0 +
క్యాన్సర్ వైద్యులు
0 +
సెంటర్లు
0 +
సేవలు అందుకున్న రోగులు

Rated 5/5 Reviews

మామోగ్రఫీ అంటే ఏమిటి?

మామోగ్రఫీ (Mammography) అనేది రొమ్ము క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే గుర్తించడానికి సమర్థవంతమైన రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష. స్క్రీనింగ్ టెస్ట్ మరియు డయాగ్నస్టిక్ టెస్ట్‌గా మామోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది రొమ్ము యొక్క ఎక్స్-రేని సృష్టించడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంది. రొమ్ములలో ఏదైనా అసాధారణ పెరుగుదల లేదా గడ్డలు వంటివి ఈ ఎక్స్-రే లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ విశ్లేషించారు. మొత్తం మామోగ్రామ్ పరీక్ష 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. కానీ రొమ్ము ఎక్స్-రే తీసుకునే ప్రధాన మామోగ్రఫీ ప్రక్రియ 3 నుండి 5 నిమిషాలు పడుతుంది. ఈ ప్రక్రియ సమయంలో రొమ్ములపై ఒత్తిడి కొంత మంది మహిళలకు కొద్దిగా నొప్పిని కలిగిస్తుంది, అది తర్వాత తగ్గుతుంది.

హైదరాబాద్‌లో మామోగ్రఫీ పరీక్షను ఎలా బుక్ చేసుకోవాలి?

హైదరాబాద్‌లో మామోగ్రఫీ పరీక్ష ఖర్చు

హైదరాబాద్‌లో మామోగ్రఫీ ఖర్చు బహుళ కారకాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మామోగ్రామ్ ధర రూ.800 నుండి ప్రారంభమవుతుంది మరియు రూ. 2500 వరకు ఉంటుంది.

సగటున, హైదరాబాద్‌లో మామోగ్రామ్ ధర దాదాపు రూ.1739 ఉంటుంది. మీ కోసం మామోగ్రామ్ పరీక్ష యొక్క ఖచ్చితమైన ధరను తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి.

2D డిజిటల్ మామోగ్రఫీ మరియు 3D డిజిటల్ మామోగ్రఫీ వంటి అధునాతన మామోగ్రామ్‌ల యొక్క ధర ఇప్పుడు ఉన్న మామోగ్రామ్‌ల కంటే కొంచెం ఎక్కువ. కానీ ఈ అధునాతన మామోగ్రఫీ మరింత ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది మరియు తప్పుడు ఫలితాలను నివారిస్తుంది. అందువల్ల, అధునాతన మామోగ్రామ్‌ల యొక్క ధర ఎక్కువగా ఉంటుంది.

భారతదేశంలో మరియు హైదరాబాద్‌లో మామోగ్రఫీ ధరలు

భారతదేశంలో (INR) ఒక సెషన్‌కు హైదరాబాద్‌లో (INR) ఒక సెషన్‌కు
ప్రారంభ ధర
600
800
సగటు ధర
1500
1700
గరిష్ట ధర
3800
2500

 (Note:గమనిక: ప్రదర్శించబడిన ధర విలువలు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. మీ చికిత్స కోసం తుది ఖర్చు డాక్టర్ తో సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది. కానీ ముఖ్యంగా మీ కేసు కోసం, మీరు సుమారుగా ధరను తెలుసుకోవాలనుకుంటే, 8008575405 నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరియు మేము మీకు అంచనాను అందిస్తాము.

ఖర్చు అంచనాను పొందండి

కీమోథెరపీ కోసం Onco క్యాన్సర్ సెంటర్లను ఎందుకు ఎంచుకోవాలి?

అందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సేవలను అందించడం కోసం Onco క్యాన్సర్ సెంటర్లు గుర్తింపు పొందాయి. క్యాన్సర్ చికిత్సల ఖర్చు రోగులకు మరియు వారి సంరక్షకులకు భారంగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. ఈ ఆర్థిక క్షోభను తగ్గించడానికి, మేము “Onco Care Plus” సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించాము, దీని ద్వారా మీరు క్యాన్సర్ చికిత్సలపై రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు. మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ యొక్క మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

అదనంగా, మీరు ఇవి పొందవచ్చు

ప్రపంచంలోని మొట్టమొదటి క్యాన్సర్ కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోండి

ఖర్చు అంచనాను పొందడానికి కేర్ మేనేజర్‌లతో మాట్లాడండి

మామోగ్రామ్‌తో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియ

మామోగ్రఫీ పరీక్షకు ముందు:

• మీ షెడ్యూల్ చేసిన సమయం మరియు స్లాట్ ప్రకారం డయాగ్నస్టిక్ సెంటర్‌ను సందర్శించండి.
• మీ రొమ్ములపై లేదా సమీపంలో డియోడరెంట్‌లు, పెర్ఫ్యూమ్‌లు మొదలైన వాటితో సహా సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి
• ఇంతకు మందు తీసుకున్న మామోగ్రామ్ చిత్రాలు గనక ఉంటే వాటిని తీసుకురండి. ఇది గత మరియు ప్రస్తుత మామోగ్రామ్‌లను పోల్చడానికి రేడియాలజిస్ట్‌కు సహాయపడుతుంది.

మామోగ్రఫీ పరీక్ష సమయంలో:

• సెంటర్‌ వద్ద, మీరు మామోగ్రామ్‌ని పొందడం సౌకర్యంగా ఉండేలా ధరించడానికి మీకు ప్రత్యేకమైన వైద్య దుస్తులు ఇవ్వబడతాయి.
• మీ ఆరోగ్య సంరక్షణ బృందం మామోగ్రఫీ పరీక్ష అంతటా మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మమ్మోగ్రామ్ పరికరం ముందు నిలబడి రొమ్ములను మెషిన్‌పై సరిగ్గా ఉంచడానికి వారు మీకు సహాయపడతారు. నిటారుగా నిలబడమని మరియు కొన్ని సెకన్ల పాటు మీ శ్వాసను బిగబట్టుకోమని వారు మిమ్మల్ని అడగవచ్చు.
• స్పష్టంగా ఉండే ఒక ప్లాస్టిక్ ప్లేట్ కొన్ని సెకన్ల పాటు మీ రొమ్ములను క్రమంగా నొక్కుతుంది. ఈ ఒత్తిడి మీకు తీవ్రమైన నొప్పిని కలిగించదు. మీరు చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే, మీ ఆరోగ్య సంరక్షణ బృందానికి తెలియజేయండి.
• రేడియేషన్ పంపబడుతుంది మరియు రొమ్ముల యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి ఎక్స్-కిరణాలు రొమ్ము కణజాలంలోకి చొచ్చుకుపోతాయి.
• ఇది రొమ్ము కణజాలాల డిజిటల్ చిత్రాలను కంప్యూటర్‌పై చూపిస్తుంది.

మామోగ్రామ్ పరీక్ష తర్వాత:

రెండు రొమ్ముల మామోగ్రఫీని పొందిన తర్వాత, మీ ఆరోగ్య సంరక్షణ బృందం చిత్రాల నాణ్యత కోసం చూస్తుంది. నాణ్యత బాగా ఉంటే, మీరు కేంద్రం నుండి వెళ్ళవచ్చు లేదా నాణ్యత సరిగా లేకుంటే మామోగ్రఫీ మళ్లీ చేయబడుతుంది.
• మామోగ్రఫీ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్‌లో మీరు గడిపే సమయం దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. మా ద్వారా మామోగ్రామ్‌ను బుక్ చేసుకోవడం ద్వారా మీరు సెంటర్‌ వద్ద వేచి ఉండే సమయాన్ని నివారించవచ్చు.
• పొందిన చిత్రాలు రొమ్ము కణజాల విశ్లేషణ కోసం నిపుణులైన రేడియాలజిస్ట్‌కు పంపబడతాయి. మీరు మామోగ్రామ్ ఫలితాలను ఎప్పుడు మరియు ఎలా పొందుతారని మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని అడగండి

హైదరాబాద్‌లోని అగ్ర క్యాన్సర్ వైద్యులు

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రతి స్త్రీకి మామోగ్రామ్‌తో విభిన్న అనుభవాలు ఉన్నాయి. కొంతమంది స్త్రీలు నొప్పి మరియు తేలికపాటి అసౌకర్యాన్ని అనుభవిస్తారు మరియు కొంతమందికి ఏమీ అనిపించకపోవచ్చు. మామోగ్రామ్ సమయంలో, పరీక్ష పరికరం నుండి రొమ్ములపై ఒత్తిడి నొప్పికి కారణం అవుతుంది. మామోగ్రఫీ సమయంలో ఈ ఒత్తిడి 5 నిమిషాల పాటు ఉంటుంది మరియు క్రమంగా తగ్గుతుంది. ఎంత నొప్పి కలుగుతుంది అనేది మామోగ్రామ్ పరికరాల రకం, మీ రొమ్ముల పరిమాణం మరియు మీ రుతుచక్రానికి సంబంధించి మీరు ఏ సమయంలో పరీక్షను తీసుకుంటున్నారనే దాని బట్టి మారుతుంది.

మామోగ్రఫీ అనేది స్క్రీనింగ్ మరియు రోగ నిర్ధారణ కోసం తక్కువ-శక్తి ఎక్స్-కిరణాలను ఉపయోగించి రొమ్ములను చిత్రించే ప్రక్రియ. మామోగ్రఫీ పరీక్షను మామోగ్రామ్‌గా సూచిస్తారు.

మీరు 40 నుండి 44 సంవత్సరాల వయస్సు గల స్త్రీ అయితే, మీ వైద్యుని అనుమతితో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్‌కు వెళ్లడం ప్రారంభించవచ్చు. మీరు 45 నుండి 54 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే, సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్‌కు వెళ్లమని మేము సిఫార్సు చేస్తాము. మీరు 55 ఏళ్లు పైబడిన వారైతే, ప్రతి రెండేళ్లకు ఒకసారి స్క్రీనింగ్‌కు వెళ్లడం మంచిది. మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే, రొమ్ము MRI కూడా సిఫార్సు చేయబడుతుంది.

సాధారణంగా, మూడు రకాల మామోగ్రామ్‌లు ఉన్నాయి:

1. కన్వెన్షనల్ మామోగ్రఫీ (Conventional mammography)
2. 2D డిజిటల్ మామోగ్రఫీ (2D Digital mammography)
3. 3D డిజిటల్ మామోగ్రఫీ (3D Digital mammography)

ప్రతి మామోగ్రఫీ లక్ష్యం రొమ్ముల ఎక్స్-రేని పొందడం ఒకటే, కానీ ఖర్చు మరియు సమర్థత భిన్నంగా ఉంటాయి. కన్వెన్షనల్ మామోగ్రఫీతో పోలిస్తే, 2D డిజిటల్ మామోగ్రఫీ మరియు 3D డిజిటల్ మామోగ్రఫీ మరింత ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. అందువల్ల, అటువంటి మామోగ్రామ్‌ల ధర కొంచెం ఎక్కువ.

మీరు 40 నుండి 44 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే మీ వైద్యుని ఆమోదంతో సంవత్సరానికి ఒకసారి మామోగ్రఫీని ప్రారంభించవచ్చు. మీరు 45 నుండి 54 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే, సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ కోసం వెళ్లాలని సిఫార్సు చేయబడింది, మరియు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవడం మంచిది. రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాలు ఉన్న మహిళలకు మాత్రమే, మామోగ్రామ్‌తో పాటు రొమ్ము MRI కూడా సిఫార్సు చేయబడుతుంది.

చాలా రొమ్ము క్యాన్సర్ కేసులలో సాధారణంగా కనిపించే ఐదు ప్రధాన రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:

1. రొమ్ము లేదా అండర్ ఆర్మ్ ప్రాంతంలో గడ్డలు ఉండటం లేదా గట్టిపడటం
2. రొమ్ముల రంగు, ఆకారం మరియు పరిమాణంలో మార్పు రావడం
3. చనుమొనల నుండి తెలియని స్రావాలు విడుదలవడం
4. రొమ్ముల చర్మంపై మార్పులు
5. చనుమొన లోపలికి వెళ్లడం

మీకు ఈ లక్షణాలు ఏవైనా ఉంటే, వైద్యుడిని సంప్రదించండి మరియు మీ రొమ్ములను పరీక్షించుకోండి.

మామోగ్రామ్ పరీక్ష కోసం కేంద్రంలో తయారు అవ్వడం నుండి బయలుదేరే వరకు సుమారు 30 నిమిషాలు పడుతుంది. కానీ ప్రధాన మామోగ్రఫీ ప్రక్రియ, అంటే రొమ్ముల ఇమేజింగ్ 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. మామోగ్రఫీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లలో వేచి ఉండే సమయాన్ని బట్టి ఈ సమయం ఎక్కువ కావచ్చు. మీరు Onco ద్వారా మామోగ్రఫీ పరీక్షను బుక్ చేసుకోవడం వల్ల ఈ నిరీక్షణ సమయాలను నివారించవచ్చు.

మామోగ్రామ్ అనేది రొమ్ము క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలో, ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో గుర్తించడానికి సమర్థవంతమైన ఇమేజింగ్ పరీక్ష. ఖచ్చితమైన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం 2D మరియు 3D డిజిటల్ మామోగ్రామ్‌ల వంటి అధునాతన రకాల మామోగ్రామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది ఎటువంటి తప్పుడు ఫలితాలను చూపదు. దాదాపు 75% నుండి 85% మంది మహిళలు ప్రారంభ దశలోనే రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలుసుకొని వారి ప్రాణాలను కాపాడుకున్నారు.

రెండు రొమ్ములపై మమ్మోగ్రఫీ చేయడం మంచిది. ఇది రొమ్ములను అన్ని వైపుల నుండి ఎక్స్-రేను తీస్తుంది. ఇది కొద్దిగా అసౌకర్యాన్ని కలిగించవచ్చు, కానీ రెండు రొమ్ముల స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి సహాయపడుతుంది.

రొమ్ము గడ్డ బఠానీ పరిమాణం నుండి చిన్న బంతి పరిమాణం వరకు వేరే వేరే పరిమాణాలలో ఉంటుంది. రొమ్ము గడ్డలు స్థిరంగా మరియు కదలకుండా ఉంటాయి. మనం మన రొమ్ములను పరిశీలించినప్పుడు, మిగిలిన రొమ్ము కణజాలంతో పోలిస్తే ఈ గడ్డలు గట్టిగా అనిపిస్తాయి. ఈ రొమ్ము గడ్డ తగినంత పెద్దదిగా ఉంటే, స్వీయ-పరీక్ష లేదా క్లినికల్ పరీక్ష సమయంలో స్పర్శ ద్వారా అనుభూతి చెందవచ్చు మరియు మనం దానిని చూడవచ్చు. తరచుగా ఈ గడ్డ రొమ్ముల పరిమాణం, ఆకారం, మందం మరియు చర్మం రంగును మారుస్తుంది. రొమ్ము గడ్డలు దాదాపు నొప్పిలేకుండా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మాత్రమే, ఇది రొమ్ములలో నొప్పిని కలిగిస్తుంది.

మామోగ్రామ్ చేయించుకునే ముందు నివారించాల్సిన పెద్ద కార్యకలాపాలేవీ లేవు. అయితే, మామోగ్రామ్‌కి వెళ్లే ముందు మీరు దూరంగా ఉండవలసిన కొన్ని విషయాలు:

● రొమ్ము ప్రాంతానికి లోషన్లు, డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు, పౌడర్‌లు మొదలైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను పూయడం మానుకోండి.
● మీరు కెఫిన్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తి అయితే కెఫీన్ రొమ్ముకు సున్నితత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి, మీ మామోగ్రామ్‌కు ముందు కెఫిన్ ఉత్పత్తులను తీసుకోకుండా ఉండండి.
● రొమ్ము ప్రాంతానికి సమీపంలో మేకప్ ఉత్పత్తులను పూయడం మానుకోండి ఎందుకంటే చిన్న సౌందర్య రేణువులు మామోగ్రఫీలో మచ్చలుగా కనిపిస్తాయి.

మీరు ఆందోళన లేకుండా మీ రోజువారీ భోజనం, పానీయాలు మరియు మందులను తీసుకోవచ్చు. ఇవి మామోగ్రఫీ పరీక్ష ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపవు.

కొన్ని సందర్భాల్లో మాత్రమే, మామోగ్రామ్‌లు కొన్ని ప్రమాదాలను కలిగిస్తాయి

● మామోగ్రఫీ మిమ్మల్ని రేడియేషన్‌కు గురి చేస్తుంది. ఇది తక్కువ మోతాదులో ఉన్న రేడియేషన్ కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.
● అరుదుగా, మామోగ్రామ్ తప్పుడు ఫలితాలను ఇస్తుంది. ఏదైనా అనుమానాస్పద గడ్డలు కనిపిస్తే, నిర్ధారణ చేయడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, రొమ్ము కణజాలాన్ని పరీక్షించడానికి బయాప్సీ వంటి అదనపు పరీక్షలకు దారి తీస్తుంది.
● రొమ్ము క్యాన్సర్ కణితులు రొమ్ముల లోపల లేదా చంక ప్రాంతంలో ఉంటే, అది మామోగ్రామ్ ద్వారా గుర్తించబడదు. కానీ రొమ్ముల క్లినికల్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

ఇది అవాస్తవం. మామోగ్రఫీ వలన ఒక వ్యక్తి కొంచెం రేడియేషన్‌కు గురికావచ్చు. ఇది అంత ప్రమాదకరమైనది కాదు మరియు రొమ్ము క్యాన్సర్‌కు కారణం కాదు. కానీ చాలా తరచుగా మామోగ్రఫీ పరీక్షలు చేయించుకోవడం వల్ల అధిక మొత్తంలో రేడియేషన్‌ మీ రొమ్ములను ప్రభావితం చేయవచ్చు. మామోగ్రఫీని ఎప్పుడు పొందాలి మరియు ఎంత తరచుగా మీరు మామోగ్రఫీని పొందాలి అనే దానిపై సరైన మార్గదర్శకత్వం కోసం మీ వైద్యుడిని అడగండి. ఒక స్త్రీ మమోగ్రామ్‌తో పొందే రేడియేషన్, తన సహజ పరిసరాల నుండి 7 వారాల పాటు పొందే రేడియేషన్ మొత్తానికి సమానం.

మామోగ్రఫీ పరీక్షలో రేడియేషన్ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచదు. కానీ మామోగ్రామ్‌తో ఎక్కువగా స్క్రీనింగ్ చేయడం వల్ల చర్మం మరియు అంతర్లీన కణజాలాలకు రేడియేషన్ వల్ల గాయం ఏర్పడుతుంది.