Appointments) పొందవచ్చు, ఇది ఆసుపత్రిలో మీ నిరీక్షణ సమయాన్ని(Waiting time) తగ్గిస్తుంది.
మీరు మీ మెడికల్ రిపోర్ట్స్ (Medical reports) మరియు ఇతర వివరాలను ఇమెయిల్ లేదా వాట్సాప్ (Email or WhatsApp) ద్వారా ముందుగానే ఆంకాలజిస్ట్‌తో షేర్ చేయండి, తద్వారా ఆంకాలజిస్ట్ అపాయింట్‌మెంట్‌కు ముందుగానే వాటిని విశ్లేషించి మీ పరిస్థితి పై అవగాహన పొందడానికి సహాయపడుతుంది మరియు కన్సల్టేషన్ సమయాన్ని పూర్తిగా వినియోగించవచ్చు.
నేను ఆంకాలజిస్ట్‌ను ఏటువంటి ప్రశ్నలు అడగాలి?
మీరు కన్సల్టేషన్ కు వెళ్లే ముందు ఆంకాలజిస్ట్ ని ఏమేమి ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారో ఒక జాబితాను తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు మీ అన్ని సందేహాలకు సమాధానాలను పొందవచ్చు.
మీ పరిస్థితి ఆధారంగా మీ జాబితాలో చేర్చదగ్గ కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి.
సాధారణ సమాచారం (General Information):
- నేను ఏ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నాను?
- నా క్యాన్సర్ దశ ఏమిటి? ఏ అవయవాలు (Organs) క్యాన్సర్ బారిన పడ్డాయి?
- ఏదైనా వైద్య ప్రక్రియపై రెండవ అభిప్రాయాన్ని(Second opinion) పొందడం ఎల్లప్పుడూ మంచిది. నేను రెండవ అభిప్రాయాన్ని పొందవచ్చా?
- నాకు సూచించిన ముందస్తు మందులను నేను కొనసాగించవచ్చా? ఇది రక్తపోటు (High blood pressure), మధుమేహం (Diabetes) మొదలైన ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులు కావచ్చు.
- నేను ఈ చికిత్స తరువాత సురక్షితంగా నా పనులను కొనసాగించవచ్చా? ప్రతి చికిత్సా విధానం ఎంత సమయం పడుతుంది?
- నేను ప్రయాణం చేయడం, డ్రైవింగ్ లేదా వంట చేయడం వంటి నా రోజువారీ పనులను కొనసాగించవచ్చా?
- ఏదైనా ఆకస్మిక లేదా భరించలేని దుష్ప్రభావాలు లేదా లక్షణాలు ఎదుర్కొంటున్న సమయంలో నేను మిమ్మల్ని ఎలా సంప్రదించాలి?
- నాకు ఏదైనా క్లినికల్ ట్రయల్స్(Clinical trials) అందుబాటులో ఉన్నాయా? నా కోసం క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని నేను ఎక్కడ కనుగొనగలను?
చికిత్సకు సంబంధించిన ప్రశ్నలు:
- నేను చేయించుకోవాల్సిన వివిధ చికిత్సలు ఏమిటి?
- ప్రతి చికిత్స ఎంతకాలం ఉంటుంది?
- నా చికిత్స యొక్క లక్ష్యం ఏమిటి?
- ప్రతి చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలు (Side effects) ఏమిటి?
- చికిత్సలు మరియు మందులు ఎంత ఖర్చవుతాయి?
- ప్రతి చికిత్స యొక్క ఫలితం ఏమిటి? నా చికిత్స ముగిసే సమయానికి నేను ఏమి ఆశించగలను?
- చికిత్స తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఇది జరిగితే నేను ఏ చికిత్సలు చేయించుకోవాలి?
- ఈ చికిత్స నా సంతానోత్పత్తిని (Fertility) ప్రభావితం చేస్తుందా? ఇది జరగకుండా నేను చికిత్స ప్రారంభించే ముందు ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా?
- ఏదైనా ఒక నిర్దిష్ట లక్షణం లేదా దుష్ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే. దానిని నివారించడానికి ఏవైనా మందులు ఉన్నాయా అని అడగండి. మీరు నిద్రపోవడం, తినడం లేదా ప్రశాంతంగా ఉండటంలో ఇబ్బందిగా ఉంటే, ఈ విషయాన్ని ప్రస్తావించి, మీ ఆంకాలజిస్ట్ నుంచి సలహా పొందండి.
జీవనశైలి మార్పులు:
- చికిత్స సమయంలో పాటించాల్సిన ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా?
- చికిత్స యొక్క ప్రతి దశలో నాకు ఏ రకమైన ఆహారాలు మంచివి?
- ధూమపానం లేదా మద్యపానం నా చికిత్సను ఏ విధంగానైనా ప్రభావితం చేస్తుందా?
- నేను వ్యాయామం (Exercise) చేయాలా, ఎంత సమయం చేయాలి, ఎలాంటివి చేయాలి?
- నేను ఏ రకమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి?
- ఈ సమయంలో ఇన్ఫెక్షన్‌ల (Infections) బారిన పడకుండా నేను ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
మీ కన్సల్టేషన్ తర్వాత కూడా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే లేదా ఏమైనా ప్రశ్నలు అడగడం మర్చిపోయి ఉంటే, మీ కేర్ మేనేజర్‌ని (Care Manager) సంప్రదించండి. కేర్ మేనేజర్ మీకు సమాధానాలు తెలియజేయడంలో సహాయం చేయగలరు.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి
మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.