0 +
క్యాన్సర్ వైద్యులు
0 +
సెంటర్లు
0 +
సేవలు అందుకున్న రోగులు

Rated 5/5 Reviews

బయాప్సీ అంటే ఏమిటి?

రోగనిర్ధారణ మరియు ల్యాబ్ పరీక్షల ద్వారా మీకు క్యాన్సర్ ఉన్నట్లు అనుమానం కలిగితే, క్యాన్సర్ రకం మరియు దశను ఖచ్చితంగా తెలుసుకోవడానికి బయాప్సీ చేస్తారు. ఈ ప్రక్రియలో ఒక సన్నని సూది ద్వారా కొంత కణజాలం సేకరించబడుతుంది. బయాప్సీ స్థానిక లేదా శరీరం మొత్తానికి మత్తుమందు ఇచ్చి నిర్వహిస్తారు. సేకరించిన కణజాల నమూనా క్యాన్సర్ విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపబడుతుంది.

హైదరాబాద్‌లో బయాప్సీ బుక్ చేసుకోవడం ఎలా?

హైదరాబాద్‌లో బయాప్సీ ఖర్చు

భారతదేశంలో, బయాప్సీ ఖర్చు దాదాపు ప్రతిచోటా ఒకే విధంగా ఉంటుంది. బయాప్సీ ప్రక్రియ రకం, బయాప్సీ కారణం, అవసరం అయ్యే పరికరాల రకం మొదలైన వాటి ఆధారంగా మాత్రమే కొద్దిగా మారుతుంది. సగటున, భారతదేశం మరియు హైదరాబాద్‌లో బయాప్సీ ధర సుమారు రూ.4000 నుండి రూ.10,000 వరకు ఉంటుంది.

భారతదేశంలో మరియు హైదరాబాద్‌లో బయాప్సీ ధరలు

భారతదేశంలో (INR) ఒక సెషన్‌కు హైదరాబాద్‌లో (INR) ఒక సెషన్‌కు
ప్రారంభ ధర
4,000
3,000
సగటు ధర
6,000
5,000
గరిష్ట ధర
10,000
10,000

 (Note:గమనిక: ప్రదర్శించబడిన ధర విలువలు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. మీ చికిత్స కోసం తుది ఖర్చు డాక్టర్ తో సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది. కానీ ముఖ్యంగా మీ కేసు కోసం, మీరు సుమారుగా ధరను తెలుసుకోవాలనుకుంటే, 8008575405 నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరియు మేము మీకు అంచనాను అందిస్తాము.

ఖర్చు అంచనాను పొందండి

కీమోథెరపీ కోసం Onco క్యాన్సర్ సెంటర్లను ఎందుకు ఎంచుకోవాలి?

అందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సేవలను అందించడం కోసం Onco క్యాన్సర్ సెంటర్లు గుర్తింపు పొందాయి. క్యాన్సర్ చికిత్సల ఖర్చు రోగులకు మరియు వారి సంరక్షకులకు భారంగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. ఈ ఆర్థిక క్షోభను తగ్గించడానికి, మేము “Onco Care Plus” సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించాము, దీని ద్వారా మీరు క్యాన్సర్ చికిత్సలపై రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు. మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ యొక్క మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

అదనంగా, మీరు ఇవి పొందవచ్చు

ప్రపంచంలోని మొట్టమొదటి క్యాన్సర్ కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మా సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోండి

ఖర్చు అంచనాను పొందడానికి కేర్ మేనేజర్‌లతో మాట్లాడండి

బయాప్సీ విధానం

వివిధ రకాల బయాప్సీలు అందుబాటులో ఉన్నాయి, వీటిని స్థానిక లేదా శరీరం మొత్తానికి మత్తుమందు ఇచ్చి చేయవచ్చు. మీ డాక్టర్ మీకు సరైన బయాప్సీని ఎంచుకుంటారు.

బయాప్సీకి ముందు:

• మీరు ఏదైనా మందులు తీసుకుంటే మీ వైద్యుడికి తెలియజేయండి
• బయాప్సీకి ముందు తీసుకోవాల్సిన లేదా నివారించాల్సిన ఆహారం మరియు మందుల గురించి మీ వైద్యునితో చర్చించండి
• ప్రక్రియ ఎలా జరుగుతుందో మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీకు వివరిస్తుంది
• బయాప్సీ కోసం ధరించడానికి మీకు ప్రత్యేక దుస్తులు ఇవ్వబడతాయి

బయాప్సీ సమయంలో:

1. వివిధ రకాల బయాప్సీలు ఉన్నాయి మరియు ప్రతి ఒక్కటి వివిధ మార్గాల్లో నిర్వహించబడుతుంది. ఇందులో

• సన్నని సూదితో బయాప్సీ: కణాలు, కణజాలం లేదా ద్రవాన్ని సేకరించడానికి శరీరంలోని క్యాన్సర్ అనుమానాస్పద భాగంలోకి సన్నని సూదిని చొప్పిస్తారు.
• చర్మ బయాప్సీ: చర్మం యొక్క చిన్న భాగం, శరీరం యొక్క ఉపరితలం నుండి సేకరించబడుతుంది. దీనిని షేవ్ బయాప్సీ (shave biopsy) లేదా పంచ్ బయాప్సీ (punch biopsy) అని కూడా అంటారు.
• ఎండోస్కోపిక్ బయాప్సీ: అవయవం లోపల వీక్షించడానికి కెమెరా లెన్స్‌తో సన్నని, అనువైన, కాంతివంతమైన ట్యూబ్, కావలసిన అవయవంలోకి చొప్పించబడుతుంది. కెమెరా సహాయంతో అవయవం లోపలి భాగాన్ని చూస్తున్నప్పుడు, అవసరమైన కణజాల నమూనా సేకరించబడుతుంది.
• లాపరోస్కోపిక్ బయాప్సీ: ఈ ప్రక్రియ ఎండోస్కోపిక్ బయాప్సీ వలె ఉంటుంది. ఇక్కడ, కొన్ని చిన్న కోతలు చేయబడతాయి మరియు ఆ కోత ద్వారా కెమెరా ఉన్న సన్నని గొట్టం చొప్పించబడుతుంది. ఈ కెమెరాను లాపరోస్కోప్ అంటారు, ఇది అవయవాన్ని వీక్షించడానికి మరియు అసాధారణ పెరుగుదలను కనుగొనడంలో సహాయపడుతుంది.
• బోన్ మ్యారో బయాప్సీ: మత్తుమందు ఇచ్చి ఎముక మజ్జలో కొంత భాగాన్ని శస్త్రచికిత్స చేయడం ద్వారా సేకరిస్తారు.
• సర్జికల్ బయాప్సీ: క్యాన్సర్ అని అనుమానించబడే అసాధారణ కణజాలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స నిర్వహిస్తారు.
• లిక్విడ్ బయాప్సీ: క్యాన్సర్ పరీక్ష కోసం రక్త నమూనా సేకరిస్తారు.
• ఇమేజ్-గైడెడ్ బయాప్సీ: శరీరం లోపల లోతుగా ఉన్న అసాధారణ పెరుగుదలను కనుగొనడానికి మరియు కణజాలాన్ని సేకరించడానికి బయాప్సీని నిర్వహించడానికి మీ వైద్యుడు ఇమేజింగ్ స్కాన్‌లను (అల్ట్రాసౌండ్, CT, MRI, X-ray, మొదలైనవి) ఉపయోగిస్తారు.

2. సేకరించిన నమూనాలు క్యాన్సర్ విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపబడతాయి.

బయాప్సీ తర్వాత:

• మీకు బాగా అనిపిస్తే అదే రోజున ఇంటికి వెళ్ళవచ్చు.
• వ్యాధికి సంబంధించిన కణజాల నమూనాలను విశ్లేషించడంలో మరియు ప్రయోగశాల పరీక్షలను వివరించడంలో నైపుణ్యం కలిగిన పాథాలజిస్ట్ మీ బయాప్సీ నమూనాను పరిశీలించడంలో పాల్గొంటారు.
• పాథాలజిస్ట్‌తో పాటు, సైటోలజిస్ట్‌లు (cytologists), హిస్టాలజిస్ట్‌లు (histologists) మరియు ఆంకాలజిస్ట్‌లతో సహా ఇతర వైద్య నిపుణులు మీ కేసును బట్టి పాల్గొంటారు.
• మీరు 2 నుండి 7 రోజులలోపు రిపోర్టులను అందుకుంటారు.

మీ రికవరీ బయాప్సీ ప్రక్రియ యొక్క రకాన్ని బట్టి ఉంటుంది. బయాప్సీ సైట్‌ను ఎలా చూసుకోవాలో మీ డాక్టర్ మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీరు బయాప్సీ ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావం, జ్వరం మరియు చర్మం ఎర్రబడటం వంటి సమస్యలను ఎదుర్కొంటే మీ వైద్యుడికి తెలియజేయండి.

హైదరాబాద్‌లోని అగ్ర క్యాన్సర్ వైద్యులు

తరచుగా అడిగే ప్రశ్నలు

సగటున, బయాప్సీ ప్రక్రియకు మీకు దాదాపు రూ.4000 నుండి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఎంచుకున్న బయాప్సీ విధానం ప్రకారం బయాప్సీ ఖర్చు ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. మీరు మీ కోసం బయాప్సీ ఖర్చును తెలుసుకోవాలనుకుంటే, 8008575405 నంబర్‌ వద్ద మమ్మల్ని సంప్రదించండి. మా ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా మీరు 15% తగ్గింపుతో బయాప్సీ పరీక్షను పొందే అవకాశం కూడా ఉంది.

బయాప్సీలు స్థానిక లేదా శరీరం మొత్తానికి మత్తుమందు ఇచ్చి నిర్వహించబడతాయి, కాబట్టి బయాప్సీ విధానం నొప్పిని కలిగించదు. కానీ ఇది బయాప్సీ ప్రక్రియ యొక్క ప్రదేశంలో దుష్ప్రభావంగా నొప్పిని కలిగిస్తుంది, దీని నుండి నొప్పి నివారణలను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ప్రక్రియ జరిగిన ప్రదేశంలో రక్తస్రావం మరియు ఇన్ఫెక్షన్ల ప్రమాదాలు కూడా ఉంటాయి. బయాప్సీ ప్రక్రియ యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి మీ డాక్టర్ మీకు అవసరమైన మందులను సూచిస్తారు.

CT, MRI, మొదలైన ఇమేజింగ్ పరీక్షలు క్యాన్సర్ లేదా అసాధారణ పెరుగుదలను నిర్ధారించడానికి సరిపోతాయి, ఇవి క్యాన్సర్ కణాలు మరియు క్యాన్సర్ కాని కణాల మధ్య తేడాను గుర్తించలేవు మరియు క్యాన్సర్ ఎంత తీవ్రంగా ఉందో కూడా గుర్తించలేవు. కాబట్టి, క్యాన్సర్‌ని ఖచ్చితమైన రోగనిర్ధారణ కోసం బయాప్సీ చేయడం ఎల్లప్పుడూ ఉత్తమం. మీరు బయాప్సీకి సరైనవారు అని తెలుసుకోవడానికి మీ డాక్టర్ మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు.

బయాప్సీలు ఎల్లప్పుడూ 100% ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. దాదాపు 80% కేసులలో, బయాప్సీలు ఖచ్చితమైన ఫలితాలను అందించాయి మరియు క్యాన్సర్ రోగులకు అత్యంత అనుకూలమైన చికిత్సలను పొందడంలో సహాయపడింది. అరుదుగా 1 నుండి 2% బయాప్సీలు తప్పు ఫలితాలను తీసుకురావడానికి కారణమవుతాయి. మేము దానిని ఫాల్స్ పాజిటివ్ లేదా ఫాల్స్ నెగటివ్ అని పిలుస్తాము. అయినప్పటికీ, క్యాన్సర్ నిర్ధారణకు బయాప్సీ ఉత్తమ మార్గం.

క్యాన్సర్ రకం మరియు దశ తెలుసుకోవడానికి బయాప్సీ సిఫార్సు చేయబడింది. ఇది క్యాన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించడంలో వైద్యులకు సహాయపడుతుంది. తద్వారా, వారు మీ క్యాన్సర్ లక్షణాలకు అనుగుణంగా తగిన ఉత్తమమైన చికిత్సను సూచించగలరు. క్యాన్సర్ ఉందా అన్న అనుమానాన్ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి ఇది సూచించబడుతుంది.

అసాధారణ పెరుగుదల క్యాన్సరా కాదా అని నిర్ధారించడానికి బయాప్సీ అవసరం. బయాప్సీ దాదాపు 90% ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. మీకు ఎలాంటి క్యాన్సర్ ఉంది మరియు ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి ఇది మీ వైద్యుడికి సహాయపడుతుంది. ఈ బయాప్సీ పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే, మీ డాక్టర్ మీకు బాగా సరిపోయే క్యాన్సర్ చికిత్సను అందిస్తారు.

నీడిల్ బయాప్సీ, స్కిన్ బయాప్సీ (షేవ్ బయాప్సీ లేదా పంచ్ బయాప్సీ అని కూడా పిలుస్తారు), ఎండోస్కోపిక్ బయాప్సీ, లాపరోస్కోపిక్ బయాప్సీ, బోన్ మ్యారో బయాప్సీ లేదా బోన్ మ్యారో ఆస్పిరేషన్, సర్జికల్ బయాప్సీ, లిక్విడ్ బయాప్సీ మరియు ఇమేజ్-గైడెడ్ బయాప్సీ వంటి వివిధ రకాల బయాప్సీలు ఉన్నాయి.

మీ బయాప్సీ ఫలితాలు క్యాన్సర్ నిర్ధారణకు పాజిటివ్ అని వస్తే, మీ డాక్టర్ మీ క్యాన్సర్ దశ మరియు తీవ్రతను నిర్ణయిస్తారు. ఇది క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించింది మరియు ఎంత తీవ్రంగా పెరుగుతోందనే సమాచారాన్ని అందిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా, మీ డాక్టర్ మీ క్యాన్సర్‌కు ప్రభావవంతంగా పనిచేసే తగిన చికిత్స ప్రణాళికను సూచిస్తారు.

బయాప్సీ ప్రక్రియ యొక్క రకం మరియు బయాప్సీ చేయవలసిన అవయవ రకాన్ని బట్టి, బయాప్సీ వ్యవధి 15 నుండి 30 నిమిషాల వరకు ఉంటుంది. సేకరించిన కణజాల నమూనా క్యాన్సర్ పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపబడుతుంది మరియు బయాప్సీ ఫలితాలను పొందడానికి 3 నుండి 4 రోజులు పడుతుంది.

బయాప్సీ తర్వాత మీకు బాగా అనిపిస్తే అదే రోజున మీరు ఆసుపత్రిని వదిలి వెళ్ళవచ్చు. కానీ ఎంత త్వరగా అనేది, మీ పరిస్థితి మరియు ఏ భాగం బయాప్సీ చేయబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ డాక్టర్ బయాప్సీ తర్వాత మీ పరిస్థితిని పర్యవేక్షిస్తారు మరియు తదనుగుణంగా మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు.

బయాప్సీ తర్వాత, సేకరించిన నమూనా క్యాన్సర్ విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపబడుతుంది. మీరు బయాప్సీ ఫలితాలను రెండు రోజుల నుండి ఒక వారంలోపు ఆశించవచ్చు. కొన్నిసార్లు, పాథాలజిస్ట్ (pathologist) లేదా హిస్టాలజిస్ట్ (histologist) క్యాన్సర్ కణాలను మరింత ధృవీకరించాల్సి ఉంటుంది. దీనికి నమూనా యొక్క అదనపు పరీక్ష అవసరం మరియు ఫలితాలను పొందడానికి దాదాపు 10 రోజులు పడుతుంది.

Onco క్యాన్సర్ సెంటర్లు 15% వరకు తగ్గింపుతో బయాప్సీ పరీక్షతో సహా రోగనిర్ధారణ పరీక్షలను పొందేందుకు మీకు సహాయం చేస్తుంది. మీరు మా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, Onco Care Plusని ఎంచుకుంటే, మీరు 35% తగ్గింపుతో రోగనిర్ధారణ పరీక్షలను పొందవచ్చు.