Cancer Care Now At Your Fingertips
హైదరాబాద్‌లో టార్గెటెడ్ థెరపీ
Onco క్యాన్సర్ సెంటర్స్ ఉత్తమ ఫలితాలను కలిగించే టార్గెటెడ్ థెరపీను అందిస్తున్నాయి. ఇప్పుడే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.
హైదరాబాద్‌లో టార్గెటెడ్ థెరపీ వైద్యులు
Related Videos
ప్రశ్నలు-సమాధానాలు
● క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు మనుగడకు బాధ్యత వహించే నిర్దిష్ట జన్యువులు మరియు ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకోవడం.
● రక్తనాళ కణాలను లక్ష్యంగా చేసుకుని రక్త ప్రవాహాన్నికణితులచేరకుండా ఆపడం ద్వారా కణితులను నాశనం చేయడం.
రొమ్ము, ఊపిరితిత్తులు, తల, మెడ, అండాశయాలు, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు మరియు కొన్ని దీర్ఘకాలిక లుకేమియాలకు చికిత్స చేయడానికి టార్గెటెడ్ థెరపీని ఉపయోగిస్తారు.
టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ రెండు రకాలు: మోనోక్లోనల్ యాంటీబాడీస్ (monoclonal antibodies) మరియు స్మాల్ మాలిక్యూల్ మెడిసిన్స్ (small molecule medicines). వివిధ రకాలైన ఔషధాలను వివిధ క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
ఇది క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి ఇది సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. అయితే టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్‌ను ఇతర మందులతో కలిపి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలకు కారణమవుతున్నందున కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీ చికిత్స బృందం మీకు ఉపయోగిస్తున్న నిర్దిష్ట ఔషధాల యొక్క ఏవైనా దుష్ప్రభావాల గురించి మీకు సలహా ఇవ్వగలదు.
క్యాన్సర్ ఇతర చికిత్సలకు ప్రతిస్పందించకపోతే, లేదా ఇతర కణజాలాలకు వ్యాప్తి చెందిన, లేదా ఇతర చికిత్సల ద్వారా చికిత్స చేయబడనప్పుడు టార్గెటెడ్ థెరపీని ఎంపిక చేసుకోవచ్చు. జీన్ మ్యుటేషన్స్ ఉన్నాయా అని తనిఖీ చేయడానికి టార్గెటెడ్ థెరపీని ఇవ్వడానికి ముందు ట్యూమర్ పరీక్షించబడుతుంది. జీన్ మ్యుటేషన్స్ లేనట్లయితే, టార్గెటెడ్ థెరపీ సిఫార్సు చేయబడదు ఎందుకంటే టార్గెట్ చేయడానికి ఏ జన్యువు లేదా ప్రోటీన్ ఉండదు.
టార్గెటెడ్ థెరపీ యొక్క వ్యవధి మీ క్యాన్సర్ రకం మరియు దశ, అవసరమైన సెషన్ల సంఖ్య, లేదా మీకు అవసరమైన కాంబినేషన్ చికిత్సలపై ఆధారపడి ఉంటుంది.
స్వల్పకాలిక దుష్ప్రభావాలలో వికారం, వాంతులు, విరేచనాలు, అలెర్జీలు, అలసట, మరియు చర్మంపై దద్దుర్లు ఉండవచ్చు. ఇది క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి, దీర్ఘకాలిక ప్రభావాలు చాలా అరుదు. వీటిలో కాలేయ సమస్యలు, చర్మ సమస్యలు, రక్తం గడ్డకట్టడం మరియు గాయం నయంకావడంలో ఇబ్బందులు, మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉండవచ్చు.
టార్గెటెడ్ థెరపీ:
● క్యాన్సర్ కణాలు మరియు క్యాన్సర్ కణితుల్లోని ప్రోటీన్లను మార్చడం ద్వారా క్యాన్సర్కు చికిత్స చేస్తుంది .
● కొత్త రక్త నాళాలు ఏర్పడకుండా నిరోధించడం ద్వారా కణితులకు రక్త ప్రసరణను తగ్గించి కాన్సర్ కణాలను నాశనం చేయడం.
● క్యాన్సర్ కణాలను చంపడానికి రోగనిరోధక వ్యవస్థను అప్రపత్తం చేయడం.
● క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఔషధాలను పంపిణీ చేయడం, ఆరోగ్యకరమైన కణాలను క్షేమంగా వదిలివేయడం.
టార్గెటెడ్ థెరపీ ప్రత్యేకంగా క్యాన్సర్ కణాలలో మార్పు చెందిన జన్యువులు లేదా ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని క్యాన్సర్ కణాలను లోపల నుండి నాశనం చేయడం ద్వారా పనిచేస్తుంది.
ఇతర క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే టార్గెటెడ్ థెరపీ యొక్క సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, సుమారు 80% . అదనంగా, నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల మనుగడ రేటు టార్గెటెడ్ థెరపీ తర్వాత 3 నుండి 6 సంవత్సరాలకు పెరిగింది.
టార్గెటెడ్ థెరపీని మాలిక్యూల్ థెరపీ (Molecule therapy) అని కూడా పిలుస్తారు, ఇది ఒక క్యాన్సర్ చికిత్స, ఇది జన్యువులు (జీన్స్) మరియు ప్రోటీన్ల వంటి క్యాన్సర్ కణాల పదార్థాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ప్రోటీన్లు మరియు జన్యువులు క్యాన్సర్ కణాల వేగవంతమైన పెరుగుదలకు కారణమవుతాయి.
టార్గెటెడ్ థెరపీ క్యాన్సర్ కణాల పెరుగుదలకు సహాయపడే కణజాల ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మరియు క్యాన్సర్ కణాల మనుగడకు సహాయపడే రక్తనాళాల నిర్మాణాన్ని నిరోధిస్తుంది.
టార్గెటెడ్ థెరపీలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి
1. స్మాల్ మాలిక్యూల్ మెడిసిన్ (Small molecule medicine): స్మాల్ మాలిక్యూల్ మెడిసిన్స్ చిన్నవి కాబట్టి అవి క్యాన్సర్ కణాలలోకి ప్రవేశించి వాటిని నాశనం చేయగలవు.
2. మోనోక్లోనల్ యాంటీబాడీస్(Monoclonal antibodies): మోనోక్లోనల్ యాంటీబాడీస్ క్యాన్సర్ కణాలలోకి ప్రవేశించడానికి చాలా పెద్దవి కానీ అవి నేరుగా క్యాన్సర్ కణాలపై పని చేసి వాటిని నాశనం చేస్తాయి.
రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, క్రానిక్ మైలోయిడ్ లుకేమియా, లింఫోమా, మెలనోమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలకు టార్గెటెడ్ థెరపీ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. టార్గెటెడ్ థెరపీ యొక్క ఫలితం క్యాన్సర్ రకాన్ని బట్టి మారుతుంది. క్యాన్సర్ చికిత్స కోసం టార్గెటెడ్ డ్రగ్ థెరపీని నిర్వహించే వైద్యుడు మెడికల్ ఆంకాలజిస్ట్. టార్గెటెడ్ థెరపీని స్వయంగా లేదా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లేదా సర్జరీతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రోటీన్లను ఎలా తయారు చేయాలో కణాలకు మార్గనిర్దేశం చేసే జన్యువులతో రూపొందించబడిన కణాలను శరీరం కలిగి ఉంటుంది. ఈ ప్రొటీన్లు కణాలను ఆరోగ్యవంతం చేస్తాయి. ఆరోగ్యకరమైన కణాలలో జన్యువులు అసాధారణంగా మారినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ మార్పునే జీన్ మ్యుటేషన్ (gene mutation) అంటారు. జీన్ మ్యుటేషన్ అనేది ప్రోటీన్లలో మార్పులకు కారణమవుతుంది, ఇది కణాల వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది. ఈ కణాలు అప్పుడు కణితిని ఏర్పరుస్తాయి. టార్గెటెడ్ థెరపీ అసాధారణంగా పనిచేసే జన్యువులు లేదా ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని క్యాన్సర్ కణాలను నాశనం చేయడం ద్వారా పనిచేస్తుంది.
ముందుగా క్యాన్సర్‌కు కారణమైన జన్యుమార్పిడిని గుర్తించి, తదనుగుణంగా చికిత్స అందిస్తారు. మీకు ఉత్తమమైన చికిత్సను కనుగొనడానికి, జీన్ మ్యుటేషన్, ప్రోటీన్ మార్పులు మరియు ఇతర కారకాల గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యులు కొన్ని పరీక్షలను సూచించవచ్చు. చివరగా, ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా, వైద్యులు మీ కోసం సమర్థవంతమైన చికిత్స ప్రణాళికను కనుగొనడంలో మీకు సహాయం చేస్తారు.
టార్గెటెడ్ థెరపీ కూడా దుష్ప్రభావాలకు కారణమవుతుంది, కాబట్టి సరైన చికిత్స ఎంపికను ఎంచుకోవడం చాలా ముఖ్యం. టార్గెటెడ్ థెరపీ యొక్క మోతాదు మీ శరీర బరువు మరియు దుష్ప్రభావాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కొంటే మీ ఆరోగ్య సంరక్షణ బృందానికి తెలియజేయండి.
● క్యాన్సర్ కణాలలోని ప్రొటీన్లను మార్చడం ద్వారా వాటిని నాశనం చేస్తుంది.
● కొత్త రక్తనాళాల నిర్మాణాన్ని పరిమితం చేయడం ద్వారా కణితులకు రక్త సరఫరాను నిరోధిస్తుంది.
● క్యాన్సర్ కణాలను చంపడానికి రోగనిరోధక వ్యవస్థకు అప్రమత్తం చేస్తుంది.
● ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగించకుండా క్యాన్సర్ కణాలను మాత్రమే నాశనం చేస్తుంది.
● క్యాన్సర్ కణాలు పెరగడానికి కారణమయ్యే సంకేతాలను అడ్డుకుంటుంది.
● విరేచనాలు
● హెపటైటిస్ (Hepatitis) వంటి కాలేయ సమస్యలు
● చర్మం, జుట్టు మరియు గోళ్లలో మార్పులు
● మొటిమలు మరియు దద్దుర్లు
● సూర్యరశ్మికి విపరీతమైన సున్నితత్వం
● పొడి బారిన చర్మం
● వాపు, మరియు బాధాకరమైన పుళ్ళు
● కనురెప్పలు ఉబ్బి ఎర్రగా మారవచ్చు
ఇది క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి, తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు. హెపటైటిస్ వంటి కాలేయ సమస్యలు మరియు కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలు పెరగడం, పొడి చర్మం, దద్దుర్లు, మొటిమలు వంటి చర్మ సమస్యలు, డిపిగ్మెంటేషన్, రక్తం గడ్డకట్టడం మరియు గాయం నయంకావడంలో ఇబ్బందులు, మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు.
మీరు మందులతో ఈ దుష్ప్రభావాలను నివారించవచ్చు. చర్మం మరియు జుట్టు దెబ్బతినకుండా నిరోధించడానికి సున్నితమైన సబ్బులు మరియు షాంపూలను ఉపయోగించండి. చికిత్స తర్వాత దుష్ప్రభావాలు తగ్గకపోతే లేదా ఇంకా ఎక్కువగా అయినట్లయితే, మీ వైద్యుడిని సంప్రదించండి, వారు సరైన మందులను సూచిస్తారు.
క్యాన్సర్ రకం మరియు దశ, వాడబడే ఔషధాల రకాలు మరియు మీరు పొందుతున్న ఇతర వైద్య సేవలు వంటి అనేక అంశాలపై ఖర్చు ఆధారపడి ఉంటుంది.
మీ ప్రదేశంలో ఖర్చు గురించి మరింత తెలుసుకోవడానికి మీరు 79965 79965 నెంబర్ వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు.