Cancer Care Now At Your Fingertips
హైదరాబాద్‌లో మెడికల్ ఆంకాలజీ
Onco క్యాన్సర్ సెంటర్స్ 10-15 సంవత్సరాల విస్తృత అనుభవం కలిగి ఉన్న ఉత్తమ మెడికల్ ఆంకాలజిస్ట్‌ల ద్వారా హైదరాబాద్‌లో మెడికల్ ఆంకాలజీ చికిత్సలను అందిస్తున్నాయి. ఇప్పుడే క్యాన్సర్ నిపుణుడితో ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.
హైదరాబాద్‌లోని ఉత్తమ మెడికల్ ఆంకాలజిస్ట్
Related Videos
ప్రశ్నలు-సమాధానాలు
మెడికల్ ఆంకాలజిస్టులు చికిత్స ఎంపిక గురించి, అందుబాటులో ఉన్న చికిత్సల గురించి మాట్లాడతారు మరియు చికిత్స యొక్క ప్రభావం మరియు సాధ్యమయ్యే దుష్ప్రభావాల గురించి కూడా మీకు వివరిస్తారు. ఏ చికిత్సలు మరియు ఎప్పుడు నిర్వహించాలో కూడా వారు మీకు సూచిస్తారు. ఈ అపాయింట్‌మెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్‌కి మీకు ఉన్న ఇతర సమస్యలను గమనించడానికి మరియు మీకు బాగా సరిపోయే మంచి చికిత్స ప్రణాళికను సిఫార్సు చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. మీరు చికిత్స ఫలితాల గురించి మరియు ప్రతికూల ప్రభావాలను ఎలా నివారించాలి అనే ప్రశ్నలను కూడా అడగవచ్చు.
అనేక ప్రభుత్వ, ప్రైవేట్, మరియు ట్రస్ట్ ఆసుపత్రులు ఉన్నాయి. డాక్టర్ సంప్రదింపుల కోసం , ప్రైవేట్ ఆసుపత్రులలో నిరీక్షణ సమయం ఎక్కువ కావచ్చు మరియు ఖర్చులు మారవచ్చు. మీ క్యాన్సర్ రకం మరియు క్యాన్సర్ దశకు సంబంధించిన నిపుణుల పరంగా మీ ప్రాంతంలోని ఉత్తమ ఎంపికలను కనుగొనడంలో Onco మీకు సహాయపడుతుంది. ధరలను సరిపోల్చడానికి మరియు మీ బడ్జెట్‌కు సరిపోయే ఉత్తమ చికిత్సను ఎంచుకోవడానికి కూడా మేము మీకు సహాయం చేస్తాము.
మీ క్యాన్సర్ చికిత్స ప్రయాణం అంతటా మేము మీకు ప్రతి దశలో సహాయం అందించగలము.
మెడికల్ ఆంకాలజీలో చికిత్స ఎంపికలు కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, మరియు హార్మోన్ థెరపీ. మీ సామర్థ్యాలు మరియు చికిత్స అవసరాలపై ఆధారపడి, మా క్యాన్సర్ వైద్యులు మీకు ఉత్తమ చికిత్స ప్రణాళికను సూచిస్తారు.
కీమోథెరపీ మందులు వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. అయినప్పటికీ, అవి క్యాన్సర్ కణాలు మరియు ఆరోగ్యకరమైన కణాల మధ్య తేడాను గుర్తించలేవు. జీర్ణాశయంలో మరియు జుట్టు కుదుళ్ళలో ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా వేగంగా పెరుగుతాయి. కాబట్టి, కీమోథెరపీ వల్ల వాంతులు మరియు జుట్టు రాలడం జరుగుతుంది.
రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఇమ్యునోథెరపీ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని ఉపయోగిస్తుంది.
టార్గెటెడ్ థెరపీలో, కీమోథెరపీలా కాకుండా, టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ కణాలలోని తేడాలను గుర్తించగలవు, మరియు ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా, క్యాన్సర్ కణాలపై మాత్రమే దృష్టి సారించగలవు. కాబట్టి కీమోథెరపీతో పోలిస్తే తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి.
Oncoలో చాలా మంది 10 నుండి 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు మరియు AIIMS మరియు టాటా మెమోరియల్ ఆసుపత్రి వంటి ప్రముఖ సంస్థల నుండి కూడా శిక్షణ పొందినవారు ఉన్నారు. మేము మీ ప్రాంతంలో మీ కోసం ఉత్తమ ఎంపికను కనుగొనగలము.
రోగనిర్ధారణ నుండి ఉపశమనం వరకు ఒకే చోట మీకు అవసరమైన ప్రతి సహాయాన్ని Onco అందిస్తోంది. ఇది ఉత్తమ వైద్యుడిని సంప్రదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు రెండవ అభిప్రాయాలు, న్యూట్రిషన్ గైడెన్స్, మానసిక మద్దతు, కమ్యూనిటీ సపోర్ట్, కేర్ మేనేజర్ గైడెన్స్ మరియు ఎండ్ టు ఎండ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సపోర్ట్‌తో సహా వారు మీకు సరైన చికిత్స ప్రణాళికను సూచిస్తారు.
ఆంకాలజిస్టులు 3 రకాలు: మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు సర్జికల్ ఆంకాలజిస్ట్. మెడికల్ ఆంకాలజిస్టులు క్యాన్సర్‌కు కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు హార్మోన్ థెరపీతో చికిత్స చేస్తారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్‌కు రేడియేషన్ థెరపీతో చికిత్స చేస్తారు, మరియు సర్జికల్ ఆంకాలజిస్ట్ ట్యూమర్‌లను తొలగించడానికి శస్త్రచికిత్సతో క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు.
మెడికల్ ఆంకాలజిస్ట్ వికారం మరియు వాంతులు తగ్గించడానికి మందులను సూచించవచ్చు. అలసటను ఎదుర్కోవడానికి నిర్దిష్ట ఆహారం మరియు శరీర వ్యాయామాలను అనుసరించమని కూడా అతను మీకు సలహా ఇవ్వవచ్చు. తదుపరి అంటువ్యాధులు, నోటి పుండ్లు, జుట్టు రాలడం మొదలైన వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో కూడా అతను మీకు మార్గనిర్దేశం చేస్తాడు. Onco యొక్క సంరక్షణ నిర్వాహకులు మీ దుష్ప్రభావాలతో వ్యవహరించడంలో కూడా మీకు సహాయపడగలరు.
ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీని ఉపయోగించి క్యాన్సర్‌ను చికిత్స చేస్తారు. అతను క్యాన్సర్ రోగికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాత మరియు రోగి చికిత్స అభివృద్ధికి సహకరిస్తారు.
మెడికల్ ఆంకాలజీ అనేది ఒక రకమైన క్యాన్సర్ చికిత్స, ఇందులో కీమోథెరపీ (Chemotherapy), హార్మోన్ థెరపీ (Hormone therapy), టార్గెటెడ్ థెరపీ (Targeted therapy), మరియు ఇమ్యునోథెరపీ (Immunotherapy)ని ఉపయోగించి క్యాన్సర్ చికిత్స చేయబడుతుంది. మెడికల్ ఆంకాలజీ ఉత్తమ ఫలితాల కోసం రేడియేషన్ ఆంకాలజీ లేదా సర్జికల్ ఆంకాలజీతో కలిపి అందించబడుతుంది.
కీమోథెరపీ
ఇమ్యునోథెరపీ
టార్గెటెడ్ థెరపీ
హార్మోన్ థెరపీ
కీమోథెరపీ
కీమోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్స, ఇది శరీరం అంతటా వేగంగా పెరుగుతున్న కణాలను నిర్మూలించడానికి మరియు కణాలు మరింత పెరగకుండా నిరోధించడానికి శక్తివంతమైన మందులను ఉపయోగిస్తుంది. ఇది అదనంగా ఇతర కణజాలాలకు లేదా అవయవాలకు క్యాన్సర్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది.
కీమోథెరపీ రకాలు
నియో అడ్జువెంట్ కీమోథెరపీ (Neoadjuvant Chemotherapy): ఇది రేడియేషన్ థెరపీ లేదా శస్త్రచికిత్సకు ముందు నిర్వహించబడుతుంది.
ఇది వ్యాధిని తగ్గించడంలో, రోగికి చికిత్సను తట్టుకొనే శక్తిని పెంచడంలో, శస్త్రచికిత్స మరియు రేడియేషన్ థెరపీకి ప్రతిస్పందనను పెంచడంలో, పునరావృత రేటును తగ్గించడంలో, మరియు మనుగడ రేటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అడ్జువెంట్ కీమోథెరపీ (Adjuvant Chemotherapy): ఇది శస్త్రచికిత్స లేదా రేడియేషన్ థెరపీ తర్వాత నిర్వహించబడుతుంది.
ఇది పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు సానుకూల ఫలితాలు సాధించడంలో సహాయపడుతుంది.
మెట్రోనమిక్ కీమోథెరపీ (Metronomic Chemotherapy): ఈ వైద్యంలో, అధిక మోతాదులో కీమోథెరపీని తట్టుకోలేని రోగులకు తక్కువ మోతాదులో కీమో మందులు చాలా కాలం పాటు అందించబడతాయి.
కీమోథెరపీ యొక్క ప్రయోజనాలు
● క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది
● క్యాన్సర్‌ను నయం చేస్తుంది
● జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది
● క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది
● కణజాలాలకు క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రిస్తుంది
దుష్ప్రభావాలు
కీమోథెరపీ నోటి, ప్రేగు, మరియు జుట్టు కుదుళ్ళ యొక్క వేగంగా విభజించే ఆరోగ్యకరమైన కణాలను కూడా నాశనం చేస్తుంది, తద్వారా దుష్ప్రభావాలకు దారితీస్తుంది. సాధారణంగా, ఈ దుష్ప్రభావాలు కాలక్రమేణా మానిపోతాయి, కొన్ని సందర్భాల్లో మాత్రమే దుష్ప్రభావాలు తీవ్రంగా ఉండవచ్చు, మరియు వాటిని నివారించడానికి క్యాన్సర్ వైద్యులు మందులను సూచిస్తారు.
కొన్ని దుష్ప్రభావాలు
● జుట్టు ఊడుట
● బరువు పెరుగుట
● బరువు తగ్గడం
● వికారం మరియు వాంతులు
● ఆకలి లేకపోవడం
● మలబద్ధకం
● నిద్రలేమి
● సులభంగా గాయాలు అవడం మరియు రక్తస్రావం
● జ్వరం
● రక్త గణన తగ్గడం
● నోటి పుండ్లు
● నరాలవ్యాధి
● చర్మం మరియు గోళ్ళలో మార్పులు
● మతిమరుపు
పై దుష్ప్రభావాలకు సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే, మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని సంప్రదించడం మంచిది. వారు మీ వైద్య చరిత్ర, మీరు తీసుకుంటున్న చికిత్సలు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటె వాటి గురించి తెలుసుకొని, ఆపై దుష్ప్రభావాలను నివారించడానికి మందులను సిఫార్సు చేస్తారు.
తీవ్రమైన దుష్ప్రభావాలు
● ఊపిరితిత్తుల కణజాలానికి హాని కలగడం
● గుండె సమస్యలు
● పునరుత్పత్తి సమస్యలు
● కిడ్నీ సమస్యలు
హైదరాబాదులో కీమోథెరపీకి అయ్యే ఖర్చు మందుల రకం, క్యాన్సర్ రకం మరియు క్యాన్సర్ ఉన్న దశ, సెషన్ల సంఖ్య, చికిత్స ప్రణాళిక, ఔషధ మోతాదు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
హైదరాబాద్‌లో అతి తక్కువ ధర: రూ. 4000
హైదరాబాద్‌లో సగటు ధర: రూ.21,000
హైదరాబాద్‌లో గరిష్ట ధర: రూ.40,000
కీమోథెరపీ యొక్క ఒక సెషన్: రూ.50,000 – రూ.80,000 (సెషన్ల సంఖ్యను బట్టి)
ఇచ్చే మార్గం ఆధారంగా కీమోథెరపీ ఖర్చు:
ఓరల్ : రూ.56,000 – రూ.70,000
IV : రూ.70,000 – రూ.1,05,000
పోర్ట్ ద్వారా : రూ.2,10,000 – రూ.2,80,000
చికిత్సకు ముందు మరియు తరువాత ఖర్చులు:
ప్రీ-కీమోథెరపీ ఖర్చు –
డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు : రూ. 500 – రూ.1500
ల్యాబ్ పరీక్షలు : రూ.5000 – రూ.25,000
రోగ నిర్ధారణ పరీక్షలు : రూ.5000 – రూ.40,000
కీమోథెరపీ మాత్రమే చికిత్సగా ఇవ్వబడుతుంది లేదా శస్త్రచికిత్స, రేడియేషన్ చికిత్స, లేదా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT)తో కూడి కలిపి ఇవ్వబడుతుంది. శస్త్రచికిత్స మరియు రేడియేషన్ చికిత్స ఖర్చులు క్యాన్సర్ ఉన్న శరీర భాగం మరియు క్యాన్సర్ తీవ్రతపై ఆధారపడి ఉంటాయి.
శస్త్రచికిత్స : రూ.2,80,000 – రూ. 10,50,000
రేడియేషన్ : రూ.30,000 – రూ.20,00,000
బోన్ మ్యారో మార్పిడి : రూ.15,00,000 – రూ.40,00,000
కీమోథెరపీ తర్వాత ఖర్చులు-
అదనపు మందుల ధర – కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి
ఆసుపత్రి బస ఖర్చు – కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు చికిత్స ఉంటుంది
అదనపు సేవల కోసం – కొన్నిసార్లు కొన్ని అదనపు సేవలను పొందేందుకు ఆసుపత్రి బసను పొడిగించాల్సిన అవసరం ఉంది
ఇంటి వద్ద సేవలు – ఇది తరచుగా అవసరం లేదు, అయినప్పటికీ, కొంతమంది రోగులకు శిక్షణ పొందిన నర్సు నుండి సహాయం అవసరం కావచ్చు, అదనపు వైద్య పరికరాలు మరియు మరిన్ని అవసరం కావచ్చు.
ఇమ్యునోథెరపీ, బయోలాజికల్ థెరపీ అని కూడా పిలుస్తారు, ఇది పర్సనలైజ్డ్ చికిత్సా విధానం. క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి మరియు నాశనం చేయడానికి శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా ఇది పనిచేస్తుంది.
● కీమోథెరపీ మరియు రేడియేషన్ చికిత్సకు ప్రతిస్పందించని క్యాన్సర్ రోగులకు ఇది సమర్థవంతమైన చికిత్స.
● క్యాన్సర్ కణాలను గుర్తించడానికి మరియు లక్ష్యంగా చేసుకోవడానికి రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది.
● అనేక రకాల క్యాన్సర్లకు ఇమ్యునోథెరపీని ఉపయోగించి విస్తృతంగా చికిత్స చేస్తున్నారు.
ఇమ్యునోథెరపీ యొక్క దుష్ప్రభావాలు ఉపయోగించే ఇమ్యునోథెరపీ రకాన్ని బట్టి మారవచ్చు. దుష్ప్రభావాలు, రోగనిరోధక వ్యవస్థ యొక్క ఓవర్‌స్టిమ్యులేషన్ కి సంబంధించినవి, మరియు వాపు యొక్క చిన్న లక్షణాల నుండి (ఉదా; జ్వరం), ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి ప్రధాన పరిస్థితుల వరకు ఉండవచ్చు.
హైదరాబాదులో ఇమ్యునోథెరపీకి అయ్యే ఖర్చు ఔషధాల రకం, కణితి రకం, కణితి యొక్క ప్రాబల్యం, కణితి ప్రాణాంతకత స్థాయి, క్యాన్సర్ దశ, సెషన్ల సంఖ్య మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రూ.25,000 నుంచి ప్రారంభమవుతుంది
ఒక సైకిల్ ధర : రూ.1,00,000 – రూ.4,00,000. సాధారణంగా, 3-4 సెషన్లు అవసరమవుతాయి.
టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు వ్యాప్తిని నిర్వహించే ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా క్యాన్సర్ చికిత్స చేస్తుంది.
● క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది
● క్యాన్సర్ కణాల నాశనానికి కారణం అవుతుంది
● క్యాన్సర్ పెరగడానికి అవసరమైన హార్మోన్లని బలహీనంగా చేస్తుంది
● కణితులను నాశనం చేయడానికి రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది
దుష్ప్రభావాలు
● విరేచనాలు
● కాలేయ సమస్యలు
● అధిక రక్త పోటు
● గాయం మానడం కష్టం అవుతుంది
● రక్తము గడ్డ కట్టుట
● అలసట
● నోటి పుండ్లు
● గోరు మార్పులు
● జుట్టు రంగు కోల్పోవడం మరియు చర్మ సమస్యలు
రూ.1,00,000 నుండి రూ. 3,00,000 వరకు ఉంటుంది.
హార్మోన్ల థెరపీని ఎండోక్రైన్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఇది క్యాన్సర్ పెరుగుదలకు సహకరించే హార్మోన్ల ఉత్పత్తిని ఆపడం లేదా హార్మోన్లు క్యాన్సర్ కణాలను చేరకుండా నిరోధించడం ద్వారా క్యాన్సర్కు చికిత్స చేస్తుంది.
హార్మోన్ థెరపీ యొక్క ప్రయోజనాలు
● క్యాన్సర్ పునరావృతమయ్యే అవకాశాలను తగ్గించడం
● శస్త్రచికిత్స లేదా రేడియేషన్ థెరపీ చేయలేని ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న పురుషులలో క్యాన్సర్ లక్షణాలను తగ్గించడం.
పురుషులలో హార్మోన్ థెరపీ యొక్క దుష్ప్రభావాలు
● సెక్స్ సామర్థ్యం కోల్పోవడం
● బలహీనమైన ఎముకలు
● అంగస్తంభన లోపం
● వికారం మరియు వాంతులు
● విరేచనాలు
● అలసట
మహిళల్లో హార్మోన్ థెరపీ యొక్క దుష్ప్రభావాలు
● యోని పొడిగా అవ్వడం
● ఇంకా మెనోపాజ్ రాకపోతే పీరియడ్స్‌లో మార్పులు రావడం
● సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోవడం
● వికారం మరియు వాంతులు
● మానసిక స్థితిలో మార్పులు
● అలసట
మీరు స్వీకరించే హార్మోన్ థెరపీ రకాలు మరియు చికిత్స యొక్క వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది.