Onco క్యాన్సర్ సెంటర్‌లోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీల్ కౌశిక్ కోమండూరి, రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్స (Breast Conservation Surgery) నేడు రొమ్ము క్యాన్సర్ రోగులకు ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు.
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స (Surgery) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన శస్త్రచికిత్సలో చంకలోని అంతర్లీన కండరాలు మరియు నోడల్ కణజాలంతో (Nodal tissues) పాటు పూర్తి రొమ్ము కణజాలాన్ని తొలగించడం జరిగింది.
ఈ రకమైన శస్త్రచికిత్స శారీరక మరియు మానసిక గాయాన్ని కలిగిస్తుంది మరియు రోగి తన శరీరాన్ని చూసే విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితి కొంతమంది మహిళల్లో నిరాశ, ఆందోళన, మరియు ఒత్తిడి వంటి మానసిక ప్రతిచర్యలకు కూడా కారణమవుతుంది.
రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) చికిత్సపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు మరియు శస్త్రచికిత్సా పద్ధతులలో పురోగతులు, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మంది మహిళలకు రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్సను ఒక ఎంపికగా మార్చింది. ప్రస్తుతం, మాస్టెక్టమీ (Mastectomy) – మొత్తం రొమ్మును తొలగించే ఒక శస్త్రచికిత్సా విధానము– కణితి మొత్తం రొమ్ము కణజాలంపై ప్రభావం చూపిన కొంతమంది రోగులకు మాత్రమే చేయబడుతుంది.
రొమ్ము-సంరక్షణ శస్త్రచికిత్స (Breast Conservation Surgery) విధానంలో క్యాన్సర్ తో ప్రభావితం అయిన రొమ్ము భాగాన్ని మాత్రామే శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. మిగిలిన ఆరోగ్యకరమైన రొమ్ము భాగాన్ని వీలైనంత వరకు అలాగే వదిలేస్తారు. సాధారణంగా, రొమ్ము చుట్టుపక్కల కొంత ఆరోగ్యకరమైన కణజాలం మరియు శోషరస కణుపులు (Lymph nodes) కూడా అవసరమైతే తొలగించబడతాయి.
చాలా మంది రోగులలో రొమ్మును సంరక్షించడం సాధ్యమవుతుంది. ప్రారంభ దశలలో, కణితి యొక్క పరిమాణం చిన్నగా ఉంటుంది మరియు శస్త్రచికిత్స చేసి సులభంగా తొలగించవచ్చు. ఆ తొలగించబడిన భాగాన్ని పునర్నిర్మించడానికి (reconstruct) ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులను ఉపయోగించి లేదా ఉపయోగించకుండానే రొమ్మును సంరక్షించవచ్చు.
కొన్నిసార్లు ఆంకాలజిస్టులు (Oncologists) కణితులు పెద్దగా ఉంటే, వాటి పరిమాణాన్ని తగ్గించడానికి మొదట్లో కీమోథెరపీని సూచించవచ్చు. కొంతమంది మహిళలకు, రొమ్ము క్యాన్సర్ రకం, కణితి పరిమాణం, రేడియేషన్‌తో మునుపటి చికిత్స, BRCA మ్యుటేషన్స్ లేదా కొన్ని ఇతర కారణాల వల్ల మాస్టెక్టమీ సరైన సూచించదగిన చికిత్సా విధానం.
యువతులలో రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటో తెలుసా? ఇక్కడ చదవండి
చుట్టూ ఉన్న కొంత ఆరోగ్యకరమైన రొమ్ము కణజాలంతో పాటు కణితిని తొలగించడం ద్వారా ఏర్పడే లోపాలు రొమ్ము ఆకారాన్ని మార్చగలవు. క్యాన్సర్ సర్జరీలో ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులను ఉపయోగించడాన్ని ‘ఆంకోప్లాస్టిక్ సర్జరీ’ (Oncoplastic Surgery) అంటారు. ఇది లోపాన్ని పూరించడానికి మరియు రొమ్ము యొక్క సాధారణ ఆకృతిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్‌లో మిగిలిన రొమ్ము కణజాలాన్ని లోపం ఉన్న ప్రదేశంలో పెట్టడం లేదా ఆ లోపాన్ని పెర్ఫొరేటర్ ఫ్లాప్స్ (perforator flaps), మయోక్యుటేనియస్ ఫ్లాప్స్ (myocutaneous flaps) మరియు ఆటోలోగస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ (autologous fat grafting) వంటి వివిధ ఎంపికలతో భర్తీ చేయడం వంటివి ఉంటాయి.
క్యాన్సర్ మళ్లీ వస్తుందనే భయంతో చాలామంది మహిళలు రొమ్ము సంరక్షణ కంటే మాస్టెక్టమీకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ప్రారంభ దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మంది మహిళలకు రొమ్ము-సంరక్షణ శస్త్రచికిత్స (BCS) సురక్షితంగా నిర్వహించబడింది.
వివిధ రకాల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ద్వారా ఈ శస్త్రచికిత్స సురక్షితమని నిరూపించబడింది. ప్రారంభ దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌కు రొమ్ము-సంరక్షణ శస్త్రచికిత్స చేసిన తర్వాత రొమ్ముకు రేడియేషన్ థెరపీ ఇవ్వడం ప్రస్తుతం ప్రమాణికమైన చికిత్స విధానముగా పరిగణించబడింది.
రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స దీర్ఘకాలిక నష్టం లేదా వైకల్యానికి కారణం కాదు. రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్స గురించి మీ క్యాన్సర్ వైద్యునితో చర్చించి, కలిసి నిర్ణయం తీసుకోండి.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి
మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.
కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.
ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.
तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…
నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.
క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!
शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…