మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని నిర్ధారణ అయినట్లయితే, మీరు కూడా ప్రమాదంలో ఉన్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో క్యాన్సర్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ సర్వసాధారణంగా మారుతోంది, మరియు మన జీవనశైలి మరియు రోజువారీ అలవాట్లు ఇందులో పాత్ర పోషిస్తాయా అని మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
క్యాన్సర్ జీవనశైలికి సంభందించిన వ్యాధి. క్యాన్సర్‌కు జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి, అయితే ఇవి 5 – 10% క్యాన్సర్‌లకు మాత్రమే కారణమవుతున్నాయి. అంటే క్యాన్సర్‌ను పూర్తిగా నిరోధించలేకపోయినా, మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే ఆరు అలవాట్లను ఇక్కడ చూద్దాం.
పొగాకు క్యాన్సర్‌కు అతిపెద్ద కారణం. ఇది నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
గుట్కా, జర్దా, పాన్ మసాలా మొదలైన వాటి రూపంలో పొగాకును నమలడం తల మరియు మెడ క్యాన్సర్‌లకు ప్రధాన కారణం. ధూమపానం, వేపింగ్, హుక్కా మొదలైనవి పొగాకు వినియోగానికి సంభందించిన హానికరమైన రూపాలు.
సరళంగా చెప్పాలంటే, పొగాకు వినియోగంలో సురక్షితమైన స్థాయి అనేది లేదు. కానీ శుభవార్త ఏమిటంటే: మీరు ధూమపానం మానేసిన తర్వాత, కొన్ని సంవత్సరాలలో మీ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ధూమపానం మానేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ధూమపానాన్ని విజయవంతంగా మానేయడంలో మీకు సహాయపడే అనేక సపోర్టు గ్రూపులు, డి-అడిక్షన్ కౌన్సెలర్లు, మరియు వైద్య నిపుణులు ఉన్నారు.
ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో చిప్స్ నుండి బ్రెడ్ వరకు ఈ రోజు మన మార్కెట్లో సులభంగా లభించే అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. మీకు చేరే ముందు దాని సహజ రూపం మార్చబడిన ఏదైనా ఆహారాన్ని ప్రాసెస్ చేయబడిన ఆహారం అంటారు. దీనర్థం, వాటిని సంరక్షించడానికి లేదా దాని స్వభావాన్ని మార్చడానికి ఇప్పటికే వండిన, గడ్డ కట్టిన, క్యాన్‌లో ఉంచబడిన, ప్రిసర్వేటివ్స్ (preservatives) వాడిన, ప్యాక్ చేసిన ఆహారాలను ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటారు.
మీ ఫ్రిజ్ మరియు ఆహారాన్ని ఉంచే చోట్లలో ఆ పదార్థాలలో ఎన్ని ప్రాసెస్ చేయబడ్డాయో చూడండి. మనము తినే వాటిలో దాదాపు 30% ప్రాసెస్ చేయబడుతుందని మీకు అర్ధమవుతుంది.
ఈ అలవాటును మార్చుకోవడానికి సంకల్పం మరియు ప్రేరణ అవసరం, అయితే దీన్ని ఆచరించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, మీ దినచర్యలో తాజా ఆహారాలను చేర్చడానికి ఆహ్లాదకరమైన మరియు రుచికరమైన ఆహార మార్గాలను ఎంచుకోవాలి.
కొన్ని మార్గాలు:
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ని (పండ్లు మరియు కూరగాయలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు మసాలా దినుసులు కలిగిన ఆహార ప్రణాళిక) అనుసరించడాన్ని మీరు పరిగణించవచ్చు.
మీరు ఎక్కువ సమయం కూర్చొని ఉంటే, మీకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయం క్యాన్సర్ ముప్పుతో ముడిపడి ఉంటుంది.
వారానికి నాలుగు నుండి ఐదు సార్లు 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక అనేది సులభమైన ఏరోబిక్ వ్యాయామం. వ్యాయామం చేసేటప్పుడు మీరు ఎక్కువగా నీటిని తీసుకునేలా చూసుకోండి.
కూల్ డ్రింక్స్ మరియు ప్రాసెస్ చేసిన జ్యూస్‌లలో చక్కెర చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అధిక చక్కెర కంటెంట్ ఉన్న పానీయాలు తాగడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్‌కు మరో ప్రమాద కారకం అయిన ఊబకాయంతో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.
చక్కెర పానీయాలు ప్రత్యేకంగా యువ మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది.
ఆల్కహాల్ నోటి, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు, పురీషనాళం, మరియు రొమ్ము వంటి అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని క్యాన్సర్లకు అధిక మొత్తంలో మద్యం తీసుకోవడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఇతర రకాల క్యాన్సర్‌లకు (రొమ్ము క్యాన్సర్ వంటివి), తక్కువ మొత్తంలో మద్యం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.
మటన్ మరియు పంది మాంసం వంటి రెడ్ మీట్ (red meat) తీసుకోవడం వల్ల మీ ప్రేగు మరియు కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మీరు రెడ్ మీట్‌ని క్రమం తప్పకుండా తినే అలవాటు ఉన్నట్లయితే, చేపలు మరియు పౌల్ట్రీ వంటి లీన్ మీట్‌లను (lean meats) ప్రత్యామ్నాయంగా తీసుకోండి. గుడ్లు, బీన్స్ మరియు కాయధాన్యాలు ప్రోటీన్ యొక్క ఇతర మంచి వనరులు.
హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి
మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.
కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.
ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.
तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…
నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.
शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…
Don't wait until it's too late. Stay on top of your health with these essential cancer screenings for both men…