0 +
క్యాన్సర్ వైద్యులు
0 +
సెంటర్లు
0 +
సేవలు అందుకున్న రోగులు

Rated 5/5 Reviews

జన్యు పరీక్ష అంటే ఏమిటి?

కొన్ని రకాల క్యాన్సర్లు జన్యు ఉత్పరివర్తనాల (genetic mutations) వల్ల సంభవిస్తాయి. అటువంటి రకాల క్యాన్సర్లను గుర్తించడానికి, జన్యు పరీక్ష సిఫార్సు చేయబడింది. ఇది జన్యువులు, ప్రోటీన్లు లేదా క్రోమోజోమ్‌లలో మార్పులను మరియు క్యాన్సర్ రకాన్ని గుర్తించే ఒక సాధారణ DNA పరీక్ష. మీ క్యాన్సర్‌కు అత్యంత సరైన చికిత్సను పొందడానికి జన్యు పరీక్ష మీకు సహాయపడుతుంది. ఒక వ్యక్తికి వారి కుటుంబంలో వారి పూర్వీకులకు ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తెలుసుకోవడానికి జన్యు పరీక్ష చేయవచ్చు.

హైదరాబాద్‌లో జన్యు పరీక్షను ఎలా బుక్ చేసుకోవాలి?

హైదరాబాద్‌లో జన్యు పరీక్ష ఖర్చు

ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, వైద్యుల నైపుణ్యం, జన్యు పరీక్ష రకం, పరీక్ష ప్రయోజనం, నమూనా పరిమాణం మొదలైన వాటిపై ఆధారపడి జన్యు పరీక్ష ధర మారవచ్చు. అయితే, హైదరాబాద్‌లో జన్యు పరీక్ష సగటు ధర సుమారు రూ.20,000 నుండి రూ.50,000 వరకు ఉంటుంది.

భారతదేశంలో మరియు హైదరాబాద్‌లో జన్యు పరీక్ష ధరలు

భారతదేశంలో (INR) ఒక సెషన్‌కు హైదరాబాద్‌లో (INR) ఒక సెషన్‌కు
ప్రారంభ ధర
13000
10000
సగటు ధర
50000
35000
గరిష్ట ధర
70000
60000

 (Note:గమనిక: ప్రదర్శించబడిన ధర విలువలు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. మీ చికిత్స కోసం తుది ఖర్చు డాక్టర్ తో సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది. కానీ ముఖ్యంగా మీ కేసు కోసం, మీరు సుమారుగా ధరను తెలుసుకోవాలనుకుంటే, 8008575405 నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరియు మేము మీకు అంచనాను అందిస్తాము.

ఖర్చు అంచనాను పొందండి

కీమోథెరపీ కోసం Onco క్యాన్సర్ సెంటర్లను ఎందుకు ఎంచుకోవాలి?

అందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సేవలను అందించడం కోసం Onco క్యాన్సర్ సెంటర్లు గుర్తింపు పొందాయి. క్యాన్సర్ చికిత్సల ఖర్చు రోగులకు మరియు వారి సంరక్షకులకు భారంగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. ఈ ఆర్థిక క్షోభను తగ్గించడానికి, మేము “Onco Care Plus” సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించాము, దీని ద్వారా మీరు క్యాన్సర్ చికిత్సలపై రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు. మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ యొక్క మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

అదనంగా, మీరు ఇవి పొందవచ్చు

ప్రపంచంలోని మొట్టమొదటి క్యాన్సర్ కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోండి

ఖర్చు అంచనాను పొందడానికి కేర్ మేనేజర్‌లతో మాట్లాడండి

జన్యు పరీక్ష విధానం

మీ వైద్యుని అభిప్రాయాన్ని బట్టి, జన్యు పరీక్ష విధానం భిన్నంగా ఉంటుంది. క్యాన్సర్ పరీక్ష కోసం, చాలా వరకు సూదిని గుచ్చడం ద్వారా రక్త నమూనా సేకరించబడుతుంది, ఇది మీకు కొద్దిపాటి నొప్పిని కలిగించవచ్చు.

జన్యు పరీక్షకు ముందు:

• జన్యు పరీక్షకు మీ కృషి ఎక్కువ అవసరం లేదు. మీరు ఆసుపత్రికి వెళ్లి రక్త నమూనా ఇవ్వాలి, అంతే.
• మిగిలిన ప్రక్రియను ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు చేస్తారు.

జన్యు పరీక్ష సమయంలో:

• రక్తం సేకరించబడ్డాక మీరు ఆసుపత్రి నుండి బయలుదేరవచ్చు.
• సేకరించిన నమూనా జన్యు పరీక్ష ప్రయోగశాలకు పంపబడుతుంది, ఇక్కడ శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు DNA, ప్రోటీన్లు లేదా క్రోమోజోమ్‌లలో అసాధారణతలను తనిఖీ చేస్తారు.

జన్యు పరీక్ష తర్వాత:

• మీ జన్యు పరీక్ష ఫలితాలను పొందడానికి రోజుల నుండి వారాల వరకు పట్టవచ్చు.
• మీ జన్యు పరీక్ష రిపోర్టులు మీ వైద్యుడికి లేదా జెనెటిక్ కౌన్సిలర్ కి పంపబడతాయి, వారు మీకు ఫలితాలను వివరిస్తారు.
• మీకు క్యాన్సర్‌కు కారణమైన ఏవైనా జన్యుపరమైన రుగ్మతలు ఉన్నట్లయితే మీ డాక్టర్ మీకు వివరిస్తారు లేదా మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

హైదరాబాద్‌లోని అగ్ర క్యాన్సర్ వైద్యులు

తరచుగా అడిగే ప్రశ్నలు

క్యాన్సర్ విషయంలో ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఏ రకమైన జన్యు ఉత్పరివర్తనలు (gene mutations) క్యాన్సర్‌కు కారణమయ్యాయో గుర్తించడంలో ఇది సహాయపడుతుంది మరియు అందువల్ల మీరు దానికి తగ్గ చికిత్సలను పొందవచ్చు. మీరు క్యాన్సర్ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన వారైతే, మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి జన్యు పరీక్ష మీకు సహాయపడుతుంది.

ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, నైపుణ్యం, జన్యు పరీక్ష రకం, పరీక్ష యొక్క ఉద్దేశ్యం మొదలైన వాటిపై DNA పరీక్ష ఖర్చు ఆధారపడి ఉంటుంది. అయితే, హైదరాబాద్‌లో జన్యు పరీక్ష లేదా DNA పరీక్ష సగటు ధర సుమారు రూ.20,000 నుండి రూ.50,000 వరకు ఉంటుంది. మొత్తం ఖర్చు ఎన్నో కారకాలపై ఆధారపడి చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని జన్యు పరీక్షలకు కొన్ని వేల ఖర్చవుతుంది. జన్యు పరీక్ష మీకు ఎంత ఖర్చవుతుందో మీ వైద్యుడిని అడగి తెలుసుకోండి.

జన్యు పరీక్ష రకం, పరీక్ష యొక్క ఉద్దేశ్యం, నమూనా పరిమాణం మొదలైన వాటిపై ఆధారపడి జన్యు పరీక్ష యొక్క ఖర్చులలో చాలా తేడాలు ఉంటాయి. ఇది సాధారణంగా రూ.13,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది మరియు అనేక వేల వరకు ఖర్చవుతుంది. మీరు మీ జన్యు పరీక్ష ఖర్చు గురించి మీ వైద్యుడిని అడిగి తెలుసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

జన్యు పరీక్ష అనేది ప్రత్యేకంగా శిక్షణ పొందిన మరియు నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కూడిన సంక్లిష్ట ప్రక్రియ. జన్యు పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం. అంతేకాకుండా, నమూనా పరిమాణం, పరీక్ష యొక్క విధానం, పరీక్ష యొక్క ప్రయోజనం మొదలైనవి కూడా జన్యు పరీక్షల ఖర్చుపై ప్రభావం చూపుతాయి.

అనేక రకాల జన్యు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబం లేదా వ్యక్తిగత క్యాన్సర్ చరిత్ర మరియు మీ వైద్యుని అభిప్రాయం ఆధారంగా సరైన జన్యు పరీక్షను మీ వైద్యుడు సిఫార్సు చేస్తారు.

క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాలను (genetic mutations) గుర్తించడానికి జన్యు పరీక్ష అత్యంత నమ్మదగిన మార్గం. ఈ పరీక్షలు దాదాపు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి మరియు అందువల్ల సక్సెస్ రేటు గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.

జన్యు పరీక్షతో శరీరానికి ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి మరియు పరీక్ష యొక్క రకంపై ఆధారపడి ఉంటాయి. అనేక జన్యు పరీక్షలు ఒత్తిడి, ఆందోళన, ఆర్థిక భారం మొదలైన మానసిక అనారోగ్యాలకు కారణమవుతాయి.

జన్యు పరీక్ష మీకు ఎటువంటి ప్రతికూలతలను కలిగించదు. కానీ రిపోర్టులు పొందడానికి సమయం కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది మరియు అది మీలో ఆందోళనను కలిగిస్తుంది. అరుదుగా, జన్యు పరీక్షల రిపోర్టులు అసంపూర్తిగా లేదా అనిశ్చితంగా ఉండవచ్చు లేదా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. వంశపారంపర్య పరిస్థితుల విషయానికి వస్తే, ఈ పరీక్ష కొద్ది సమాచారాన్నే అందిస్తుంది మరియు ఏ లక్షణాలు తలెత్తవచ్చు, వ్యాధి ముదిరిందా లేదా మరియు క్యాన్సర్ ఎంత తీవ్రంగా ఉందో ఇది గుర్తించదు.

మీ జన్యు ఉత్పరివర్తనాలకు (genetic mutations) అనుగుణంగా మీకు తగిన చికిత్సను పొందడంలో జన్యు పరీక్ష మీకు సహాయపడుతుంది. ఇది మీ అనుమానం గురించి మీకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది మరియు అనవసరమైన చెకప్‌ల అవసరం ఉండదు. ఇది క్యాన్సర్‌ను మరింత ప్రభావవంతంగా చికిత్స చేయడానికి మీ వైద్యుడికి సహాయపడుతుంది మరియు చికిత్స తరువాతి ఫలితాలను మెరుగుపరుస్తుంది.

చాలా సందర్భాలలో, జన్యు పరీక్షలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. అయితే, ఫలితాలు క్యాన్సర్ సంభవించడాన్ని మరియు క్యాన్సర్ తీవ్రతను ఖచ్చితంగా చెప్పలేవు. ఫలితాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తే, మీకు ఖచ్చితంగా క్యాన్సర్‌ వస్తుంది అని దీని అర్థం కాదు. కానీ ఇది మీరు వారసత్వంగా పొందిన ఉత్పరివర్తనాల (mutations) గురించి ఖచ్చితంగా సమాచారాన్ని అందిస్తుంది.

జన్యు పరీక్షలకు మీరు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు రక్త నమూనా మాత్రమే ఇవ్వాలి. తరువాత, ఆరోగ్య సంరక్షణ నిపుణులు అసాధారణతల విశ్లేషణ కోసం సేకరించిన నమూనాను ప్రయోగశాలలకు పంపుతారు. మీరు ఒకటి నుండి రెండు వారాల్లో ఫలితాలను ఆశించవచ్చు.

కొన్ని రకాల క్యాన్సర్లు జన్యు ఉత్పరివర్తనాల (genetic mutations) వల్ల సంభవిస్తాయి. క్యాన్సర్‌కు కారణమైన ఖచ్చితమైన ఉత్పరివర్తనాలను (mutations) గుర్తించడానికి మరియు ఉత్తమ చికిత్సను అందించడానికి, జన్యు పరీక్ష సిఫార్సు చేయబడింది.

జన్యు పరీక్ష కోసం, రక్త నమూనా సేకరిస్తారు. కాబట్టి, రక్త నమూనా సేకరణ కోసం మీ శరీరంలోకి ఒక సూదిని గుచ్చుతారు, ఇది కొద్దిగా నొప్పిని కలిగిస్తుంది.