Cancer Care Now At Your Fingertips
హైదరాబాద్‌లో కీమోథెరపీ
Onco క్యాన్సర్ సెంటర్లలో బాగా అనుభవం ఉన్న ఆంకాలజిస్ట్‌ల ద్వారా అత్యంత సరసమైన ఖర్చులతో కీమోథెరపీని పొందండి
హైదరాబాద్‌లో ఉత్తమ కీమోథెరపీ స్పెషలిస్ట్
Related Videos
ప్రశ్నలు-సమాధానాలు
కీమోథెరపీ శక్తివంతమైన మందులను ఉపయోగించి క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు విభజనను నిరోధిస్తుంది.
హైదరాబాద్‌లో కీమోథెరపీలో 15 – 20 సంవత్సరాల అనుభవం ఉన్న చాలా మంది కీమోథెరపీ నిపుణులు ఉన్నారు. మీరు మా Onco యాప్ లేదా Onco వెబ్‌సైట్ ద్వారా వారిని సంప్రదించవచ్చు. మీరు ఒక మిస్డ్ కాల్ తో మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మీ ప్రాధాన్యతల ప్రకారం మేము మీకు ఉత్తమమైన వైద్యుడిని కనుగొంటాము.
కీమోథెరపీ ప్రారంభ దశ క్యాన్సర్లు, మెటాస్టాటిక్ క్యాన్సర్లు (metastatic cancers) మరియు పునరావృతమయ్యే క్యాన్సర్లకు చికిత్స చేస్తుంది. ఇది శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ మరియు ఇతర మందులతో పాటు ఇవ్వబడుతుంది. క్యాన్సర్ కీమోథెరపీకి ప్రతిస్పందించకపోతే ఆ రోగులకు కీమోథెరపీ తగినది కాదు.
కీమో ఔషధాలను విచ్ఛిన్నం చేయడానికి మరియు వాటిని వ్యవస్థ నుండి తొలగించడానికి మీ శరీరానికి 2 – 3 రోజులు పడుతుంది, అయితే కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు చాలా నెలల నుండి సంవత్సరాల వరకు ఉంటాయి. ఈ దుష్ప్రభావాలు తాత్కాలికమైనవి మరియు చికిత్స తర్వాత ఇవి నివారించబడతాయి.
కీమోథెరపీ మందులు నరాల ద్వారా లేదా నోటి ద్వారా ఇవ్వబడతాయి, ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు. నోటి పుండ్లు, మంట, తలనొప్పి, కండరాల నొప్పి మరియు కడుపు నొప్పి వంటి నొప్పులు కీమో యొక్క దుష్ప్రభావాల కారణంగా సంభవించవచ్చు.
కీమోథెరపీ సక్సెస్ రేటు వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. రోగులు కీమోథెరపీకి ఎంత బాగా స్పందిస్తున్నారో మరియు ఎంతవరకు దుష్ప్రభావాలను నివారించగలరని అంచనా వేయవచ్చు. కానీ సరైన పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటుగా కీమోథెరపీ యొక్క సక్సెస్ రేటును మెరుగుపరచవచ్చు.
అనేక దుష్ప్రభావాలు చికిత్స తర్వాత దూరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే, కీమోథెరపీ శ్వాసకోశ, రక్త ప్రసరణ, ఇంద్రియ, విసర్జన, మరియు పునరుత్పత్తి వ్యవస్థలను దెబ్బతీస్తుంది. మా ఆరోగ్య సంరక్షణ బృందం మీ క్యాన్సర్ చికిత్సలో మందులు మరియు పౌష్టికాహారానికి సంబంధించి దుష్ప్రభావాలను నివారించడానికి లేదా తగ్గించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది.
కీమోథెరపీ వల్ల సంభవించే దుష్ప్రభావాల కారణంగా లేదా కీమోథెరపీకి కణితి యొక్క ప్రతిస్పందన లేనందున, కొందరు వ్యక్తులు ఇమ్యునోథెరపీ, ఫోటోడైనమిక్ థెరపీ (Photodynamic therapy), లేజర్ థెరపీ (Laser therapy), టార్గెటెడ్ థెరపీ (Targeted therapy) మరియు హార్మోన్ థెరపీ (Hormone therapy) వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకోవచ్చు.
కీమోథెరపీ నరాల ద్వారా లేదా నోటి ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి, రోగులు మేల్కొని ఉంటారు, వారికి అందుతున్న చికిత్స గురించి వారికి తెలిసి ఉంటుంది. కీమోథెరపీలో తరచుగా ఉపయోగించే మందులు రోగులకు రోజంతా అలసటగా మరియు నిద్రపోయేలా చేస్తుంది, ఇది రాత్రి నిద్రించడానికి ఇబ్బందిగా మారుతుంది.
కీమోథెరపీ తర్వాత నిమిషాల నుండి గంటల వరకు, మీరు వికారం మరియు వాంతులు వంటివి ఎదుర్కోవచ్చు. ఒక రోజు తర్వాత మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది మరియు నిద్ర మత్తు ఎక్కువ అవుతుంది. కీమో శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం.
రోగ నిర్ధారణ నుండి ఉపశమనం వరకు మీకు అవసరమైన ప్రతి సహాయాన్ని Onco అందిస్తోంది. మిమ్మల్ని ఉత్తమ వైద్యులని సంప్రదించడానికి అనుమతిస్తుంది మరియు వారు సెకండ్ ఒపీనియన్స్, పోషకాహారం గురించి సూచనలు, మీకు కలిగే ఒత్తిడికి కౌన్సిలింగ్, కమ్యూనిటీ సపోర్ట్, కేర్ మేనేజర్ గైడెన్స్ మరియు పూర్తి మద్దతుతో సహా మీకు సరైన చికిత్స ప్రణాళికను సూచిస్తారు.
కీమోథెరపీ అనేది ఒక రకమైన క్యాన్సర్ చికిత్స. కీమోథెరపీ నరాల ద్వారా (IV ద్వారా) ఇవ్వబడుతుంది. ఒక సెషన్ ఒక రోజులో అయిపోతుంది, మరియు చాలా సందర్భాలలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు, కీమోథెరపీ మాత్రల రూపంలో అందించబడుతుంది మరియు దీనిని ఓరల్ కీమోథెరపీ అంటారు. ఈ చికిత్స సాధారణంగా రెండు నెలల పాటు సెషన్ల రూపంలో జరుగుతుంది. కీమోథెరపీని మెడికల్ ఆంకాలజిస్ట్ ఇస్తారు. కీమోథెరపీ యొక్క లక్ష్యం శక్తివంతమైన మందుల వాడకం ద్వారా శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేయడం.
కీమోథెరపీ అనేది సాధారణంగా ఉపయోగించే క్యాన్సర్ చికిత్సలలో ఒకటి. సూచించిన ఔషధాన్ని బట్టి ఒక్కో సెషన్ ఖర్చు రూ.4000 నుండి రూ.40,000 వరకు ఉంటుంది. కీమోథెరపీ ఖర్చు ఆ చికిత్స అందించే వైద్య సదుపాయంపై కూడా ఆధారపడి ఉంటుంది.
Onco Care Plus వంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవడం వలన కీమోథెరపీ ఖర్చును 30% వరకు తగ్గించవచ్చు. మీరు మా యాప్ ద్వారా మా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని పొందవచ్చు.
కీమోథెరపీ కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంటుంది, అయితే ప్రతి ఒక్కరూ అన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మందు మరియు మోతాదుపై ఆధారపడి దుష్ప్రభావం యొక్క తీవ్రత మరియు రకం కూడా మారుతూ ఉంటుంది.
కీమోథెరపీ యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలు:
● జుట్టు రాలడం
● వికారం మరియు వాంతులు
● అలసట
● ఆకలి లేకపోవడం
● ఇమ్యునోసప్రెషన్ (Immunosuppression; తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉండడం)
● రక్తహీనత
ఈ దుష్ప్రభావాలను మందులతో నివారించవచ్చు మరియు వీటిలో ఏవీ శాశ్వతమైనవి కావు. రోగి యొక్క ఆరోగ్యం మరియు కీమోథెరపీ మోతాదుపై ఆధారపడి, మీరు అలసట మరియు వికారం వంటి లక్షణాల నుండి రెండు రోజుల్లో కోలుకోవచ్చు.
జుట్టు రాలడం వంటి ఇతర దుష్ప్రభావాలు చికిత్స పూర్తయిన తర్వాత తగ్గుతాయి, కొత్త జుట్టు పెరుగుదల సాధారణంగా 3 – 6 నెలల్లో మొదలవుతుంది.
రోగనిరోధక శక్తిని తగ్గించడం మరియు రక్తహీనత వంటి దుష్ప్రభావాలు మీ వైద్య బృందంచే నిశితంగా పరిశీలించబడాలి మరియు దీని కోసం అదనపు పరీక్షలు మరియు మందులు సూచించబడవచ్చు.
◉ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది
◉ క్యాన్సర్‌ను నయం చేస్తుంది లేదా చికిత్స చేస్తుంది
◉ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది
◉ క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది
◉ చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రిస్తుంది
కీమోథెరపీ కోసం సూచించిన మందులు మీ క్యాన్సర్ రకం మరియు దశ, మీ మొత్తం ఆరోగ్యం, శస్త్రచికిత్స మరియు రేడియేషన్ థెరపీ వంటి ఇతర చికిత్సలు అవసరమయ్యే అవకాశం, మరియు ఇంకా వేరే అనారోగ్యతలతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కొన్ని సాధారణ ఔషధాలలో సిస్ప్లాటిన్ (cisplatin), పాక్లిటాక్సెల్ (paclitaxel) మొదలైనవి ఉంటాయి మరియు తరచుగా ఇవి కలిపి ఇవ్వబడతాయి.
మందుల మోతాదు కూడా మీ బరువు, ఆరోగ్యం మరియు క్యాన్సర్ నిర్ధారణ యొక్క నిర్దిష్ట వివరాలను బట్టి భిన్నంగా ఉంటుంది.
కీమోథెరపీని వివిధ మార్గాల్లో ఇవ్వవచ్చు. అత్యంత సాధారణంగా ఇంజెక్షన్లు, IV డ్రిప్ లేదా నరాల ద్వారా ఇస్తారు. ఇంట్లో వేసుకునే మాత్రల ద్వారా కూడా ఇవ్వవచ్చు. దీన్ని ఓరల్ కీమోథెరపీ అంటారు.
కీమోథెరపీని శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే నిర్వహించాల్సిన అవసరం ఉన్న సందర్భాల్లో, మీ ఆంకాలజిస్ట్ ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా అవయవాన్ని ఆపరేట్ చేయవచ్చు. ఈ పద్ధతిని HIPEC (ఉదరం), ఇంట్రాప్లూరల్ (intrapleural ) (ఛాతీ లోపల), ఇంట్రాథెకల్ (intrathecal (వెన్నెముక లోపల), ఇంట్రావెసికల్ (intravesical) (మూత్రాశయం లోపల) అని అంటారు.