0 +
క్యాన్సర్ వైద్యులు
0 +
సెంటర్లు
0 +
సేవలు అందుకున్న రోగులు

Rated 5/5 Reviews

MRI స్కాన్ అంటే ఏమిటి?

మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), శరీరం లోపలి భాగాలకు సంబంధించిన వివరణాత్మక మరియు స్పష్టమైన చిత్రాలను అందించే ఇమేజింగ్ స్కాన్. MRI స్కాన్ వివిధ వ్యాధులను నిర్ధారించడానికి మరియు చికిత్సల సామర్థ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు అంచనా వేయడానికి వైద్యులకు సహాయపడుతుంది. X- ray లకు బదులుగా, MRI చిత్రాలను పొందడానికి రేడియో తరంగాలను మరియు కంప్యూటర్‌తో పాటు పెద్ద అయస్కాంతాన్ని ఉపయోగిస్తుంది. రొమ్ములు, ఎముకలు మరియు కీళ్ళు, మెదడు మరియు వెన్నుముక, గుండె, రక్త నాళాలు, కాలేయం, గర్భాశయం, ప్రోస్టేట్ మొదలైన వాటితో సహా శరీరంలోని ఏ భాగాన్నైనా స్కాన్ చేయవచ్చు.

హైదరాబాద్‌లో MRI స్కాన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?

హైదరాబాద్‌లో MRI స్కాన్ ఖర్చు

MRI స్కాన్ ఖర్చు ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, వైద్యుల నైపుణ్యం, స్కాన్ చేయవలసిన శరీర భాగం మొదలైన వాటిపై ఆధారపడి మారవచ్చు. అయితే, హైదరాబాద్‌లో MRI స్కాన్ సగటు ధర దాదాపు రూ.2500 నుండి రూ.18,000 వరకు ఉంటుంది.

భారతదేశంలో మరియు హైదరాబాద్‌లో MRI స్కాన్ ధరలు

భారతదేశంలో (INR) ఒక సెషన్‌కు హైదరాబాద్‌లో (INR) ఒక సెషన్‌కు
ప్రారంభ ధర
1500
2500
సగటు ధర
10000
8000
గరిష్ట ధర
25000
18000

 (Note:గమనిక: ప్రదర్శించబడిన ధర విలువలు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. మీ చికిత్స కోసం తుది ఖర్చు డాక్టర్ తో సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది. కానీ ముఖ్యంగా మీ కేసు కోసం, మీరు సుమారుగా ధరను తెలుసుకోవాలనుకుంటే, 8008575405 నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరియు మేము మీకు అంచనాను అందిస్తాము.

ఖర్చు అంచనాను పొందండి

కీమోథెరపీ కోసం Onco క్యాన్సర్ సెంటర్లను ఎందుకు ఎంచుకోవాలి?

అందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సేవలను అందించడం కోసం Onco క్యాన్సర్ సెంటర్లు గుర్తింపు పొందాయి. క్యాన్సర్ చికిత్సల ఖర్చు రోగులకు మరియు వారి సంరక్షకులకు భారంగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. ఈ ఆర్థిక క్షోభను తగ్గించడానికి, మేము “Onco Care Plus” సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించాము, దీని ద్వారా మీరు క్యాన్సర్ చికిత్సలపై రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు. మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ యొక్క మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

అదనంగా, మీరు ఇవి పొందవచ్చు

ప్రపంచంలోని మొట్టమొదటి క్యాన్సర్ కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోండి

ఖర్చు అంచనాను పొందడానికి కేర్ మేనేజర్‌లతో మాట్లాడండి

MRI స్కాన్ విధానం

MRI స్కాన్ అనేది సురక్షితమైన మరియు నొప్పిలేని ప్రక్రియ. మీకు క్లాస్ట్రోఫోబియా (claustrophobia; ఇరుకైన, చీకటైన ప్రదేశాల వల్ల కలిగే భయం) ఉంటే, మీరు కొద్దిగా అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. కానీ ఈ భయాన్ని నివారించడానికి మీ డాక్టర్ మీకు సహాయం చేస్తారు. అయితే, మీరు పేస్‌మేకర్‌లు లేదా కృత్రిమ కీళ్ల వంటి ఏదైనా మెటల్ ఇంప్లాంట్లు కలిగి ఉంటే, MRI స్కాన్ మీకు సిఫార్సు చేయబడదు.

MRI స్కాన్ ముందు:

• అలెర్జీలు, ఇటీవలి అనారోగ్యాలు, మరియు విటమిన్లు మరియు హెర్బల్ సప్లిమెంట్లతో సహా మీరు తీసుకుంటున్న మందుల గురించి మీ వైద్యుడికి చెప్పండి.
• మీరు పేస్‌మేకర్‌లు మొదలైన ఏవైనా అమర్చిన పరికరాలను కలిగి ఉంటే మీ వైద్యుడికి తెలియజేయండి. ఈ వస్తువులు అయస్కాంత ఆకర్షణ కారణంగా MRI ప్రక్రియలో ఇబ్బంది కలిగించవచ్చు.
• మీ MRI స్కాన్ ఏ రకం అనేదాని ఆధారంగా మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీకు సూచనలను అందజేస్తుంది.
• అయస్కాంతం ద్వారా ఆకర్షించబడే గడియారాలు, కట్టుడు పళ్ళు మొదలైన ఏవైనా ఉపకరణాలు ధరించవద్దు లేదా ఏదైనా మెటల్ వస్తువులను ఉపయోగించవద్దు.
• మీ వైద్యుడు మీకు సలహా ఇస్తే తప్ప మీరు ఎప్పటిలాగే తినవచ్చు, త్రాగవచ్చు లేదా మందులు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో, స్కాన్ చేయడానికి ముందు సుమారు 4 గంటల పాటు మీరు తినకూడదని లేదా త్రాగవద్దని సూచిస్తారు మరియు కొన్ని సందర్భాల్లో, మీరు పెద్ద మొత్తంలో నీరు త్రాగవలసి ఉంటుంది.
• మీ MRI స్కాన్ కోసం ఎలా సిద్ధం కావాలో మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

MRI స్కాన్ సమయంలో:

• స్కాన్ చేయవలసిన శరీర భాగాన్ని బట్టి మీరు ఒక సమానంగా ఉండే బెడ్‌పై పడుకోమని సూచిస్తారు. ఈ మంచం స్కానర్‌ లోపలికి వెళుతుంది.
• మీరు స్కాన్ ప్రక్రియ అంతటా స్థిరంగా ఉండాలి.
• ఇమేజింగ్ స్కాన్‌లను చేయడంలో నైపుణ్యం కలిగిన ఒక రేడియోగ్రాఫర్, ఈ MRI స్కానర్‌ను మరొక గదిలో ఉండి, కంప్యూటర్‌ను ఉపయోగించి నిర్వహిస్తారు.
• మీ డాక్టర్ మిమ్మల్ని చూడగలరు మరియు మీరు అతనితో మైక్రోఫోన్ ద్వారా మాట్లాడగలరు.
• స్కానర్ స్కాన్ చేస్తున్నప్పుడు నిర్దిష్ట సమయాల్లో పెద్ద ట్యాపింగ్ శబ్దాలు చేస్తుంది.
• మీ డాక్టర్ మిమ్మల్ని కొన్ని సెకన్ల పాటు మీ శ్వాసను బిగబట్టుకోమని అడగవచ్చు లేదా కొన్ని సూచనలను అనుసరించమని మిమ్మల్ని అడగవచ్చు.
• స్కాన్ చేయబడుతున్న ప్రాంతం యొక్క పరిమాణం మరియు అవసరమైన స్కాన్‌ల సంఖ్య ఆధారంగా స్కానింగ్ ప్రక్రియ 15 నుండి 90 నిమిషాల వరకు పడుతుంది.

MRI స్కాన్ తర్వాత:

• 7 నుండి 10 రోజులలో మీరు మీ MRI స్కాన్ ఫలితాలను పొందవచ్చు.
• స్కాన్‌లను అర్థం చేసుకోవడంలో మరియు వివరించడంలో నైపుణ్యం కలిగిన రేడియాలజిస్ట్ (radiologist) లేదా ఇతర వైద్యుడు మీకు చికిత్స చేసే వైద్యుడికి రిపోర్టులను పంపుతారు.
• మీరు అదే రోజు ఆసుపత్రి నుండి బయలుదేరవచ్చు.
• మీ డాక్టర్ మీకు చెబితే తప్ప మీరు యధావిధిగా మీ సాధారణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు.
• MRI స్కాన్ తర్వాత ఎలా జాగ్రత్త వహించాలో మీకు ప్రత్యేక సూచనలు ఇవ్వబడతాయి.

హైదరాబాద్‌లోని అగ్ర క్యాన్సర్ వైద్యులు

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రతి స్త్రీకి మామోగ్రామ్‌తో విభిన్న అనుభవాలు ఉన్నాయి. కొంతమంది స్త్రీలు నొప్పి మరియు తేలికపాటి అసౌకర్యాన్ని అనుభవిస్తారు మరియు కొంతమందికి ఏమీ అనిపించకపోవచ్చు. మామోగ్రామ్ సమయంలో, పరీక్ష పరికరం నుండి రొమ్ములపై ఒత్తిడి నొప్పికి కారణం అవుతుంది. మామోగ్రఫీ సమయంలో ఈ ఒత్తిడి 5 నిమిషాల పాటు ఉంటుంది మరియు క్రమంగా తగ్గుతుంది. ఎంత నొప్పి కలుగుతుంది అనేది మామోగ్రామ్ పరికరాల రకం, మీ రొమ్ముల పరిమాణం మరియు మీ రుతుచక్రానికి సంబంధించి మీరు ఏ సమయంలో పరీక్షను తీసుకుంటున్నారనే దాని బట్టి మారుతుంది.

పూర్తి శరీర MRI స్కాన్‌ని మొత్తం శరీర MRI అంటారు. క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు వ్యాపించినప్పుడు, ఎంతవరకు వ్యాపించిందో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. MRI మరియు CT స్కాన్ అనేది క్యాన్సర్‌ని తనిఖీ చేయడానికి మొత్తం శరీరానికి చేసే ఇమేజింగ్ పద్ధతులు.

క్యాన్సర్‌ని గుర్తించడానికి మెదడు యొక్క MRI స్కాన్‌కు భారతదేశంలో సాధారణంగా రూ.3000 నుండి రూ.10,000 వరకు ఖర్చవుతుంది మరియు హైదరాబాద్‌లో, MRI స్కాన్‌కు మీకు రూ.3,300 నుండి రూ.12,000 మధ్య ఖర్చు అవుతుంది. మీరు మా ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా మీ సమీపంలోని కేంద్రాలలోని టాప్ లేబొరేటరీలలో డిస్కౌంట్ ధరలకు MRI స్కాన్ పొందవచ్చు.

భారతదేశంలో, ఒక MRI స్కాన్‌కు సాధారణంగా రూ.2000 నుండి రూ.25,000 వరకు ఖర్చవుతుంది మరియు హైదరాబాద్‌లో MRI స్కాన్ ధర రూ.3000 నుండి రూ.18,500 మధ్య ఉంటుంది. డయాగ్నస్టిక్ సెంటర్ సౌకర్యాలు, మీరు ఉండే ప్రాంతం, వైద్య నైపుణ్యం, స్కాన్ చేయాల్సిన శరీర భాగం మొదలైన వాటిపై ఆధారపడి ఈ ఖర్చు మారవచ్చు.

MRI స్కాన్ తీసుకునే యంత్రం చాలా ఖరీదైనది మరియు దానిని ఆపరేట్ చేయడానికి నైపుణ్యం అవసరం. వారు చాలా విద్యుత్తును వినియోగిస్తారు మరియు రోగికి కొన్నిసార్లు కాంట్రాస్ట్ మెటీరియల్‌ (contrast material) ఇంజెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇవి MRI స్కాన్ ఖర్చుపై ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ, చాలా బీమా కంపెనీలు MRI స్కాన్ ఖర్చులను కవర్ చేస్తున్నాయి.

MRI స్కాన్‌లో పాల్గొనే అయస్కాంతం పెద్ద శబ్దాన్ని చేస్తుంది, ఇది సరైన చెవి రక్షణను ఉపయోగించకపోతే వినికిడి సమస్యలను కలిగిస్తుంది. మీరు నరములు లాగుతున్న అనుభూతిని కూడా ఎదుర్కోవచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి కారణంగా శరీరం వేడెక్కవచ్చు, కాంట్రాస్ట్ ఏజెంట్లను ఉపయోగిస్తే అలెర్జీ ప్రతిచర్యలు, క్లాస్ట్రోఫోబియా (claustrophobia) మరియు MRI సమయంలో అయస్కాంత క్షేత్రంలోకి తాళంచెవిలు, మొబైల్ మొదలైన ఏ లోహ వస్తువులు ప్రవేశించకుండా చూసుకోండి.

మీరు మా ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా తగ్గింపు ధరలో MRI స్కాన్ ను పొందవచ్చు. అదనంగా, మీరు మా సంరక్షణ బృందం నుండి నిరంతర సహాయాన్ని పొందవచ్చు. మీరు 35% వరకు తగ్గింపుతో ఏవైనా రోగనిర్ధారణ పరీక్షలను పొందడానికి మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్, Onco Care Plusని ఎంచుకోవచ్చు.

CT స్కాన్ అయోనైజింగ్ రేడియేషన్‌ను ఉపయోగిస్తుంది, ఇది DNAను దెబ్బతీసే అవకాశం ఉంది, అయితే MRI స్కాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఉపయోగించకుండా జరుగుతుంది. కాబట్టి, CT స్కాన్‌తో పోలిస్తే MRI స్కాన్ నుండి తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి మరియు CT స్కాన్‌తో పోలిస్తే MRI స్కాన్ సురక్షితమైనదిగా పరిగణించబడింది. CT స్కాన్ కు MRI స్కాన్ కంటే ధర తక్కువ. అయినప్పటికీ, చాలా బీమా కంపెనీలు ఇప్పుడు ఇమేజింగ్ స్కాన్‌ల ఖర్చులలో 80% ఖర్చులు భరిస్తున్నాయి.

మీ శరీరంలోని గడ్డలు లేదా కణితిని మీ వైద్యుడు క్యాన్సర్‌గా నిర్ధారించినట్లయితే, తదుపరి పరీక్షలను సిఫార్సు చేయవచ్చు. ఈ పరీక్షల్లో ఇమేజింగ్ స్కాన్‌లు, రక్త పరీక్షలు, అవయవ పనితీరు పరీక్షలు లేదా మీ కేసును పూర్తిగా అర్థం చేసుకోవడానికి బయాప్సీ కూడా ఉంటాయి. ఫలితాల ఆధారంగా, మీ డాక్టర్ మీకు తగిన చికిత్స ప్రణాళికను సిద్ధం చేస్తారు లేదా మిమ్మల్ని సరైన ఆంకాలజిస్ట్‌కు సూచిస్తారు.

MRI అనేది నొప్పిలేని ప్రక్రియ. మత్తుమందు లేదా మరే ఇతర నొప్పి నివారణ మందులు తీసుకోవలసిన అవసరం లేదు. అయితే, మీకు క్లాస్ట్రోఫోబియా (claustrophobia; చీకటి మరియు ఇరుకైన ప్రదేశాల వల్ల భయం) ఉంటే, స్కానింగ్ చేసే ముందు మీ వైద్యుడికి తెలియజేయండి. ప్రక్రియ సమయంలో భయం లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి మీ వైద్యుడు మీకు తేలికపాటి మత్తుమందులను ఇవ్వవచ్చు.

మెటల్ ఇంప్లాంట్లు, పేస్‌మేకర్‌లు లేదా ఏదైనా ఇతర అమర్చిన పరికరాలను కలిగి ఉన్న వ్యక్తులు MRI పొందడానికి అర్హులు కాదు. ఎందుకంటే MRI స్కాన్‌లో వ్యక్తిని స్కాన్ చేయడానికి శక్తివంతమైన అయస్కాంతాలు ఉంటాయి. అర్హత లేని సందర్భాలలో, CT స్కాన్ సిఫార్సు చేయబడుతుంది.